Civil Assistant Surgeon: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్,280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AP Civil Assistant Surgeon Notification : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ పరిధిలోని మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు బోర్డు సోమవారం నోటిపికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ పరిధిలోని మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టులు, పీహెచ్‌సీలు, ఇతర వైద్య ఆరోగ్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులను నుంచి డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో https://apmsrb.ap.gov.in/msrb/ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరో 28 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు
ఏపీ ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో 28 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు డిసెంబర్ 6న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించున్నారు.
ముఖ్యాంశాలు
- సివిల్ అసిస్టెంట్ సర్జన్లు - 28 పోస్టులు.
- ఫ్రెష్ మెడికల్ గ్రాడ్యుయేట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకానికి పరిశీలిస్తారు.
- కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది సమయానికి నియమిస్తారు. అనంతరం సంతృప్తికరమైన సేవలను అనుసరించి సర్వీసు పొడిగిస్తారు.
- వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ కోసం తాత్కాలిక షెడ్యూల్ 06.12.2024 ఉదయం 09:00 AM నుంచి
- మెరిట్ జాబితాలను అభ్యర్థుల WhatsApp/e-mail ద్వారా తెలియజేస్తారు.
- ప్రభుత్వ ఆమోదం తర్వాత జాబితాను వెబ్‌సైట్ లో పెడతారు.
- ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్‌తో అర్హత సర్టిఫికెట్లతో పాటు హాజరు కావాల్సి ఉంటుంది.
- వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.
i. SSC సర్టిఫికేట్ లేదా దానికి సమానమైన సర్టిఫికెట్ (పుట్టిన తేదీ రుజువు)
ii. M.B.B.S డిగ్రీ సర్టిఫికేట్
iii. P.G సర్టిఫికేట్ /P.G. డిప్లొమా/డీఎన్బీ
iv. M.B.,B.S డిగ్రీ అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు
v. చెల్లుబాటు అయ్యే ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
vi. 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ప్రైవేట్ పాఠశాల విషయంలో, స్థానిక అభ్యర్థిత్వం ప్రొఫార్మాలో 10వ తరగతికి ముందు ఏడు సంవత్సరాల కాలానికి సంబంధించిన సర్టిఫికేట్ ను సంబంధిత తహశీల్దార్ నుంచి పొందాలి. తెలంగాణ నుంచి వచ్చిన వారు స్థానిక సర్టిఫికెట్ సమర్పించాలి.
vii. EWS సర్టిఫికేట్
viii. ఆర్థోపెడికల్ వైకల్యం ఉన్నట్లయితే సదరమ్ లో జారీ చేసిన వైకల్యం సర్టిఫికేట్
ix. ఎక్స్-సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్
అభ్యర్థులు విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ లో డిసెంబర్ 6న వాక్ ఇన్ రిక్రూట్‌మెంట్‌కు హాజరు కావాలి.