Karimnagar : కరీంనగర్ జిల్లాలో రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయి దహనం-karimnagar ramagundam police commissionerate one crore 30 lakh worth of ganja burn ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : కరీంనగర్ జిల్లాలో రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయి దహనం

Karimnagar : కరీంనగర్ జిల్లాలో రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయి దహనం

HT Telugu Desk HT Telugu
Nov 26, 2024 10:13 PM IST

Karimnagar : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 64 కేసుల్లో పట్టుబడ్డ రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. 64 కేసుల్లో 521 కేజీల గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఈ గంజాయిని కోర్టు అనుమతితో దగ్ధం చేసినట్లు పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లాలో రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయి దహనం
కరీంనగర్ జిల్లాలో రూ.కోటి 30 లక్షల విలువైన గంజాయి దహనం

Karimnagar : కరీంనగర్ జిల్లాలో భారీగా గంజాయి దహనం చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 64 కేసుల్లో పట్టుబడ్డ రూ.కోటి 30 లక్షల 38 వేల విలువ గల 521 కిలోల 544 గ్రాముల గంజాయిని దగ్ధం చేశారు పోలీసులు. నిషేధిత గంజాయిని విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు.

రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో 2021 నుంచి ఇప్పటి వరకు 64 కేసుల్లో 521 కిలోల 544 గ్రాముల గంజాయి పట్టుబడింది. యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని యఫ్.యస్.ఎల్. కోసం శాంపిల్ సేకరించి డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మానకొండూర్ లోని వెంకటరమణ ఇన్సినేటర్ ఫ్యాక్టరీ వద్ద దహనం చేశారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేశామని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు.

గంజాయి విక్రయిస్తే పీడీ యాక్ట్ అమలు

గంజాయి మత్తు పదార్ధాలను విక్రయించినా, వినియోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలతోపాటు పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రస్తుతం దగ్ధం చేసిన గంజాయి విలువ రూ.1,30,38,600 ఉంటుందని తెలిపారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులైన C. రాజు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామగుండం, గోదావరిఖని ఏసీపీ ఎం .రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎసిపి మల్లారెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జి. సతీష్ , మల్లేష్ అడ్మిన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దహనం చేశామన్నారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయి సాగుచేసి విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఇద్దరికి కోర్టు క్లీనింగ్ శిక్ష

మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి ఎన్.మంజుల సంచలన తీర్పు ఇచ్చారు. మద్యం సేవించి పట్టుబడ్డ 13 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపర్చగా 13 మందికి న్యాయమూర్తి 14,500/- రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన మామిడి రమేష్, పెద్దపల్లికి చెందిన పంకజ్ కు రూ.500 జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా మూడు రోజులపాటు పెద్దపల్లి జిల్లా కోర్టులో క్లీనింగ్ పనులు చేయాలని తీర్పునిచ్చారు. బుధ, గురు శుక్ర వారాల్లో క్లీనింగ్ పనుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం