Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై రోహిత్ శర్మ ఫైర్ - దూబే, సుందర్ లాంటి ఆల్‌రౌండర్లకు ప్రమాదకరం
Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ రూల్ శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్లకు ప్రమాదకరంగా మారిందని రోహిత్ శర్మ అన్నాడు.
Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రూల్ ఆల్‌రౌండర్లకు ప్రమాదకరంగా మారుతోందని రోహిత్ శర్మ చెప్పాడు.
2023లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్...
ఐపీఎల్‌ను ఆసక్తికరంగా మార్చేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను బీసీసీఐ 2023లో ప్రారంభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతి టీమ్ 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు సబిస్టిట్యూబ్ ఆటగాళ్లను ప్రకటించాల్సివుంటుంది. ఈ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే అవకాశం కల్పించారు.
జట్టు అవసరాలకు అనుగుణంగా ఇంపాక్ట్ ప్లేయర్‌తో బౌలింగ్‌కానీ, బ్యాటింగ్‌కానీ చేయించవచ్చు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను బ్యాటింగ్ కోసమే ఎక్కువగా వాడుకుంటున్నాయి. ఐపీఎల్ టీమ్స్. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్యాట్స్‌మెన్స్‌ను ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా బరిలో దించుతూ విజయాల్ని అందుకుంటున్నాయి.
2024 ఐపీఎల్‌లో...
ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల క్రికెట్ ఆట మనుగడకే ప్రమాదకరమని, ఈ రూల్ వల్ల బౌలర్ల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతోన్నారు.ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా వచ్చిన అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ వంటి బ్యాట్స్‌మెన్స్ భారీ స్కోర్లు చేశారు. ఈ ఐపీఎల్‌లో బౌలర్ల ఆధిపత్యం తగ్గి భారీ స్కోర్లు నమోదు కావడానికి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణమంటూ రికీ పాంటింగ్, గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేశారు.
వరల్డ్ కప్ కు కష్టం…
ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల టీ20 వరల్డ్ కప్ కోసం ఆల్‌రౌండర్లను సెలెక్ట్ చేసే విషయంలో భారత జట్టుకు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. హార్దిక్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లను కనిపెట్టడం కష్టసాధ్యమవుతుందని చెబుతున్నారు.
రోహిత్ శర్మ కూడా...
తాజాగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వ్యతిరేకిస్తోన్న వారి జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చేరాడు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్‌రౌండర్లకు చాలా ప్రమాదకరంగా మారిందని రోహిత్ శర్మ అన్నాడు. "ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చదు. ఈ రూల్ వల్ల ఆటను ఫ్యాన్స్ మరింత ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఈ రూల్ వల్ల లాభం కంటే మనకు నష్టమే ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. జట్టు అవసరాలకకు తగ్గట్లుగా ఆల్‌రౌండర్లు దొరకడం కష్టమవుతుంది "అని కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
రోహిత్ శర్మ రాణించినా....
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 261 రన్స్ చేశాడు. ఓ సెంచరీ సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ రాణించిన ముంబై ఇండియన్స్ మాత్రం విజయాల్ని సాధించడం లేదు. ఆరు మ్యాచుల్లో రెండు విజయాలతో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉంది.
టాపిక్