కాల్షియం ట్యాబ్లెట్లతో  కిడ్నీలో రాళ్లు?

pixabay

By Haritha Chappa
Dec 26, 2023

Hindustan Times
Telugu

వయసు పెరిగితే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది.  కాల్షియం ట్యాబ్లెట్లను ప్రతిరోజూ వేసుకునే వారు ఎంతో మంది. 

pixabay

రోజూ కాల్షియం ట్యాబ్లెట్లను వేసుకునే వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. 

pixabay

 కిడ్నీలో రాళ్లు అనేవి క్యాల్షియం, ఆక్సలైట్, ఫాస్పరస్ వంటివి మూత్రంలో పేరుకుపోకి రాళ్లుగా మారుతాయి. 

pixabay

 క్యాల్షియం సప్లిమెంట్ల వల్లే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని అధ్యయనాలు ఒప్పుకోవడం లేదు. 

pixabay

కేవలం క్యాల్షియం సప్లిమెంట్ల వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు. 

pixabay

ఆహారం ద్వారా, అలాగే కాల్షియం సప్లిమెంట్ల ద్వారా... రెండు విధాలుగా కాల్షియం శరీరానికి అందితే అది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు. 

pixabay

కాబట్టి మీకు కాల్షియం లోపం ఉంటేనే ఈ సప్లిమెంట్లను వేసుకోవాలి. 

pixabay

వైద్యులకు చెప్పకుండా కాల్షియం ట్యాబ్లెట్లను వినియోగించకూడదు.  

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels