Wheatgrass Juice Benefits। గోధుమగడ్డి జ్యూస్ ఒక సర్వరోగ నివారిణి, రోజూ తాగండి!-wheatgrass juice is a living food know health benefits of drinking chlorophyll rich juice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wheatgrass Juice Benefits। గోధుమగడ్డి జ్యూస్ ఒక సర్వరోగ నివారిణి, రోజూ తాగండి!

Wheatgrass Juice Benefits। గోధుమగడ్డి జ్యూస్ ఒక సర్వరోగ నివారిణి, రోజూ తాగండి!

HT Telugu Desk HT Telugu
Jul 28, 2023 07:07 AM IST

Wheatgrass Juice Benefits: ప్రతిరోజూ గోధుమగడ్డి జ్యూస్ తాగటం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Wheatgrass Juice Benefits
Wheatgrass Juice Benefits (stock pic)

Wheatgrass Juice Benefits: వీట్‌గ్రాస్‌ లేదా గోధుమ గడ్డిని సాధారణంగా 'జీవ ఆహారం' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ గడ్డిలో అత్యధిక శాతం క్లోరోఫిల్ ఉంటుంది, సుమారు 70 శాతం క్లోరోఫిల్ కంటెంట్ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చని మొక్కల్లో ఉండే ఒక రసాయన సమ్మేళనం, దీని వల్లనే మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి ఆహారం అనగా పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. అందుకే దీనిని జీవ ఆహారంగా పేర్కొంటారు. గోధుమ గడ్డి రసం పిండి జ్యూస్ రూపంలో తాగుతారు, ఇది పొడి రూపంలో కూడా వస్తుంది. ఈ వీట్ గ్రాస్ అనేది పుష్కలమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఒక సూపర్ ఫుడ్. ఇందులో అనేక రకాల విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం వంటి మినరల్స్, ఇంకా అనేక రకాల అమినో యాసిడ్‌లతో నిండి ఉంటుంది.

గోధుమ గడ్డి జ్యూస్‌ను ప్రతిరోజు తాగడం ద్వారా లెక్కలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆరోగ్య టానిక్‌గా తాగవచ్చు, తద్వారా కొన్ని నిర్దిష్ట వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడవచ్చునని చెబుతున్నారు.

కాలేయం ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు గోధుమగడ్డి జ్యూస్ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ గోధుమగడ్డి జ్యూస్ తాగటం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గోధుమగడ్డి జ్యూస్ తాగడం ద్వారా పుష్కలమైన పోషకాలు శరీరానికి అందుతాయి, ఇది మీకు మంచి శక్తిని ఇస్తుంది, జీర్ణక్రియలో తోడ్పడుతుంది, మీ రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే రక్షణ కవచం మీ శరీరానికి లభిస్తుంది.

గాయాలను నయం చేస్తుంది

గోధుమ గడ్డి జ్యూస్ యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని నొప్పులు, వాపులు, మంటను తగ్గిండంలో సహాయపడుతుంది. ఇందులోని క్లోరోఫిలిన్ సమ్మేళనం, బాక్టీరియోస్టాటిక్ గుణాలు గాయాలను త్వరగా నయం చేయడంలో పాత్రవహిస్తుంది, అంతేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

కాలేయ ఆరోగ్యం కోసం

కాలేయం ఒక ముఖ్యమైన అవయవం, ఇది ఆరోగ్యంగా ఉంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే శరీరంలోని టాక్సిన్లను నిర్విషీకరణ చేయడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గోధుమ గడ్డి రసంలో కోలిన్, అధిక మినరల్ కంటెంట్ కారణంగా, ఇది కూడా ఒక డీటాక్సింగ్ పానీయంలా పనిచేసి కాలేయంపై పనిభారాన్ని తగ్గిస్తుంది, తద్వారా కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది, కాలేయం పనితీరును పెంచుతుంది.

క్యాన్సర్ నివారణ

వీట్‌గ్రాస్ జ్యూస్ అనేది యాంటీక్యాన్సర్ థెరపీకి ప్రత్యామ్నాయ ఔషధం (CAM). ఇందులో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ క్లోరోఫిల్, లాట్రిల్, యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ సూపర్ ఆక్సైడ్ డిస్‌ముటేస్ (SOD). వంటివి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి.

హైబీపీని తగ్గిస్తుంది

అధిక రక్తపోటును తగ్గించడానికి గోధుమగడ్డి జ్యూస్ సహజమైన ఔషధం. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ నుండి కొలెస్ట్రాల్‌ను తుడిచివేయడానికి, అలాగే శరీరం అంతటా రక్త మార్గాలను విస్తరిండానికి సహాయపడుతుంది. తద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది.

డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది

కొన్ని అధ్యయనాల ప్రకారం, గోధుమ గడ్డిలో ఇన్సులిన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉన్నందున, ఇది టైప్ II డయాబెటిస్‌ను అదుపు చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఆహారాల గ్లైసెమిక్ సూచికను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

పోషకాహార లోపాన్ని తీరుస్తుంది

వీట్ గ్రాస్ జ్యూస్ అధిక-నాణ్యత ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, విటమిన్లు, ఖనిజాలను సరఫరా చేస్తుంది, తద్వారా శరీరానికి ఎటువంటి ముఖ్యమైన పోషకాహారం లోటు ఉండదు. ఇది పోషకాహార లోపాలను తీరుస్తుంది, శరీరంలో శక్తిని పునరుద్ధరిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం