AP Civil Asst Surgeons: ఏపీలో 185 సివిల్ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వాకిన్ రిక్రూట్‌మెంట్..-walkin recruitment for 185 civil assistant surgeon posts in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Civil Asst Surgeons: ఏపీలో 185 సివిల్ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వాకిన్ రిక్రూట్‌మెంట్..

AP Civil Asst Surgeons: ఏపీలో 185 సివిల్ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు వాకిన్ రిక్రూట్‌మెంట్..

Sarath chandra.B HT Telugu
Feb 21, 2024 06:19 AM IST

AP Civil Asst Surgeons: ఏపీలో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు భర్తీకి వాకిన్‌ రిక్రూట్‌మెంట్‌ Walk In Recruitment నిర్వహిస్తున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ Secondary Health Directorate ప్రకటించింది.

ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ (unsplash)

AP Civil Asst Surgeons: ఆంధ్రప్రదేశ్‌లో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో వైద్య విధాన పరిషత్‌‌ను సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా మార్పు చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సెకండ‌రీ హెల్త్ డైరెక్టరేట్‌ ప‌రిధిలో 185 మంది సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల నియామ‌కానికి ఫిబ్రవరి నెల 28, మార్చి1వ తేదీల్లో వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబ‌ర్ సెక్ర‌టరీ ఎం.శ్రీనివాస‌రావు తెలిపారు.

తొలుత ఫిబ్రవరి 21, 23, 26 తేదీల్లో నిర్వ‌హించాల‌నుకున్న వాకిన్ రిక్రూట్మెంట్‌ ప్రక్రియ స్థానంలో ఫిబ్రవరి 28, మార్చ్ 1 తేదీల్లో భర్తీ ప్రక్రియ నిర్వ‌హిస్తామ‌ని, అనివార్య కార‌ణాల వ‌ల్ల వాకిన్ రిక్రూట్మెంట్ తేదీల్ని రీషెడ్యూల్ చేయాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను రెగ్యుల‌ర్‌, కాంట్రాక్ట్‌, కొటేషన్ ప‌ద్ధ‌తిలో పోస్టుల్ని భ‌ర్తీ చేస్తామన్నారు. ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు డైరెక్ట‌రేట్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్, 77-2జి, ల‌క్ష్మి ఎలైట్ బిల్డింగ్‌, పాతూర్ రోడ్‌, తాడేప‌ల్లి, గుంటూరు జిల్లా చిరునామాలో నిర్వ‌హించే వాకిన్ రిక్రూట్మెంట్‌కు అర్హ‌త గ‌ల అభ్య‌ర్థ‌ులు స్వ‌యంగా హాజ‌రుకావాల‌ని తెలిపారు.

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ‌లో ఎప్పుడు ఏర్ప‌డిన ఖాళీలను అప్పుడే భ‌ర్తీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు నిరంత‌ర నియామ‌క ప్ర‌క్రియను కొనసాగిస్తున్నామ‌ని తెలిపారు.

జ‌‌న‌ర‌ల్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, డెర్మ‌టాల‌జీ, ఆర్థోపెడిక్స్‌, రేడియాల‌జీ, ఫొరెన్సిక్ మెడిసిన్ విభాగాల‌కు ఈ నెల 28న‌ వాకిన్ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తారు. గైన‌కాల‌జీ, పిడియాట్రిక్స్‌, ఎన‌స్థీసియా, ఇఎన్ టి, అప్తాల్మ‌లాజీ, ప‌థాల‌జీ విభాగాల‌కు మార్చ్ ఒక‌టో తేదీన వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి అర్హతలు, జీతభత్యాల చెల్లింపు, స్థానికతలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/ మరియు https://hmfw.ap.gov.in వెబ్‌సైట్లలో చూడొచ్చని పేర్కొన్నారు.

Whats_app_banner