Hanuman OTT Delay: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యంపై ప్రశాంత్ వర్మ కామెంట్స్.. అందుకే వాయిదా!
Prasanth Varma About Hanuman OTT Release Delay: ఎంతగానో ఎదురుచూసిన తేజ సజ్జా హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. దాంతో తీవ్ర స్థాయిలో జీ5 ఓటీటీపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆడియెన్స్. ఈ నేపథ్యంలో తాజాగా హనుమాన్ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.
Hanuman OTT Streaming Delay: యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన మొట్ట మొదటి తెలుగు సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. విలన్‌గా ప్రముఖ నటుడు వినయ్ రాయ్ అలరించాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అందుకుంది. కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
సుమారు 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్ సినిమా ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే, మార్చి 8న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లోకి హనుమాన్ సినిమా వచ్చేస్తుందని చాలా మంది ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు. కానీ, వారి ఆశలను నిరాశపరిచేలా హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తర్వాత హనుమాన్ సినిమా హిందీ వెర్షన్‌ను జియో సినిమా ఓటీటీలో మార్చి 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలాగే అదే మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీ ప్లెక్స్ ఛానెల్‌లో హనుమాన్ సినిమాను ప్రసారం చేయనున్నారు. అంటే ఒకేరోజు అటు ఓటీటీ, ఇటు బుల్లితెరపై హనుమాన్ హిందీ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక తెలుగులో హనుమాన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. జీ5 (ZEE5 OTT) సంస్థపై, మేకర్స్‌పై తెలుగు ఆడియెన్స్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.
ఈ నేపథ్యంలో హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడు. "హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సినిమాను వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఇద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు" అని ట్విట్టర్‌లో ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు.
అంతేకాకుండా ఈ విషయంపై జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన ఇచ్చింది. తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో జీ5 గ్లోబల్ (Zee5 Global) హ్యాండిల్స్ నుంచి హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ట్వీట్ చేసింది. "ఎంతోకాలం ఎదురుచూసిన క్షణం ఆసన్నమైంది. జీ5లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి" అని జీ5 గ్లోబల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు.
అయితే, హనుమాన్ తెలుగు ఓటీటీ వెర్షన్‌ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెప్పిన జీ5 సంస్థ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీంతో హనుమాన్ ఓటీటీ విడుదల తేదిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. మరి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారో.. మరికొన్ని రోజులు టైమ్ తీసుకుంటారో చూడాలి. కాగా హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. దీనికి సంబంధించిన విషయంపై ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్.