ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ - 2024 ప్రక్రియ నడుస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. https://lawcet-sche.aptonline.in/ వెబ్ సైట్ నుంచి సీట్లు పొందిన విద్యార్థులు అలాట్ మెంట్ అర్డర్ కాపీలను పొందవచ్చు.
ఈ సెకండ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు డిసెంబర్ 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రిపోర్టింగ్ చేయకపోతే సదరు విద్యార్థుల సీట్ల కేటాయింపు రద్దు అవుతాయి. ఈ ప్రక్రియ పూర్తి అయితే స్పెషల్ ఫేజ్ లేదా స్పాట్ అడ్మిషన్లకు షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం