Nithin: భీష్మ కాంబినేషన్ రిపీట్.. డిఫరెంట్ టైటిల్‌తో అదిరిపోయిన గ్లింప్స్-nithin rashmika mandanna venky kudumula trio robinhood glimpse released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithin: భీష్మ కాంబినేషన్ రిపీట్.. డిఫరెంట్ టైటిల్‌తో అదిరిపోయిన గ్లింప్స్

Nithin: భీష్మ కాంబినేషన్ రిపీట్.. డిఫరెంట్ టైటిల్‌తో అదిరిపోయిన గ్లింప్స్

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2024 05:57 AM IST

Nithin Venky Kudumula Robinhood: భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమాకు డిఫరెంట్‌గా రాబిన్ హుడ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా టైటిల్ అనౌన్స్ చేస్తూ రాబిన్ హుడ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

భీష్మ కాంబినేషన్ రిపీట్.. డిఫరెంట్ టైటిల్‌తో అదిరిపోయిన గ్లింప్స్
భీష్మ కాంబినేషన్ రిపీట్.. డిఫరెంట్ టైటిల్‌తో అదిరిపోయిన గ్లింప్స్

Nithin Venky Kudumula Robinhood: హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కోసం రెండోసారి చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ప్రకటించిన రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ రివీల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

నితిన్ వెంకీ కుడుముల చిత్రానికి ‘రాబిన్‌హుడ్’ అనే టైటిల్ పెట్టారు. ఇండియన్స్ అందరినీ తన సోదరులు, సోదరీమణులుగా భావించి, వారి నుండి డబ్బు దొంగిలించడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పే నితిన్ పాత్రను పరిచయం చేస్తూ రివిల్ చేసిన టైటిల్ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే రాబిన్‌హుడ్ మూవీలో నితిన్ దొంగగా కనిపించనున్నాడు. దానికి సంబంధించిన టీజర్ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది.

"డబ్బు చాలా చెడ్డది. రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే.. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటది. అన్నట్టే చేసింది.. దేశం అంతా కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు.. ఆభరణాలేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్లు.. అవసరం కొద్ది వాళ్ల జేబుల్లో చేతులు పెడితే.. ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవ్వలేదు. ఎందుకంటే అయినవాళ్ల దగ్గర డబ్బులు తీయడం నా హక్కు. మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్" అంటూ హ్యూమర్స్ డైలాగ్‌తో నితిన్ తనను తాను పరిచయం చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

రాబిన్‌హుడ్ గ్లింప్స్‌లో నితిన్ గెటప్, యాక్షన్స్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. నితిన్ తన బ్యాగ్‌లో డబ్బు, బంగారంతో శాంతా క్లాజ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన బైక్ ముందుభాగంలో ‘I’m an Indian’, వెనుకభాగంలో I’m aware that I’m rare అని రాసుంది. అలాగే తను డబ్బును ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాడు. నితిన్ స్టైలిష్ మేక్ఓవర్‌లో మోడిష్ ఎటైర్‌లో కూల్‌గా కనిపించాడు. దర్శకుడు వెంకీ కుడుముల సీరియస్‌ సన్నివేశాన్ని తనదైన శైలిలో వినోదాత్మకంగా చిత్రీకరించారు.

తన మొదటి రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన సబ్జెక్ట్‌లను ప్రయత్నించిన వెంకీ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. టైటిల్ టీజర్ కట్‌లో తన మార్క్ చూపించారు. కాన్సెప్ట్ వీడియో ఖచ్చితంగా ఒక యూనిక్ ఆలోచన. నితిన్‌ను సరికొత్త పాత్రలో ప్రజెంట్ చేశారు. టైటిల్ రివీల్ గ్లింప్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని చూపుతుంది. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్‌గా ఉంది. నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న రాబిన్‌హుడ్ చిత్రంలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేస్తోంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాబిన్‌హుడ్ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం అద్భుతమైన స్కోర్‌ను అందించాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. కాగా ఇదివరకు నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ అని ముందుగా ప్రకటించారు. కానీ, తర్వాత రష్మిక తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

WhatsApp channel