Instagram videos: వ్యూస్ లేకపోతే ఇన్ స్టాగ్రామ్ వీడియోల క్వాలిటీ తగ్గిస్తారట; కొందరు క్రియేటర్లపై వివక్ష కూడా..
Instagram videos: తన ప్లాట్ ఫామ్ లోని వీడియోల క్వాలిటీ గురించి ఇన్ స్టాగ్రామ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు చాలా క్వాలిటీతో కనిపిస్తాయి. మరికొన్ని వీడియోల్లో ఆ క్వాలిటీ కనిపించదు. అందుకు కారణమేంటో ఇన్ స్టా వెల్లడించింది.
Instagram videos: మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్, ప్లాట్ ఫామ్ షార్ట్-ఫామ్ వీడియో కంటెంట్, ఫోటోలు, స్టోరీలకు ప్రసిద్ధి చెందింది. అయితే, ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు చాలా క్వాలిటీతో కనిపించడానికి, మరికొన్ని వీడియోల్లో ఆ క్వాలిటీ కనిపించకపోవడానికి కారణమేంటో ఇన్ స్టా వెల్లడించింది.
క్వాలిటీలో అందుకే ఆ తేడా
ఇన్ స్టా ప్లాట్ ఫామ్ లో తరచుగా చూసే, ఎక్కువ వ్యూస్ ను సాధిస్తున్న వీడియోల క్వాలిటీ మెరుగ్గా ఉంటుందని, దాంతో పోలిస్తే, ఎక్కువగా చూడని, ఎక్కువ వ్యూస్ లేని వీడియోల క్వాలిటీ తక్కువగా ఉంటుందని ఇన్ స్టాగ్రామ్ వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి ‘ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్’ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ (instagram) స్టోరీల్లో క్వాలిటీకి సంబంధించి ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘సాధారణంగా, మొదట్లో స్టోరీ, రీల్ లేదా ఫోటోలను మేం హై క్వాలిటీలోనే చూపిస్తాము. జనరల్ గా ఏ స్టోరీ, ఫొటో, లేదా రీల్ కు మొదట్లోనే ఎక్కువ వ్యూస్ వస్తాయి. వ్యూస్ ఎక్కువగా లేకపోతే, మేం ఆ వీడియో క్వాలిటీని తగ్గిస్తాం. ఒకవేళ, ఆ తరువాత ఆ వీడియోకు వ్యూస్ పెరిగితే, మళ్లీ దాని క్వాలిటీని పెంచుతాం’’ అని వివరించారు.
ఆ క్రియేటర్లకే మద్ధతు
ఎక్కువ వ్యూస్ ను డ్రైవ్ చేసే కంటెంట్ క్రియేటర్లకే ఇన్స్టాగ్రామ్ మద్దతు ఇస్తుందని ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి ధృవీకరించారు. "ఇది వ్యక్తిగత వ్యూయర్ స్థాయిలో కాకుండా మొత్తం సిస్టమ్ స్థాయిలో పనిచేస్తుంది. ఎక్కువ వీక్షణలను డ్రైవ్ చేసే సృష్టికర్తల కోసం మేము అధిక నాణ్యత గల వీడియోలను అందిస్తాం. ఇది బైనరీ త్రెషోల్డ్ కాదు, స్లైడింగ్ స్కేల్' అని మొస్సేరి తెలిపారు.
క్వాలిటీ షిఫ్ట్ సాధారణమే
అయితే, ఈ విధానాన్ని పలువురు యూజర్లు తప్పుబట్టారు. ఈ విధానం ఎదగడానికి ప్రయత్నిస్తున్న చిన్న కంటెంట్ క్రియేటర్లకు అన్యాయం చేస్తుందని ఒక వినియోగదారుడు అదే సెషన్ లో వెంటనే స్పందించాడు. దీనికి ప్రతిస్పందనగా, మొస్సేరి మాట్లాడుతూ, ‘‘మీ ఆందోళన సరైనదే కానీ, ఆ వీడియో క్వాలిటీలో మార్పు పెద్దగా గుర్తించదగినదిగా ఉండదు. ఎందుకంటే నాణ్యత మార్పు పెద్దగా ఉండదు’’ అని వివరించారు.
టాపిక్