New RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా
New RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కమిటీ సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. బుధవారం నుంచి మూడేళ్లపాటు ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS) అధికారి. ఆయన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, US నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు.
33 ఏళ్ల కెరీర్‌లో మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో పనిచేశారు. రెవెన్యూ కార్యదర్శిగా నియమితులు అవ్వకముందు ఆర్థిక సేవల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. రెవెన్యూ శాఖ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆయనకు రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో చాలా అనుభవం ఉంది.
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కోసం పన్ను విధాన రూపకల్పనలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. మంగళవారంతో శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ పదవి ముగియనుంది. ఆయన స్థానంలో రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
టాపిక్