Digestive drinks: వీటిలో ఏదో ఒక డ్రింక్ ఉదయాన్నే తాగండి.. జీర్ణశక్తి మెరుగవుతుంది
Digestive drinks: ఉదయాన్నే పరిగడుపున ఈ డ్రింక్స్ తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవన్నీ సింపుల్ గా రెడీ చేసుకునే పానీయాలే. వీటితో మీ రోజు మొదలుపెడితే జీర్ణ సమస్యలు మీ ధరిచేరవు.
జీర్ణశక్తి సరిగ్గా ఉంటే సగం వ్యాధులు రాకుండా చూసుకున్నట్లే. కెఫీన్ ఉన్న కాఫీ, టీలతో మీ రోజు మొదలుపెడితే మీ శరీరానికి ఎంతో హాని జరుగుతుంది. బదులుగా పరిగడుపున ఈ ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. వీటితో మీ జీర్ణశక్తి మెరుగవుతుంది. ఏం తిన్నా సులువుగా అరుగుతుంది.
1. అల్లం టీ:
అల్లానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. దీనికి జీర్ణశక్తి పెంచే గుణాలున్నాయి. అల్లం చిన్న ముక్కలుగా చేసి దాన్ని నీటిలో మరిగించి టీ చేసుకోవచ్చు. లేదంటే జింజర్ పౌడర్ ఉన్నా వాడొచ్చు. దీన్ని తాగితే గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి.
2. నిమ్మ నీరు:
నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచుతుంది. శరీరంలో పీహెచ్ స్థాయుల్ని నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపుతుంది. ఉదయాన్నే రెండు చెంచాల నిమ్మరసం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని మీ రోజును మొదలుపెట్టండి. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కడుపులో ఉండే ఎంజైమ్‌లతో సిట్రిక్ యాసిడ్ చర్మ జరిపి జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది.
3. గోధుమగడ్డి షాట్స్:
తాజా గోధుమగడ్డి జ్యూస్ ఉదయాన్నే తాగితే శక్తివంతమైన ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గించడం, చర్మం ఆరోగ్యం పెంచడంలో, కణాలను శుద్ధి చేయడంలో, రోగ నిరోధక శక్తి పెంచడంలో సాయపడుతుంది. అలాగే బలహీనత, ఆర్థటైటిస్ లాంటి సమస్యలూ తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. దీనికోసం తాజా గోధుమగడ్డి వాడి జ్యూస్ చేసి తాగడం మంచిది.
4. యాపిల్ సిడర్ వెనిగర్:
ఒకటి లేదా రెండు చెంచాల యాపిల్ సిడర్ వెనిగర్‌ను గ్లాస్ నీటిలో కలపండి. దీన్ని ఉదయాన్నే తాగాలి. దీంతో జీర్ణశక్తి పెరుగుతంది. పీహెచ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది. మీ జీవక్రియను కూడా మెరుగుపరిచే పుల్లని డ్రింక్ ఇది.
5. కలబంద రసం:
ప్రేగు ఆరోగ్యాన్ని పెంచి, జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేయడంలో కలబంద రసం సాయపడుతుంది. మీకు అలవాటు లేకపోతే ముందుగా చాలా తక్కువ పరిమాణంలో మొదలుపెట్టి క్రమంగా పెంచండి. అలవాటు పడ్డాక దీన్ని తాగితే తాజా అనుభూతి వస్తుంది. ఇది సంపూర్ణ ఆరోగ్యం పెంచడంలో సాయపడుతుంది.