TG DOST 2024 Updates : కొనసాగుతున్న డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్‌' సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు-tg dost 2024 last date of self reporting to colleges extended up to september 19 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dost 2024 Updates : కొనసాగుతున్న డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్‌' సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

TG DOST 2024 Updates : కొనసాగుతున్న డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్‌' సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 18, 2024 12:23 PM IST

TG Degree Online Services : డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరో అప్డేట్ ఇచ్చింది. దోస్త్ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడిగించింది. సెప్టెంబర్ 19వ తేదీలోపు సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చని పేర్కొంది.

దోస్త్ ప్రవేశాలు 2024
దోస్త్ ప్రవేశాలు 2024

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దోస్త్ షెడ్యూల్ ముగిసినప్పటికీ… ప్రత్యేక విడతలో విద్యార్థులకు మరోసారి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విడతలో సీట్లు పొందిన విద్యార్థులకు తాజాగా ఉన్నత విద్యా మండలి అప్డేట్ ఇచ్చింది.

‘దోస్త్‌’ స్పెషల్‌ డ్రైవ్‌లో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌ర్ 19 వరకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ప్రకటన చేశారు. నిజానికి ఈ గడువు సెప్టెంబర్ 16వ తేదీతో ముగిసింది. కానీ విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల  మేరకు తేదీని పొడిగించారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు అలాట్ మెంట్ కాపీని https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మూడు విడతలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది… ఈ విడతలోనూ ప్రవేశాలను కల్పిస్తోంది. స్పెషల్ ఫేజ్ లోనూ రిజిస్ట్రేషన్లు, సీట్ల కేటాయింపు పూర్తి అయినప్పటికీ… తాజాగా సెల్ఫ్ రిపోర్టింగ్ గడవును పొడిగించింది. 

దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. దాదాపు ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది. స్పెషల్ ఫేజ్ విడత కూడా ముగిస్తే… స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ ప్రవేశాలు:

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు.

  • హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు.
  • పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తోంది.
  • ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
  • అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో వీటిని పూర్తి చేయవచ్చు.
  • ఏడాది లేదా ఆరు నెలల కాలంలో పూర్తి చేసే డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు.
  • కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.