Rashmika Shirt : విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకున్న రష్మిక.. సమ్‌థింగ్.. సమ్‌థింగ్!
Rashmika Shirt : విజయ్ దేవరకొండ, రష్మిక మీద కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ.. సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా మరోసారి ఇద్దరి విషయం చర్చకు వచ్చింది.
నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ(Rashmika Mandanna-Vijay Devarakonda) సన్నిహితులు. చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. రోజురోజుకూ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. అందుకు నిదర్శనంగా తాజాగా ఓ ఫోటో వైరల్‌గా మారింది. రష్మిక మందన్న ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఈసారి ఆమె ధరించిన చొక్కా అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ చొక్కాను రష్మిక వేసుకుందని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ ఇలాంటి షర్ట్ వేసుకుని కనిపించాడు. రెండు ఫోటోలు ఒకదానికొకటి లింక్ చేసి వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏమంటారో వేచి చూడాలి .
గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలా మందికి డౌట్. తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని వీళ్లు చెబుతూ వస్తున్నారు. కానీ నెటిజన్ల సందేహాలు మాత్రం తీరడం లేదు. ఇప్పుడు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వేసుకున్న షర్ట్ లాంటిదే వేసుకోవడంతో అనుమానం మరింత పెరిగింది.
ఇంతకుముందు సన్నిహితంగా మెలిగిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. ఇద్దరూ ఇంకా సన్నిహితంగానే ఉన్నారు. ఇటీవల ఓ లంచ్ పార్టీలో కూడా కలిశారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఫ్రెండ్స్ తో రష్మిక కలిసి లంచ్ కి వెళ్లినట్టుగా ఉంది. అందులో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు. రష్మిక, విజయ్.. ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరికీ మంచి ఆఫర్లు వస్తున్నాయి. రష్మిక బాలీవుడ్‌లోనూ మెరుస్తోంది.
రష్మిక మందన్న విజయ్ దేవరకొండకు మాత్రమే కాకుండా అతని కుటుంబానికి కూడా సన్నిహితంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) నటించిన ‘బేబీ’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ప్రీమియర్ షోకు రష్మిక మందన్న హాజరైంది. ఆనంద్ దేవరకొండ కెరీర్‌కు రష్మిక సపోర్ట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. రష్మికను రష్ అని పిలుస్తానని ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంటే.. రష్మికకు విజయ్ కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు తాజాగా విజయ్ వేసుకున్నలాంటి షర్ట్ వేసుకోవడంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్లో ఉన్నారని జనాలకు అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఆహా.. ఓహో.. సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయంపై పూర్తిస్థాయి క్లారిటీ లేదు.