TG Food Safety Officer Results : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల, 24 మంది ఎంపిక
TG Food Safety Officer Results : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 24 మంది అభ్యర్థులతో తుది ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు 24 మందిని ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ (హెల్త్) లాబొరేటరీస్ & ఫుడ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 24 పోస్టుల భర్తీ కోసం జులై 21, 2022న నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు నవంబర్ 11, 2022న రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈ నెల 7, 8 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర ధృవీకరణలు పూర్తయిన తర్వాత, టీజీపీఎస్సీ ఇవాళ 24 మంది అభ్యర్థులతో కూడిన తాత్కాలిక ఎంపిక జాబితాను ప్రకటించింది. అభ్యర్థులు ఫలితాల కోసం కమిషన్ వెబ్ సైట్ ను https://www.tspsc.gov.in ను సందర్శించవచ్చు.
అభ్యర్థుల ఎంపిక
1. రాత పరీక్షలో ఉత్తీర్ణత అపాయింట్‌మెంట్ హక్కును అందించదు. అభ్యర్థి సంబంధించిన అన్ని వివరాలు పూర్తి వెరిఫై చేసిన తర్వాత నియామక అధికారి సంతృప్తి మేరకు నియామకం చేపడతారు.
2. అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం ఫిజికల్ గా సరిపోతారని గుర్తించడం.
3. నోటిఫికేషన్ ఆధారంగా అభ్యర్థి ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించాలి.
ఏ అభ్యర్థి అయినా తప్పుడు సమాచారం అందించినట్లు తెలిసినా లేదా ఏదైనా కారణంగా ఎంపిక సక్రమంగా లేకపోయినా.. కమిషన్ తాత్కాలిక ఎంపికను ఏ దశలోనైనా రద్దు చేయవచ్చు. ఎంపికతో సహా అన్ని ప్రయోజనాలు కమిషన్ రిజర్వ్ చేస్తుంది.
బీఈఎల్ ఉద్యోగాలు
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదేళ్ల నిర్ణీత కాలానికి పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలను పనితీరు ఆధారంగా ఏడేళ్ల వరకు పొడిగిస్తారు. భర్తీ చేసే పోస్టుల్లో బెంగుళూరులోని బెల్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పోస్టులు 48, మెకానికల్ 52, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు 75, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 2 ఖాళీలు ఉన్నాయి.
- అంబాలా, జోద్‌పూర్, బటిండాలోని కేంద్రాల్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ పోస్టులు 3 ఉన్నాయి.
- ముంబై, విశాఖపట్నం కేంద్రాల్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పోస్టులు 2 ఉన్నాయి.
- విశాఖపట్నం, ఢిల్లీ, ఇండోర్‌లలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ పోస్టులు 10 ఉన్నాయి.
- ఘజియాబాద్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పోస్టులు 10, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ పోస్టులు 5 ఉన్నాయి.
- మొత్తం పోస్టుల్లో అన్ రిజర్వుడు పోస్టులు 9, ఈడబ్ల్యుఎస్ పోస్టులు 20, ఓబీసీ 61, ఎస్సీ 32, ఎస్టీ 17 ఉన్నాయి. వికలాంగుల కోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
- దరఖాస్తు చేసేవారికి 2024 నవంబర్ 1 నాటికి 28ఏళ్లలోపు వయసు ఉండాలి. ఓబీసీలకు 3ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5ఏల్లు, 40శాతం మించిన దివ్యాంగులకు 10ఏళ్ల సడలింపు ఇస్తారు.
ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి.
సంబంధిత కథనం