Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు, ఈ రాశి వారు ఈ రోజు ఎవరినీ గుడ్డిగా నమ్మకండి మోసపోతారు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 27.11.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశిఫలాలు - 27-11-2024
సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం
అయనము: దక్షిణాయనం
మాసం: కార్తీకము
తిథి: బ.ద్వాదశి
వారం: బుధవారం
నక్షత్రం: చిత్త
మేషం
కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పనులు చకచకా పూర్తవుతాయి. డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్తవారు పరిచయం అవుతారు. వ్యాపారులకు బాగుంటుంది. కళాకారులకు కలసివస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం
అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. గౌరవం పెరుగుతుంది. వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభ సమాచారం అందుకుంటారు. రాజకీయ నాయకులకు తగినగుర్తింపు లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారుల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.
మిథునం
ఆదాయం బాగుంటుంది. ఆలోచనలు కలసివస్తాయి. సమస్యలనుంచి గట్టెక్కుతారు. వివాదాలు తీరతాయి. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు కలసివస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం
అంతా మంచే జరుగుతుంది. సమస్యలు తీరతాయి. డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు శుభసమాచారం అందుకుంటారు. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు పైవారి ప్రశంసలు లభిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. కళాకారులకు, రాజకీయనాయకులకు కలసివస్తుంది.
సింహం
పరిస్థితులు చక్కబడతాయి. వివాదాలనుంచి గట్టెక్కుతారు. ఆదాయం బాగుంటుంది. కొత్త పరిచయాలతో మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు శుభసమాచారం అందుతుంది. వ్యాపారులు లాభాలనార్జిస్తారు. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కొత్త పనులు చేపడతారు.
కన్య
అన్నీ కలసివస్తాయి. సమస్యలు తీరతాయి. డబ్బు చేతికి అందుతుంది. పనులు పూర్తవుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు పైవారి అండ లభిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లోని వారికి కలసివస్తుంది. క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగావకాశం.
తులా
సమస్యలు తీరతాయి. అందరూ కలసివస్తారు. వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభసమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం
అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. సమస్యలు తీరతాయి. గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభ సమాచారం అందుతుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. వ్యాపార విస్తరణ చేపడతారు. ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు కలసివస్తుంది.
ధనుస్సు
అన్ని పనులు చకచకా పూర్తవుతాయి. అనుకోకుండా ఇతరులు సాయం చేస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. వ్యాపారులకు లాభాలను ఆర్జిస్తారు. రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. క్రీడాకారులు, కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.
మకరం
అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. బాధ్యతలు తీరతాయి. కొత్త పనులు చేపట్టడానికి అనుకూలమైనరోజు. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవద్దు. పనుల్లో శ్రద్ధ చూపండి. అందరూ సహకరిస్తారు. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.
కుంభం
సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సమస్యలనుంచి గట్టెక్కుతారు. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు లాభాలనార్జిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది. ఉద్యోగులకు పైవారి ప్రశంసలు లభిస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది.
మీనం
అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. రుణ సమస్యలు తీరతాయి. పనులన్నీ అనుకున్నట్టే పూర్తి చేస్తారు. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు గుర్తింపు లభిస్తుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది.