Credit card tips : క్రెడిట్ కార్డు లిమిట్ మొత్తాన్ని వాడేస్తున్నారా? అయితే, ఇది మీరు తెలుసుకోవాలి..
Credit card tips : క్రెడిట్ కార్డు ద్వారా చేసే చిన్నచిన్న తప్పుల వల్ల మన మీద ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు లిమిట్‌ని పూర్తిగా వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డు అనేది ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటోంది. అయితే, క్రెడిట్ కార్డులను సరిగ్గా వినియోగిస్తేనే ఆర్థికంగా మనకి ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా.. ఒకవేళ మీరు క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని వాడేస్తుంటే ఇది కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.
క్రెడిట్ లిమిట్ మొత్తం వాడేస్తున్నారా?
మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటే, క్రెడిట్ లిమిట్‌ని పూర్తిగా లేదా దాని కంటే ఎక్కువ ఖర్చు చేయడం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ ఆర్థిక ప్రణాళికను గందరగోళంలోకి నెట్టడమే కాకుండా మీ క్రెడిట్ స్కోర్‌ని దెబ్బతీసే అవకాశం ఉంది.
ఐడియల్ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది 30 శాతం. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.7 లక్షలు అయితే, ఐడియల్ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్) ప్రకారం.. మీరు రూ .2.10 లక్షలకు మించి (రూ .7 లక్షలలో 30 శాతం) ఖర్చు చేయకూడదు.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటి?
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్డుకు ఉన్న క్రెడిట్ శాతం. ఇది మీ క్రెడిట్ స్కోరును నిర్ణయించడంలో ఒక ముఖ్యమైన అంశం. మీ క్రెడిట్ కార్డుల్లో మీ క్రెడిట్ లిమిట్‌ని ఎంత వరకు ఉపయోగించవచ్చే ఇది సూచిస్తుంది.
దీనిని ఈ క్రింది సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు:
(క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్/ క్రెడిట్ కార్డ్ లిమిట్ X 100).
ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒకరికి మొత్తం క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ రూ .5 లక్షలు! మొత్తం క్రెడిట్ లిమిట్ రూ .10 లక్షలు. దీని అర్థం CUR 5/10 X 100 అంటే 50 శాతానికి సమానం.
తక్కువ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (30 శాతం కంటే తక్కువ) సాధారణంగా మీ క్రెడిట్ స్కోరుకు మంచిదని భావిస్తారు. తక్కువ సీయూఆర్ అంటే మీరు క్రెడిట్‌ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారని అర్థమవుతుంది.
ఇది మీరు తక్కువ రిస్క్ కలిగి ఉన్నారని రుణదాతలకు సూచిస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోరును పెంచుతుంది.
అయితే, మీరు ఐడియల్ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోని నిర్వహించడానికి కష్టపడుతుంటే, మీరు కొన్ని టిప్స్‌ని పాటించవచ్చు. అవేంటంటే..
ఇలా మేనేజ్ చేసుకోండి..
1. సకాలంలో చెల్లింపు: తీసుకున్న అప్పును స్టేట్మెంట్ క్లోజింగ్ డేట్‌కి ముందే చెల్లించండి.
2. క్రెడిట్ లిమిట్ పెంచడం: క్రెడిట్ లిమిట్ పెంచాలని మీరు మీ బ్యాంకును అభ్యర్థించవచ్చు. అధిక పరిమితి మీ వినియోగ నిష్పత్తిని తగ్గిస్తుంది. కానీ ఖర్చులు విపరీతంగా పెరగడం ఉత్తమం కదు.
3. ఒకటి కంటే ఎక్కువ కార్డులు: మీకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే, కేవలం ఒక్క కార్డుపై ఎక్కువ వాడకాన్ని తగ్గించుకోవచ్చు.