Mercury and Scorpio: బుధుడి వల్ల నవంబర్ 30 నుంచి ఈ రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతంగా కలిసొచ్చేస్తుంది-due to mercury from november 30 the people of this zodiac sign will have a lot of success in job and business ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury And Scorpio: బుధుడి వల్ల నవంబర్ 30 నుంచి ఈ రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతంగా కలిసొచ్చేస్తుంది

Mercury and Scorpio: బుధుడి వల్ల నవంబర్ 30 నుంచి ఈ రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతంగా కలిసొచ్చేస్తుంది

Haritha Chappa HT Telugu
Nov 26, 2024 05:30 PM IST

Mercury and Scorpio: బుధుడి వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసొచ్చే అవకాశం ఉంది. వృశ్చికంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో విపరీతంగా కలిసి వస్తుంది.

బుధుడి వల్ల కలిసొచ్చే రాశులు
బుధుడి వల్ల కలిసొచ్చే రాశులు

జ్యోతిషశాస్త్రంలో బుధుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. త్వరలోనే బుధుడు వృశ్చికంలో అడుగుపెడతాడు. నవంబర్ 30న బుధుడు వృశ్చికంలో ప్రవేశించబోతున్నాడు. ఇది ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కొన్ని రాశులు కూడా ప్రయోజనం పొందుతాయి. వాక్కు, చదువు, వ్యాపారం, విద్యకు బుధుడు కారణం. బుధుడి మార్పు కచ్చితంగా ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా బుధుడి రాశి మార్పు వల్ల మూడు రాశుల వారికి ఎక్కువ కాలం పాటూ ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆ రాశుల గురించి ఇక్కడ ఇచ్చాము. బుధుడి వల్ల ఈ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో, జీవితం ఎలా మారుతుందో తెలుసుకోండి. ఈ రాశుల్లో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి. ఈ కాలంలో మీరు జీవితం, ఉద్యోగం, వ్యాపారాలు ఎలా సాగుతాయో తెలుసుకోండి.

తులా రాశి

బుధుడు వృశ్చికం రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆకస్మిక లాభాలు,సంపద లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది. ప్రమోషన్ దక్కే సూచనలు కనిపిస్తాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మధ్యలో ఆటంకాలు వచ్చి ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. మీరు అనుకున్న పని నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీ మాటలకు చాలా మంది ఆకర్షితులవుతారు. మీడియాలో పనిచేసే వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది.

మకరం

బుధ గ్రహం వృశ్చికం రాశిలోకి అస్తమించే సమయంలో మీ ఆదాయం, లాభం రెండూ ఎక్కువగా ఉంటాయి.ఈ సమయంలో ఆర్థిక లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అన్ని పనులు మునుపటి కంటే మెరుగ్గా జరగడం ప్రారంభమవుతాయి.పెట్టుబడికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది .స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. మకర రాశి వారికి బుధుడి వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభరాశి వారికి నవంబర్ 30 నుంచి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఈ సమయంలో మీ కెరీర్ లో శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అభివృద్ధి పథంలో నడుస్తారు. కొత్త ఉద్యోగం లభిస్తుంది. వ్యాపాస్తులకు వ్యాపారావకాశాలు విస్తరిస్తాయి. దీనివల్ల మీకు లాభం చేకూరుతుంది. వ్యాపార విస్తరణలో లాభాలు పొందుతారు. మీ తండ్రితో మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది.

(గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఖచ్చితమైనదని మేము హామీ ఇవ్వడం లేదు. అంతర్జాలంలో లభించే వివరాల ఆధారంగా వీటిని అందించాము. ఇది కేవలం మీ సమాచారం కోసం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఇది పూర్తిగా నిజమేనని ధ్రువీకరించడం లేదు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి)

Whats_app_banner