Sundar C: ఆ ప్రాంతాన్నంత చేతబడి చేశారు.. హీరోయిన్ ఖుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్-kushboo husband director sundar c about baak movie tamanna raashi khanna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sundar C: ఆ ప్రాంతాన్నంత చేతబడి చేశారు.. హీరోయిన్ ఖుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్

Sundar C: ఆ ప్రాంతాన్నంత చేతబడి చేశారు.. హీరోయిన్ ఖుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 03, 2024 11:19 AM IST

Director Sundar C About Baak Movie: స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఖుష్బూ సుందర్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆమె భర్త్ సుందర్ సి పాపులర్ డైరెక్టర్. తాజాగా హారర్ మూవీ బాక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు డైరెక్టర్ సుందర్ సి.

ఆ ప్రాంతాన్నంత చేతబడి చేశారు.. హీరోయిన్ ఖుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్
ఆ ప్రాంతాన్నంత చేతబడి చేశారు.. హీరోయిన్ ఖుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్

Kushboo Husband Sundar C: 90 దశాబ్ధంలో స్టార్ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నారు ఖుష్బూ. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన ఖుష్బూ అనంతరం టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ భర్త, పాపులర్ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ హారర్ మూవీ బాక్.

సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్ అరణ్మనై (తెలుగులో చంద్రకళ)కి వస్తున్న నాలుగో పార్ట్‌ను తెలుగులో బాక్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మిల్కీ భామ తమన్నా, ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ అండ్ యాక్టర్ సుందర్ సి.

బాక్ సినిమా ఎలా ఉండబోతోంది ?

అరణ్మనై సిరిస్‌లో నాలుగో చిత్రమిది. మొదటి మూడు సినిమాలు తెలుగు, తమిళ్‌లో చాలా పెద్ద విజయాన్ని సాధించాయి. బాక్ విషయానికి వస్తే ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది.

అస్సామీ జానపదంలో బాక్ అనే ఘోస్ట్ ఉండేదని అక్కడి ప్రజల నమ్మకం. తమ ప్రాంతాన్నంతా చేతబడి చేశారనేది వారి విశ్వాసం. ఇది నన్ను చాలా సర్ ప్రైజ్ చేసింది. అదే ఈ బాక్ కథకు బీజం వేసింది. అస్సామీ, బ్రహ్మపుత్ర ప్రాంతంలో ఉండే బాక్ అనే దెయ్యం.. సౌత్‌కి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆలోచనతో అరణ్మనై 4' కథ రాయడం జరిగింది. ప్రేక్షకులని థ్రిల్, సర్ ప్రైజ్ చేసే సినిమా ఇది.

అరణ్మనై3 కి 4 కి ఎలాంటి తేడా ఉంటుంది ?

అరణ్మనై సిరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ వ్యక్తిగత పగ, ప్రతీకారం కేంద్ర బిందువుగా ఉంటాయి. అరణ్మనై 4 ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఒక ఎక్స్‌ట్రనల్ ఎలిమెంట్ కథలో భాగం అవుతుంది. అది చాలా కొత్తగా ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి.

తమన్నా, రాశిఖన్నా లని ఎంపిక చేసుకోవడానికి కారణం?

అరణ్మనై సిరిస్‌లో వచ్చే అన్ని సినిమాలో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. గత చిత్రాలలో త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కావాలి. ఎమోషన్స్‌ని చక్కగా పలికించాలి. ఈ పాత్రల కోసం తమన్నా, రాశీ ఖన్నాలు యాప్ట్ ఛాయిస్. ఇందులో కొత్త తమన్నాని చూస్తారు. రాశిఖాన్నా పాత్ర కూడా అదిరిపోతుంది. వారి నటన చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను.

ఖుష్బూ గారితో కథలని పంచుకుంటారా?

స్టొరీ ఐడియాని డెవలప్ చేయకముందు.. ఐడియా ఎలా ఉందని అడుగుతాను. తనకి నచ్చాకా ఇంక కథని డెవలప్ చేస్తాను. మళ్లీ కథ చెప్పడం ఉండదు. ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను.

ఈ సినిమా ప్రయాణంలో మీకు సవాల్ గా అనిపించిన అంశం?

ఈ సినిమా సీజీ ఛాలెంజ్‌గా అనిపించింది. ఏడాదిన్నర పాటు సీజీ వర్క్ చేశాం. క్లైమాక్స్ షూటింగ్ చాలా సవాల్‌గా అనిపించింది. అది మీరు తెరపైనే చూడాలి. ఇందులో సీజీ వర్క్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నాం. మూడు వారాల తర్వాత హిందీ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.

IPL_Entry_Point