Brahmamudi April 19th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి గురించి నిజం చెబుతానన్న సుభాష్- షాకైన కొడుకు- కావ్యకు షాక్-brahmamudi serial april 19th episode raj decided to get out from duggirala home with child brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 19th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి గురించి నిజం చెబుతానన్న సుభాష్- షాకైన కొడుకు- కావ్యకు షాక్

Brahmamudi April 19th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి గురించి నిజం చెబుతానన్న సుభాష్- షాకైన కొడుకు- కావ్యకు షాక్

Sanjiv Kumar HT Telugu
Apr 19, 2024 09:19 AM IST

Brahmamudi Serial April 19th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌లో బాబుకు ఏం జరగకముందే ఇంట్లోంచి రాజ్‌ను వెళ్లిపోమ్మంటారని తెలుస్తోంది. దాంతో బాబు తల్లి ఎవరో నిజం బయటపెడతానని రాజ్‌తో సుభాష్ అంటాడు. అది విని కావ్య షాక్ అవుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అంతా హాల్లో ఉంటారు. టీ పెట్టడం గురించి మాట్లాడుకుంటారు. నీ కోడలిని టీ పెట్టమని అని అపర్ణను అంటుంది రుద్రాణి. నీ కోడలిని పెట్టమనొచ్చు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంటికోడళ్లు అందరూ టీ మాస్టర్లా. మీరే పెట్టుకోవచ్చు కదా. కావ్య రాకముందు ఈ ఇంట్లో టీ అనే ద్రవపదార్థాన్ని చూడనేలేదా అని స్వప్న గట్టిగా ఇస్తుంది.

బాబు ఏడుస్తుంటే

ఇంతలో బాబు ఏడుస్తుంటే రాజ్ ఊరుకోబెడతాడు. కిందా అంతా కంగారుపడిపోతారు. ఆకలేస్తుందేమో అని అనామిక అంటే.. బాబు అమ్మ గాని అమ్మ ఉగ్గు, పాలు అన్ని కలిపే గుడికి వెళ్లింది అని రుద్రాణి అంటుంది. ఏమైంది అని అంతా ఆలోచిస్తుంటారు. అపర్ణపై సెటైర్లు వేస్తుంది రుద్రాణి. బాబు ఏడుస్తుంటే నానమ్మ హృదయం కరగట్లేదా. తాతయ్య కూడా తాటి గింజలా సైలెంట్‌గా ఉండిపోయాడు అని రుద్రాణి అంటుంది.

బాబు అలా ఏడుస్తుంటే.. ఎవరికీ హృదయం కలగట్లేదా అని స్వప్న అంటుంది. నువ్వె వెళ్లొచ్చు కదా. వరుసకు పెద్దమ్మవే కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. మీరు పిల్లలను కన్నారు. నేను తల్లిని కాబోతున్నాను. మీకే బాగా తెలుస్తుంది అని స్వప్న అంటుంది. దాంతో ఇందిరాదేవిని చిట్టి నువ్వెళ్లి చూడు అని సీతారామయ్య అంటాడు. ఇంట్లో ఎవరికైనా హృదయం కరుగుతుందేమో అని చూశాను. కానీ, అంతా కఠినంగా ఉన్నారు. నేనే వెళ్తాను అని ఇందిరాదేవి అంటుంది.

సిరప్ ఇస్తే అయిపోతుంది

ఉండండి అమ్మమ్మ నేను వెళ్లి ఎత్తుకొస్తాను అని స్వప్న అంటుండంగా కావ్య వస్తుంది. ఆపద్భాందవిలా తన అమ్మ గానీ అమ్మ వచ్చింది అని రుద్రాణి అంటుంది. ఇందాకటి నుంచి బాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు అని స్వప్న చెబుతుంది. దాంతో కావ్య పైకి వెళ్లి చూస్తుంది. బాబును చూసి అయ్యో ఇంత జ్వరంగా ఉందేంటి, పదండి హాస్పిటల్‌కు వెళ్దామని కావ్య అంటుంది. హాస్పిటల్‌కు ఎందుకు సిరప్ ఇస్తే అయిపోతుంది కదా అని రాజ్ అంటాడు.

మీరు అసలు కన్నతండ్రేనా. ఇంటికి తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ ఇస్తారా. పిల్లల విషయంలో రిస్క్ తీసుకొవద్దు అని కావ్య ఫైర్ అవుతుంది. తర్వాత కిందకు కావ్య తీసుకొస్తుంది. బాబుకు జ్వరంగా ఉందని అంతా కంగారుపడిపోతారు. హాస్పిటల్‌కు తీసుకెళ్దామనుకుంటారు. సుభాష్ కూడా వస్తానంటే.. రాజ్ విషయంలో వదినా రూల్స్ పాస్ చేసింది కదా అని రుద్రాణి ఫిటింగ్ పెడుతుంది. నేను రాజ్ విషయంలో అన్నాను. బాబు విషయంలో కాదు అని అపర్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

తల్లి ఉండుంటే

దాంతో సుభాష్, కావ్య రాజ్ బాబును హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. బాబును చూసిన డాక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. టెస్ట్‌లు చేయాలని చెబుతుంది. ఏమైందిరా అని సుభాష్ అడిగితే.. రాత్రి బాగానే ఉన్నాడు. ఉదయం నుంచే ఇలా ఏడుస్తున్నాడు అని రాజ్ అంటాడు. మరి నాకు చెబితే నేను గుడికి వెళ్లకుండా ఆగేదాన్ని కదా. అప్పటి నుంచి వాడిని కష్టపెడుతూ. మీరు కష్టపడుతున్నారు. అసలు వాడి తల్లి ఉంటే ఇదంతా ఉండేది కాదు అని రాజ్‌పై కావ్య ఫైర్ అవుతుంది.

ఊరుకోమ్మా. వాడు ఇప్పటికే గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అని సుభాష్ అంటాడు. సారీ అని రాజ్ చెబుతాడు. ఎవరికీ సారీ. నాకా.. బాబుకా.. బాబు తల్లికా.. బాబుకు ఏం కాకూడదని దేవుడికి చెప్పండి సారీ అని కావ్య అంటుంది. మరోవైపు బాబుకు జరగరానిది జరిగితే.. ఇంటి పరువు పోతుంది. అప్పుడు బాబు తల్లి వచ్చి నా కొడుకు ప్రాణం తీస్తారా అని నిలదీస్తుంది. దాంతో మన ఇంటి మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది అని అందరినీ భయపెడుతుంది రుద్రాణి.

తల్లి స్పర్ష కావాలి

రుద్రాణి చెబుతుంటే కరెక్టే అనిపిస్తుందని ధాన్యలక్ష్మీ అంటుంది. బాబు క్షేమం ముందు రుద్రాణి చెప్పిన పరిణామాల గురించి నేను పట్టించుకోను. బాబు క్షేమంగా వస్తే చాలు. రాజ్‌ను ఎలాగైన నిలదీసి తన తల్లికి అప్పజెప్పమని చెప్పాలి అని అపర్ణ అంటుంది. మరోవైపుడ కావ్య వాళ్లను డాక్టర్ పిలుస్తుంది. రిపోర్ట్స్ నార్మల్‌గానే ఉన్నాయి. ఆ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదు. కానీ, బాబుకు జ్వరం ఎందుకు వచ్చిందో, పాలు ఎందుకు తాగట్లేదో అని అర్థం కావడం లేదు అని డాక్టర్ అంటుంది.

బాబుకు అసలు తల్లి పాలు ఇస్తున్నారా. ఎందుకు ఇవ్వట్లేదు. ఎందుకు ఆపేశారు అని డాక్టర్ అడిగితే.. నేను బాబు తల్లిని కాదని కావ్య అంటుంది. కొన్నికారణాల వల్ల బాబు తల్లి దూరంగా ఉంది అని సుభాష్ అంటాడు. అది బాబు తన తల్లిని బాగా మిస్ అవుతున్నాడు. బాబుకు తన తల్లి స్పర్శ కావాలి. తల్లి పాలు కావాలి. తల్లి ఒడిలోని వెచ్చదనం కావాలి. తల్లి ఎందుకు దూరంగా ఉందో నాకు తెలియదు. కానీ ఏ హాస్పిటల్‌కు వెళ్లిన ఏం చేయలేరు. బాబుకు తన తల్లి కావాలి అని డాక్టర్ చెబుతుంది.

మాతృస్థానం ఎంత గొప్పదో

తర్వాత ఇంటికి కావ్య వాళ్లు వస్తే ఆగండి అని అపర్ణ అంటుంది. బాబుకు ఎలా ఉంది. డాక్టర్ ఏం చెప్పారు. బాబుకు తల్లి స్థానంలో వెళ్లిన అపరమాతృమూర్తివి కదా అని అపర్ణ అడుగుతుంది. నేను తల్లి స్థానంలోనే వెళ్లాను. కానీ, ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా బాబుకు తల్లి అయినా వ్యర్థమే అన్నారు. బాబుకు తల్లి స్పర్ష కావాలన్నారు. మాతృస్థానం ఎంత గొప్పదో తెలిసింది. అంతా అర్థమైంది. నా ఊహే నిజమైంది. పాలు తాగే పసివాడికి అమ్మ ఒడి అంతా స్వాంతన లేదు అని కావ్య చెబుతుంది.

బాబుకు తల్లిపై బెంగ మొదలైంది అని కావ్య అంటుంది. అంతా ఎమోషనల్‌ ఫీల్ అవుతారు. ఈ అమానుషానికి ఎవరు కారణం. నీ రాక్షసత్వానికి ఈ బాబును బలి చేద్దామనుకున్నావా చెప్పు. ఈ ఇంటి మర్యాదాలు బాబు ప్రాణాలు పోవడానికి ముందే బాబు తల్లి ఎవరో చెప్పు. ఈ ఇల్లు ఏ అనర్థానికి సాక్ష్యంగా మిగిలిపోకూడదని కోరుకుంటున్నాను. కాబట్టి బాబు తల్లి ఎవరో చెప్పు అని అపర్ణ అంటుంది. ఇప్పుడు కూడా బాబు తల్లి ఎవరో చెప్పకుంటే మీరు అసలు కన్నతండ్రి కానే కాదు. అసలు మనిషిగా కూడా చూడలేరు అని కావ్య అంటుంది.

నిజం బయటపెట్టాల్సిందే

ఇందిరాదేవి, ప్రకాశం కూడా కన్నతల్లి ఎవరో చెప్పమని రాజ్‌ను ఎమోషనల్‌గా అడుగుతారు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు రాజ్ అని స్వప్న అంటుంది. నువ్ నోరు విప్పకుంటే ఇంట్లో అందరం ఇరుక్కునేలా ఉన్నాం. చట్టం దృష్టిలో అంతా దోషులుగా నిలబడతాం అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు ఇది ఇంటి సమస్యగా మారింది. నిజం బయటపెట్టాల్సిందే అని ధాన్యలక్ష్మీ అంటుంది.

బాబుకు తల్లి కావాలి. నీ భార్యకు న్యాయం కావాలి. ఇంటికి నిజం కావాలి చెప్పురా రాజ్ అని ఇందిరాదేవి నిలదీస్తుంది. క్షమించు నానమ్మా.. ఇప్పుడు నేను ఏం చెప్పలేను. బిడ్డకు తల్లి తండ్రి అన్ని నేనై పెంచుకుంటాను. వాడికి తల్లి మీద బెంగ పోయేలా ఇక నుంచి నేనే చూసుకుంటాను అని బాబును తీసుకుంటాడు. వీడు నిజం చెప్పడు. ఈ నిజం ఇంటిని అగ్నిలా దహించే వరకు చెప్పడు. బిడ్డకు తల్లిని చూపించవు. మాకు నిజం చూపించవు. చాలా మంచిదిరా అని అపర్ణ అంటుంది.

నేనే నిజం చెబుతాను

ఆ బాబుకు మా కళ్ల ముందు ఎలాంటి అనర్థం జరగకముందే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని అపర్ణ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రాజ్‌ను ఇంట్లో నుంచి అపర్ణ బయటకు పంపిచినట్లుగా తెలుస్తోంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో బాబును సుభాష్ తీసుకెళ్లిపోతుంటే.. రాజ్ అడ్డుకుని ఎక్కడికీ తీసుకెళ్తున్నారని అడుగుతాడు. ఇంట్లోంచు నువ్ ఒంటరిగా బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్ నిజం బయటపెట్టే పరిస్థితి వచ్చిందని సుభాష్ అంటాడు.

నిజం బయటపెట్టాల్సిన అవసరం ఇంట్లోనుంచి బయటకు వెళ్లే నిర్ణయం తీసుకున్నాను అని రాజ్ అంటాడు. నువ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి వస్తే.. నేనే ఆ నిజం బయటపెడతాను అని సుభాష్ అంటాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ మాటలు విన్న కావ్య షాక్ అవుతుంది. నా కొడుకును పదిమంది దోషిలా చూస్తుంటే.. అనామకుడిలా బయటకు పంపిస్తుంటే.. ఆ నిజం ఎంత భయంకరమైనదైనా సరే నేను బయట పెట్టక తప్పదు అని సుభాష్ అంటాడు.

Whats_app_banner