Bhoothaddam Bhaskar Narayana: రావణాసురుడి రేంజ్‌లో విలన్.. క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ
Bhoothaddam Bhaskar Narayana Villain Importance: భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలోని శివ ట్రాప్ సాంగ్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ శివ ట్రాప్ ట్రాన్స్ లిరికల్ వీడియో సాంగ్‌ను ఏఐ చాట్ జీపీటీనీ ఉపయోగించి జెనరేట్ రూపొందించారు. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి.
Bhoothaddam Bhaskar Narayana Villain Role: లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ. ఈ సినిమాలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూనిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా.. స్నేహాల్, శశిధర్ నిర్మాతలుగా వ్యవహరించారు. దిష్టి బొమ్మ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాలో ఏఐ జెనరేట్ చేసిన శివ ట్రాప్ ట్రాన్స్ సాంగ్ లాంచ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హీరో సుహాస్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో మూవీలోని విలన్ ప్రాముఖ్యతను డైరెక్టర్ తెలిపారు. ''శివ ట్రాప్ ట్రాన్స్ పాట కోసం శ్రీ చరణ్ ఇచ్చిన ట్యూన్, చైతన్య ప్రసాద్ అల్లిన పదాలు గూస్ బంప్స్ తెప్పించాయి. రావణాసురుడు శివుడుని ఎంత తీవ్రంగా పూజించారో ఇందులో మా విలన్ పాత్ర కూడా ఆ స్థాయిలో ఉంటుంది. కచ్చితంగా సినిమా మీ అందరికీ నచ్చుతుంది'' అని డైరెక్టర్ పురుషోత్తం రాజ్ తెలిపారు.
"సుహాస్ నా బిడ్డలాంటి వాడు. మంచి నటుడు. గొప్పగా ఎదుగుతున్నాడు. ఇంకా ఎదగాలి. నాంది లాంటి మంచి సినిమాని ఇచ్చిన విజయ్ ఈ వేడుకలో ఉంటడం ఆనందంగా ఉంది. భూతద్ధం భాస్కర్ నారాయణ చాలా మంచి సబ్జెక్ట్. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చేశారు. ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. చైతన్య ప్రసాద్ గ్రేట్ లిరిక్స్ ఇచ్చారు. శ్రీ చరణ్ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. కాల భైరవ టెర్రిఫిక్‌గా పాడారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'' అని శివ కందుకూరి తండ్రి రాజ్ కందుకూరి అన్నారు.
"శివ ట్రాప్ ట్రాన్స్ ఈ సినిమా ఆల్బంలో నా ఫేవరేట్. సినిమాలో చాలా కీలక సమయంలో ఈ పాట వస్తుంది. విజువల్‌తో ట్రాక్ వినప్పుడు అన్ బిలివబుల్ అనిపించింది. ఇలాంటి ట్రాక్ దొరకడం ఆనందంగా ఉంది. శ్రీచరణ్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. చైతన్య ప్రసాద్ గారి లిరిక్స్, కాలభైరవ పాడిన తీరు పాటని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ పాటని లెజెండరీ ఎంఎం కీరవాణీ గారు రిలీజ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని హీరో శివ కందుకూరి పేర్కొన్నాడు.
"ఈ వేడుకు అతిథిగా వచ్చిన సుహాస్ గారికి ధన్యవాదాలు. తను మా ఇంట్లో మనిషి. విజయ్ గారికి, వర్షకి థాంక్స్. మా ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాట కూడా నచ్చుతుంది. ఈ రెండు నచ్చాయంటే మా సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది. మార్చి1న థియేటర్స్‌లోకి వస్తున్నాం. అందరూ థియేటర్స్‌కి రండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'' అని హీరో శివ కందుకూరి ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. "ఈ పాటకు అన్నీ అద్భుతంగా కుదిరాయి. కీరవాణి గారు ఈ పాటని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చైతన్య ప్రసాద్ గారు చాలా అర్ధవంతమైన సాహిత్యాన్ని అందించారు. కాల భైరవ అద్భుతంగా పాడారు. ప్రొడక్షన్ డిజైనర్ చాలా అద్భుతంగా చూపించారు'' అని పేర్కొన్నారు.