Box Office: 40 కోట్లకు దగ్గరిగా బాలీవుడ్ మూవీ.. ప్రశంసలు వచ్చినా పెరగని బాక్సాఫీస్ కలెక్షన్స్-kartik aaryan chandu champion 5 days worldwide box office collection bollywood box office report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Box Office: 40 కోట్లకు దగ్గరిగా బాలీవుడ్ మూవీ.. ప్రశంసలు వచ్చినా పెరగని బాక్సాఫీస్ కలెక్షన్స్

Box Office: 40 కోట్లకు దగ్గరిగా బాలీవుడ్ మూవీ.. ప్రశంసలు వచ్చినా పెరగని బాక్సాఫీస్ కలెక్షన్స్

Sanjiv Kumar HT Telugu

Chandu Champion 5 Days Box Office Collection: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన హిందీ బయోపిక్ సినిమా చందు ఛాంపియన్‌కు కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చందు చాంపియన్ మూవీ ఐదు రోజుల్లో సుమారుగా రూ. 40 కోట్లకు చేరుకుంది.

40 కోట్లకు దగ్గరిగా బాలీవుడ్ మూవీ.. ప్రశంసలు వచ్చినా పెరగని బాక్సాఫీస్ కలెక్షన్స్

Chandu Champion Box Office Collection: కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత పతనాన్ని చవిచూసింది. పాపులర్ వెబ్ సైట్స్ ప్రకారం ఈ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా ఐదో రోజు అయిన మొదటి మంగళవారం నాడు రూ. 3.25 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే గత ఐదు రోజులుగా చూసుకుంటే ఇది తక్కువగానే ఉంది.

మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సినిమా చందు ఛాంపియన్ ఇండియాలో ఇప్పటివరకు రూ. 30 కోట్లు క్రాస్ చేయలేదని సమాచారం. అంటే ఇండియాలో ఈ సినిమాకు ఇప్పటివరకు రూ. 29.75 నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక చందు ఛాంపియన్ మూవీ ఐదు రోజుల్లో రూ. 31.5 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగలిగింది.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో చందు ఛాంపియన్ సినిమాకు రూ. 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులన్నింటిని కలుపుకుని మొత్తంగా రూ. 39 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, ఇవి కోటి తక్కువతో సుమారుగా రూ. 40 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది చందు ఛాంపియన్ చిత్రం

ఇదిలా ఉంటే, చందు ఛాంపియన్ మూవీ తొలి రోజు రూ. 4.75 కోట్లు, రెండో రోజు రూ. 7 కోట్లు రాబట్టింది. అలాగే మూడో రోజు ఈ చిత్రం రూ. 9.75 కోట్లు వసూలు చేయగా, నాలుగో రోజు రూ. 5 కోట్లకు పడిపోయింది. ఐదో రోజు కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ చిత్రం ఇండియాలో రూ. 29.75 కోట్లు వసూలు చేసింది. చందు ఛాంపియన్ మంగళవారం మొత్తం 13. 86 శాతం హిందీ ఆక్యుపెన్సీని మాత్రమే సాధించింది.

కాగా చందు ఛాంపియన్ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో ఇండియాకు మొదటి పారాలింపిక్ స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చిన విజేత మురళీకాంత్ పెట్కర్ అసాధారణ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియన్ ఆర్మీ సైనికుడి నుంచి రెజ్లర్‌గా, బాక్సర్‌గా, 1965 యుద్ధ వీరుడిగా, స్విమ్మర్‌గా తన జీవితంలో ఎన్నో రకాలుగా, అనేక దశల్లో పెట్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తింపబడ్డారు.

అలాంటి మురళీకాంత్ పెట్కర్ పాత్రలో నటించిన కార్తీక్ ఆర్యన్ తన అద్భుతమైన నటనాప్రదర్శనను చూపించాడు. కార్తీక్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ అవి కలెక్షన్ల రూపంలోకి మారట్లేదు. ఇక ఈ మూవీలో ఈ హీరోతోపాటు విజయ్ రాజ్, భువన్ అరోరా, రాజ్‌పాల్ యాదవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.