Baby Movie Release Date: ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా రిలీజ్ డేట్ ఇదే
Baby Movie Release Date: బేబీ సినిమా విడుదల తేదీ వెల్లడైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Baby Movie Release Date: విజయ్ దేవరకొండ తమ్ముడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న బేబీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని హైదరాబాద్‍లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద గురువారం (జూన్ 29) నిర్వహించిన ఈవెంట్‍లో ప్రకటించింది చిత్రయూనిట్. బేబి మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‍గా ఉండగా.. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గెలిచిన కలర్ ఫొటో సినిమాకు కథ అందించిన సాయి రాజేశ్.. ఈ బేబీ సినిమాకు దర్శకుడిగా ఉన్నాడు. ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ పాటలతో ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నేడు ఈ బేబీ మూవీ రిలీజ్ డేట్‍ను చిత్ర యూనిట్ వెల్లడించింది.
జూలై 14వ తేదీన థియేటర్లలో బేబీ సినిమాను విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ వర్షాకాలంలో మంచి ప్రేమ కథగా ఈ చిత్రం వస్తోందని పేర్కొంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా బేబీ రానుందని తెలుస్తోంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ అశ్విన్ మధ్య ఈ ట్రయాంగిల్ ప్రేమ కథ నడుస్తుంది. డీగ్లామరస్ రోల్‍లోనూ వైష్ణవి నటించింది.
బేబీ మూవీకి సాయి రాజేశ్ దర్శకుడిగా ఉండగా.. విజయ్ బుల్గాన్ సంగీతం అందించాడు. ఇప్పటి వరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా వస్తోంది.
సాఫ్ట్‌వేర్ డెవలపర్ సహా మరిన్ని యూట్యూబ్ సిరీస్‍లతో చాలా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో కనిపిస్తోంది. ఇటీవల కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన వైష్ణవి బేబీ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తోంది. పుష్పక విమానం మూవీ పెద్దగా విజయం సాధించకపోవటంతో ఆనంద్ దేవరకొండకు ఈ బేబీ సినిమా చాలా కీలకంగా మారింది.