Infinix Zero 40 5G launch: ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఇది..-infinix zero 40 5g launched in india with 108mp camera gopro integration ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infinix Zero 40 5g Launch: ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఇది..

Infinix Zero 40 5G launch: ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఇది..

Sudarshan V HT Telugu
Sep 19, 2024 07:14 PM IST

ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం లుక్ డివైజ్ ఇన్ఫినిక్స్ జీరో 40 5జీని భారత్ లో లాంచ్ చేశారు. ఇది అనేక కొత్త ఫీచర్లతో నిండి ఉంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 108 మెగా పిక్సెల్స్ తో వస్తుంది. జీరో 40 5జీ ని లాంచ్ చేయడం ద్వారా తన మిడ్ సెగ్మెంట్ లైనప్ ను ఇన్ఫినిక్స్ మరింత విస్తరించింది.

ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్
ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ (Shaurya Sharma - HT Tech)

ఇండియాలో ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ ని ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. ఈ లాంచ్ ద్వారా ఇన్ఫినిక్స్ భారత దేశంలో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లైనప్ ను విస్తరించింది. ఇన్ఫినిక్స్ జీరో 30 5జీకి కొనసాగింపుగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మానిటర్ గా ఉపయోగించడానికి గోప్రోతో ఇన్ఫినిక్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ కంటెంట్ సృష్టిపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. కంటెంట్ క్రియేటర్ల వర్క్ ఫ్లోను వేగవంతం చేయడానికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుండి 4కె 60 ఎఫ్పిఎస్ తో పాటు అనేక టెంప్లెట్లను అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్

ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ 12జీబీ + 256జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.27,999 గా నిర్ణయించారు. అలాగే, 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర రూ.30,999గా ఉంది. ఇది రాక్ బ్లాక్, మూవింగ్ టైటానియం, వయొలెట్ గార్డెన్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ సేల్స్ ఫ్లిప్ కార్ట్ లో సెప్టెంబర్ 21 న ప్రారంభమవుతాయి. వివిధ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో తక్కువ ధరకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్పెసిఫికేషన్లు

ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ (smart phones launch) లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్ ఉంటుంది. ఇందులో 12 జీబీ ర్యామ్ తో 256 జీబీ లేదా 512 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. డిస్ప్లే విషయానికొస్తే, ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో 6.78 అంగుళాల పెద్ద అమోఎల్ఇడి డిస్ ప్లే ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంది.

108 మెగా పిక్సెల్ కెమెరా

ఈ ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ స్మార్ట్ ఫోన్ లో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఇందులో 4కే 60 ఎఫ్పిఎస్ వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉన్న 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇది వ్లాగింగ్ ను ఆస్వాదించే కంటెంట్ సృష్టికర్తలకు సరైనది. తక్కువ వెలుతురులో చిత్రీకరించేటప్పుడు మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లాష్ కూడా ఉంది.

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

ఇన్ఫినిక్స్ (infinix) జీరో 40 5 జీ స్మార్ట్ ఫోన్ (smartphone)లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ వైర్డ్ లేదా 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ అవుతుంది. అదనంగా, ఇది డ్యూయల్ సిమ్ ను సపోర్ట్ చేస్తుంది. దీనికి ఐపి 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ల కోసం జేబీఎల్ ట్యూనింగ్ ఉంది.