Extra Ordinary Man Review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ - నితిన్, రాజశేఖర్ మూవీ ఎలా ఉందంటే?
Extra Ordinary Man Review: నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Extra Ordinary Man Review: నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) హీరోహీరోయిన్లుగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కిక్, రేసుగుర్రం లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో రచయితగా బ్లాక్‌బస్టర్ అందుకొన్న వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సీనియర్ హీరో రాజశేఖర్ (Rajashekar) కీలక పాత్రలో నటించాడు. బ్లాక్‌బస్టర్ సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న నితిన్‌కు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌తో ఆ కల తీరిందా? అతడికి వక్కంతం వంశీ హిట్ ఇచ్చాడా? లేదా? అన్నది చూద్దాం.

జూనియర్ ఆర్టిస్ట్ కథ...
అభి (నితిన్) ఓ జూనియర్ ఆర్టిస్ట్. హీరో కావాలన్నది అతడి కల. కానీ అతడి కల తీరక బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా గుంపులో గోవిందలా మిగిలిపోతాడు. అభి చేసే పనులు అతడి తండ్రికి (రావురమేష్) నచ్చవు. ఎప్పుడు అతడిని తిడుతూనే ఉంటాడు. ఓ సమస్య నుంచి కార్పొరేట్ కంపెనీ ఓనర్ అయిన లిఖితను (శ్రీలీల) అభి సేవ్ చేస్తాడు. తన కంపెనీలోనే అభికి సీఈవోగా జాబ్ ఇస్తుంది లిఖిత.
కుటుంబ బాధ్యతల కారణంగా జాబ్ జాయిన్ కావాలని అనుకున్న అభికి అప్పుడే హీరోగా అవకాశం వస్తుంది. ఆ ఆఫర్ కోసం లిఖిత ఇచ్చిన జాబ్‌ను వదులుకుంటాడు అభి. చివరి నిమిషంలోనే అతడికి ఆ సినిమాలో అవకాశం చేజారిపోతుంది. దాంతో తాగుడుకు బానిసగా మారుతాడు. మరోవైపు ఇల్లీగల్ బిజినెస్‌లు చేసే నీరోను (సుదేవ్ నాయర్) అడ్డుకోవడానికి పోలీసులు భయపడుతుంటారు. అతడి ఊరికి ఎస్ఐ సాయినాథ్ (నితిన్) కొత్తగా వస్తాడు.
నీరోకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అతడిపై ఎటాక్స్ చేస్తుంటాడు. తన శత్రువు అర్జున్ బల్‌దేవ్ (రాజశేఖర్)...సాయినాథ్‌ను పంపించాడని నీరో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎస్ఐ సాయినాథ్‌కు, జూనియర్ ఆర్టిస్ట్ అభికి ఉన్న సంబంధం ఏమిటి? సాయినాథ్ పోలీస్ కాదనే నిజం నీరోకు కనిపెట్టాడా?
అర్జున్ బల్‌దేవ్, నీరోలలో సాయినాథ్ ఎవరు మనిషి? హీరో కావాలనే అభి కలను తండ్రి అర్థం చేసుకున్నడా? లిఖితతో అభి ప్రేమాయం ఎలా సాగింది? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man Review) మూవీ కథ.
కమర్షియల్ ఎంటర్‌టైనర్...
మాస్ మసాలా సినిమాలతో పోలిస్తే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు హీరోగా నితిన్‌కు పెద్ద సక్సెస్‌లను తెచ్చిపెట్టాయి. రచయితగా కమర్షియల్ కామెడీ కథలకు వక్కంతం వంశీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌తో(Extra Ordinary Man Review) తమకు అచ్చొచ్చిన జానర్‌లోనే నితిన్, వక్కంతం వంశీ అడుగులు వేశారు.
జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో హీరో కనిపించడం అనే పాయింట్ దర్శకుడు వక్కంతం వంశీ ఈ కథను రాసుకున్నాడు. ఆ క్యారెక్టర్ చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్‌తో పాటు రివేంజ్ యాక్షన్ డ్రామాను అల్లుకుంటూ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను నడిపించాడు. కథ కంటే కామెడీని పండించడంపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. నవ్విస్తే పాస్ అయిపోవచ్చుననే ప్రయత్నంలో కథ చాలా చోట్ల పక్కదారి పట్టింది.
స్ఫూఫ్‌లు పేలాయి...
జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్ పాత్ర నేపథ్యంలో స్ఫూఫ్‌లు కొన్ని బాగా పేలాయి. అయితే ఆ టెంపోను ఆసాంతం కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తర్వాత లిఖిత పాత్ర ఎంట్రీ...ఆమెతో హీరో ప్రేమాయణం కూడా ఫక్తు కమర్షియల్ సూత్రాలకు అనుణంగా సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ పేరుతో టైమ్‌పాస్ చేసిన దర్శకుడు సెకండాఫ్‌లో జూనియర్ ఆర్టిస్ట్... పోలీస్‌గా అవతారం ఎత్తడం అనే ట్విస్ట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. అభి కోసం డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్‌లోని అంశాలు రియల్‌గా జరగడం అంటూ క్యూరియాసిటీ కలిగించారు.
సాయినాథ్, నీరో కథలోని అర్జున్ బల్‌దేవ్ ఎంట్రీ ఇవ్వడం లాంటి మలుపుల నుంచి అంతర్లీనంగా కామెడీ రాబట్టుకుంటూ డీసెంట్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.
కామెడీ టైమింగ్ ప్లస్...
జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ లుక్స్‌తో పాటు పాత్రల మధ్య చక్కటి వేరియేషన్ చూపించారు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌గా పాటలకు మాత్రమే శ్రీలీల పరిమితమైంది. రాజశేఖర్ క్యారెక్టర్ ఈ సినిమాకు హైలైట్ అయ్యింది. అతడిని ఈ పాత్రలో చూడటం ఫ్రెష్‌ఫీలింగ్ కలుగుతుంది. రావురమేష్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. హరీస్ జయరాజ్ బీజీఎమ్ తేలిపోయినా పాటలు మాత్రం బాగున్నాయి. డేంజర్ పిల్లా పాట ఆకట్టుకుంటుంది.
Extra Ordinary Man Review -టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టైమ్‌పాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ. కథ, కథనాల కంటే కామెడీ ఆశించి థియేటర్‌లో అడుగుపెడితే మాత్రం డిసపాయింట్ చేయదు.
రేటింగ్: 2.75/5
టాపిక్