Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు, ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలతో బంధువుల నుంచి ఒత్తిడి తప్పదట-today december 3rd rasi phalalu in telugu check zodiac signs horoscope predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు, ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలతో బంధువుల నుంచి ఒత్తిడి తప్పదట

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు, ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలతో బంధువుల నుంచి ఒత్తిడి తప్పదట

HT Telugu Desk HT Telugu
Dec 03, 2024 03:10 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 3.12.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

డిసెంబరు 3, నేటి రాశి ఫలాలు
డిసెంబరు 3, నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 3.12.2024

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : మంగళవారం, తిథి : శు. విదియ, నక్షత్రం : మూల

మేష రాశి :

మేషరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమస్యలను మీ తెలివితో చక్కగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు ఆశించిన స్థాన చలన మార్పులుంటాయి. నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల సమయం. వృత్తిపరంగా మీకు అనుకూల సమయం. వ్యాపార పెట్టుబడుల కొరకు భాగస్వామితో చర్చించి తగిన ప్రయత్నాలు చేస్తారు. ధనపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పఠించండి.

వృషభరాశి :

వృషభరాశివారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అదనపు పని ఒత్తిళ్ళు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారపరంగా మధ్యస్థ సమయం. చేపట్టిన పనులు ఆలస్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటా బయట సమస్యలు చికాకుపరుస్తాయి. వృషభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది.

మిధునరాశి :

మిథునరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. మిథునరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటకరాశి :

కర్కాటక రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. కొన్ని రంగాల వారికి ఊహించని పదోన్నతులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ధనపరంగా ఇబ్బందులుంటాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పఠించండి.

సింహరాశి :

సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. దూర ప్రాంతాల బంధువుల నుండి శుభ వార్తలు అందుతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు తొలగుతాయి. సొంత ఆలోచనలతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానపరంగా అనుకూలం. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. సంతానపరంగా విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. పనులలో ఆటంకాలుంటాయి. సింహరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శించండి.

కన్యారాశి :

కన్యారాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ వాతావరణంగా అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహనిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పఠించండి.

తులారాశి :

తులారాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. చేపట్టిన పనులు ఆలస్యం అయినా సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక రుణ సమస్య నుంచి బయటపడతారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు వివాదాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శించండి.

వృశ్చికరాశి :

వృశ్చికరాశివారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఆటంకాలు అధిగమిస్తారు. గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలనుండి విముక్తి కలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పఠించండి. బెల్లంతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి.

ధనుస్సురాశి :

ధనుస్సురాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం తగ్గి ఊరట చెందుతారు. మిత్రులతో కలహ సూచనలున్నాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటలకు విలువ పెరుగుతుంది. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలుంటాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ధనుస్సురాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి హనుమాన్ ఆలయాన్ని దర్శించండి. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి.

మకరరాశి :

మకరరాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులలో ఆటంకాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహణ నిర్మాణ ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలేర్పడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత విషయాలు మిత్రులతో పంచుకుంటారు. బంధువుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మకరరాశివారు మరింత శు భఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శించండి.

కుంభరాశి :

కుంభరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగటం మంచిది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలు కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు కార్యసిద్ధి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పఠించండి.

మీనరాశి :

మీనరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహం శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగస్తులు ఆశించిన పదవులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శించండి.

ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner