South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే ఆదాయం ఎంతో తెలుసా? 10 ముఖ్యమైన అంశాలు
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డ్ సృష్టించింది. కరోనా కష్టకాలం నుంచి గట్టెక్కి.. భారీగా ఆదాయాన్ని పెంచుకుంది. ఊహించని విధంగా రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. దీంట్లో ఒక్క సికింద్రాబాద్ నుంచే 50 శాతానికి పైగా ఆదాయం వచ్చింది.
రైల్వే శాఖపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. భయంతో ప్రయాణికులు రైళ్లు ఎక్కడం తగ్గించారు. ముఖ్యంగా 2019-20లో రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య చాలా తక్కువ. ఆ తర్వాత నుంచి ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. అయినా.. కొవిడ్‌కు ముందున్న ప్రయాణికుల సంఖ్యను ఇప్పటికీ చేరుకోలేదు. కానీ.. ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఆదాయం ఊహించని విధంగా పెరిగింది. దీనికి సంబంధించిన 10 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.ప్రయాణికుల ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వేకు రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
2.దక్షిణ మధ్య రైల్వే ఆదాయం 2020-21లో రూ.9907.90 కోట్లు ఉండగా.. 2023-24లో రూ.20,339.40 కోట్లకు చేరింది.
3.స్పెషల్ ట్రైన్స్‌ను ఎక్కువ ఛార్జీలతో నడిపిస్తున్న కారణంగా.. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరుగుతోంది.
4.సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఆరు డివిజన్లు ఉన్నాయి. వాటిలో ఒక్క సికింద్రాబాద్ నుంచే 51.16 శాతం ఆదాయం వచ్చింది.
5.విజయవాడ డివిజన్ నుంచి 27.70 శాతం ఆదాయం వచ్చింది.
6.సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉంది. గతేడాది 26.26 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు.
7.సికింద్రాబాద్ డివిజన్ నుంచి 8.37 కోట్ల మంది (29.68 శాతం), హైదరాబాద్-2.70 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు.
8.ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ డివిజన్ నుంచి 3.90 కోట్లు, గుంటూరు-1.57 కోట్లు, నాందేడ్-3.32 కోట్లు, విజయవాడ డివిజన్ నుంచి 6.36 కోట్ల మంది (24.40 శాతం) ప్రయాణించారు.
9.ప్రయాణికులపై అధికారులు వేసిన అంచనాలు ఇలా ఉన్నాయి. 2024-25లో 28.99 కోట్ల మంది ప్రయాణిస్తారని అంచనా వేయగా.. సెప్టెంబరు నాటికే 13.06 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు.
10.సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 229 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి 51 రైళ్లను ఆపరేట్ చేస్తున్నారు.