Dharma Sandehaalu: దానం చేయడం మంచిదే కానీ, చేసే దానానికి సరైన సమయం తెలుసా!-today november 27th rasi phalalu in telugu check zodiac signs horoscope predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dharma Sandehaalu: దానం చేయడం మంచిదే కానీ, చేసే దానానికి సరైన సమయం తెలుసా!

Dharma Sandehaalu: దానం చేయడం మంచిదే కానీ, చేసే దానానికి సరైన సమయం తెలుసా!

Ramya Sri Marka HT Telugu
Nov 27, 2024 01:21 AM IST

Dharma Sandehaalu: హిందూ సంప్రదాయాల ప్రకారం, దానం చేయడాన్ని అతి పవిత్రమైన కార్యంగా చెబుతారు. ఎవరి సామర్థ్యాలకు తగ్గట్టు వారు దానం చేసి మంచి పని చేశామని భావిస్తారు. కానీ, దానం చేయడానికి ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రత్యేక సమయం ఉంటుందట.

ఏవారం ఏం దానం చేస్తే మంచిది
ఏవారం ఏం దానం చేస్తే మంచిది

మన సంప్రదాయాల ప్రకారం, ధ్యానం చేస్తే వచ్చే ఫలితం కన్నా లేనివాడికి దానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఎక్కువ. నిజానికి దేవుడు కూడా చెప్పిన సత్యమిదే. హిందూ మత గ్రంథాల్లో ఇతరులకు దానం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. కర్మ సిద్ధాంతం కూడా దాన ధర్మాలకు ప్రాముఖ్యతనిస్తుంది. మనం చేసే దాన ధర్మాల ఫలితం భవిష్యత్‌పై లేదా పునర్జన్మలోనైనా సహాయపడుతుందని నమ్ముతారు. కనుక దానం చేయడం అనేది అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు.

దానం చేయడం అత్యంత పుణ్యకార్యం అయినప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు, ఏవి పడితే అవి దానం చేయకూడదట. దానికి కూడా కొన్ని నియమాలు, ఆచారాలు ఉంటాయని, వాటిని పాటించి దానం చేస్తేనే శుభ ఫలితాలు అందుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. దానం చేసిన ఫలితం మనకు దక్కాలంటే, వారంలోని ఒక్కో రోజుకు నిర్దేశించబడిన ప్రత్యేక వస్తువులను దానం చేయడమే మంచిది.

సోమవారం దానం చేయాల్సినవి:

సోమవారం ఆ పరమేశ్వరుడికి, చంద్ర దేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఈ ఇరువురు దేవుళ్ల అనుగ్రహాన్ని పొందేందుకు ఈ వస్తువులను దానం చేస్తే మంచిది. పువ్వులు, బట్టలు, పంచదార, కొబ్బరికాయ, బియ్యం వంటి తెల్లని వస్తువులు దానం చేయాలి.

మంగళవారం దానం చేయాల్సినవి:

హనుమంతుని ఆరాధనకు ప్రత్యేకమైన రోజు మంగళవారం. ఈ రోజున ఎర్రని పువ్వులు, కుంకుమ వస్త్రాలు, ఎర్ర చందనం, బాదం పప్పులను దానం చేస్తే మంచిది.

బుధవారం దానం చేయాల్సినవి:

ఈ రోజున ఆకుపచ్చ రంగులో ఉన్న వస్తువులు దానం చేయడం ఉత్తమం. పెసలు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు, ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు వంటివి దానం చేయడం మంచిది. ఇవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.

గురువారం దానం చేయాల్సినవి:

గురువారం నాడు పసుపు రంగులోని వస్తువులను దానం చేయాలి. పసుపు పప్పు, బెల్లం, పసుపు పండ్లు, బంగారు వస్తువులు వంటివి దానం చేయడం వల్ల శుభ ప్రయోజనాలు కలుగుతాయి.

శుక్రవారం దానం చేయాల్సినవి:

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం చాలా మంచి రోజు. లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీకు కాసుల వర్షం కురవాలంటే, కుటుంబమంతా సంతోషంతో నిండిపోవాలంటే తెల్ల చీర, ఉప్పు, ఖీర్, కుంకుమ వంటి వస్తువులు దానం చేయాలి.

శనివారం దానం చేయాల్సినవి:

శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే శనివారం ఈ వస్తువులను దానం చేయాలి. నల్ల నువ్వులు, ఆవనూనె దానం చేయడం వల్ల శని గ్రహం శాంతిస్తుందని విశ్వసిస్తారు.

ఆదివారం దానం చేయాల్సినవి:

నిత్యజీవితంలో ఎన్నో శుభాలు తెచ్చిపెట్టే దినకరుడికి ఆదివారం ఎంతో ప్రత్యేకం. అందుకే సూర్య భగవానుని ప్రసన్నత పొందేందుకు ఆదివారం గోధుమలు, ఎర్రటి పూలు, కెంపులు లాంటి వస్తువులు దానం చేయాలి.

(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)

Whats_app_banner