Krishna mukunda murari april 18th: కృష్ణని ద్వేషించిన ఆదర్శ్.. ముకుంద కోరుకున్నట్టే జరుగుతుందా? భవానీ కల తీరనట్టేనా?-krishna mukunda murari serial today april 18th episode krishna argues with murari about adarsh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari April 18th: కృష్ణని ద్వేషించిన ఆదర్శ్.. ముకుంద కోరుకున్నట్టే జరుగుతుందా? భవానీ కల తీరనట్టేనా?

Krishna mukunda murari april 18th: కృష్ణని ద్వేషించిన ఆదర్శ్.. ముకుంద కోరుకున్నట్టే జరుగుతుందా? భవానీ కల తీరనట్టేనా?

Gunti Soundarya HT Telugu
Apr 18, 2024 08:34 AM IST

Krishna mukunda murari serial april 18th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కృష్ణ గురించి ఆదర్శ్ చాలా దారుణంగా మాట్లాడతాడు. తనని అలా అనడం విని కృష్ణ బాధపడుతుంది. ఈ విషయం గురించి మురారికి చెప్తే తను నమ్మకుండా కృష్ణ మాటలు కొట్టి పడేస్తాడు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial april 18th episode: ముకుంద మీద ఆదర్శ్ తెగ ప్రేమ చూపిస్తాడు. ముకుంద మురారి వైపు చూస్తూ తెగ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండటాన్ని కృష్ణ గమనిస్తుంది. వీడు ఏంటి ముకుంద మీద ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా? అది మంచిదే తనకి ఒక మంచి తోడు దొరుకుతుందని రేవతి మనసులో అనుకుంటుంది.

ముకుంద మీద అరిచిన రజిని

ముకుంద మీద రజిని చిందులేస్తుంది. కాసేపు నువ్వు కనిపించకపోయేసరికి ముకుంద ఎక్కడని తెగ హడావుడి చేశాడని అంటుంది. ఆదర్శ్ సంగీతకు పెళ్లి చేసే బాధ్యత నాది. వాళ్ళ పెళ్లి చేయడం మీకంటే నాకే ఎక్కువ అవసరమని ముకుంద అంటుంది. ఎందుకని రజిని డౌట్ పడితే అప్పుడు మీరు నన్ను అనుమానించడం మానేస్తారు కదాని చెప్పి వెళ్ళిపోతుంది.

ఈ ముకుందని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదని రజిని అనుకుంటుంది. సంగీతని మధు ఫోటోస్ తీస్తూ ఉంటాడు. రజిని వచ్చి కెమెరాకి అడ్డంగా నిలబడుతుంది. తన కూతురిని ఎందుకు ఫోటోస్ తీస్తున్నావని అడుగుతుంది. కృష్ణ వచ్చి తీస్తే తప్పు ఏంటని అంటుంది.

కృష్ణ మంచితనం

మధు ఫోటోస్ తీయడంలో తప్పు లేదని, అది తన ప్రొఫెషన్ అని కృష్ణ వెనకేసుకొస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు ఫోటోస్ తీయడం తప్పని అంటుంది. అందమైన వాటిని కెమెరాలో బంధించడం అలవాటు అని అంటుంది. తనని అందంగా ఉన్నావని ఇప్పటి వరకు ఎవరు అనలేదని సంగీత తింగరిగా మాట్లాడుతుంది.

అందంగా ఉన్నావని కృష్ణ అంటే చూశావా కృష్ణ అక్క ఎంత మంచిదో నువ్వేమో తనతో మాట్లాడొద్దని చెప్పావని నోరు జారుతుంది. కృష్ణ, మధు ఆశ్చర్యపోతారు. నిజం చెప్పినందుకు రజిని సంగీతని తిడుతుంది. సంగీతను నువ్వు మాట్లాడొద్దని చెప్పినా నేను నీతో మాట్లాడతానని కృష్ణ నవ్వుతూ చెప్తుంది.

సంగీత చాలా మంచిది. నువ్వు గీసిన గీత కూడా దాటదు. ఈరోజుల్లో ఇలాంటి పిల్లలు చాలా తక్కువగా ఉంటారని కృష్ణ తనని మెచ్చుకుంటుంది. భవానీ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చి ఇస్తుంది. ముకుందని పిలిచి తనకి కూడా ఇస్తుంది.

ముకుంద ప్లాన్ ఫలిస్తుందా?

ఏంటి స్పెషల్ అని అడుగుతుంది. శ్రీరామనవమి మన ఇంట్లో పూజ చేసుకుంటున్నామని కృష్ణ చెప్తుంది. అందరికీ భవానీ పనులు అప్పగిస్తుంది. కృష్ణ కడుపులో బిడ్డ పుట్టకుండా చేయాలి. పానకంలో ట్యాబ్లెట్ కలిపి ఇస్తానని అనుకుంటుంది. రేవతి మేడమ్ తో కలిసి తాను కూడా పానకం రెడీ చేస్తానని ముకుంద అడుగుతుంది.

భవానీ ఇంట్లో అందరికీ పనులు అప్పగిస్తే తాను ఏం చేయాలని కృష్ణ అడుగుతుంది. ఏం చేయాలో నేను చెప్తానని మధు గోడ మీద తగిలించిన ఫోటో చూపిస్తాడు. పిల్లలని కనిస్తానని చెప్పి కృష్ణ భవానీకి మాట ఇస్తున్న ఫోటో తీసి ఫ్రేమ్ కట్టిస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ముకుంద మాత్రం రగిలిపోతుంది.

కృష్ణ కథ ముగిసిపోతుంది

కృష్ణకు పిల్లలు పుడతారని కలలు కంటున్నారు, కానీ రేపటితో ఆ కల కలగానే మిగిలిపోతుందని ముకుంద మనసులో అనుకుంటుంది. కృష్ణ తెగ సిగ్గుపడుతుంది. రేపటితో కృష్ణ కథ ముగియబోతుందని ముకుంద తెగ సంబరపడుతుంది. భవానీ కోరిక ఎలాగైనా తీర్చమని మధు కూడా మురారి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు.

ఆదర్శ్ ముకుంద కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ముకుంద ట్యాబ్లెట్స్ తీసుకుని వస్తుంది. వైదేహి ఇచ్చిన ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే చాలు కృష్ణ ఇక ఎప్పటికీ తల్లి కాలేదు. మళ్ళీ నేను ఈ ఇంటి కోడలిని అవుతానని ముకుంద సంతోషంగా ఉంటుంది.

ఆదర్శ్ ముకుందకి ఎదురుపడే సరికి ట్యాబ్లెట్ కనిపించకుండా దాచిపెడుతుంది. ఎక్కడికి వెళ్ళావని ఆదర్శ్ అడుగుతాడు. బయటకు వెళ్లానని ఏదో అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. కృష్ణ పొద్దునే ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే ఆదర్శ్ తనని చూసి చిరాకుగా మొహం పెట్టుకుంటాడు.

కృష్ణని ద్వేషించిన ఆదర్శ్

పొద్దు పొద్దునే ఈవిడ మొహం చూడాల్సి వచ్చింది ఏం జరుగుతుందో ఏమోనని కృష్ణని ఉద్దేశించి అంటాడు. అది కృష్ణ విని ఏమన్నావ్ అంటుంది. మురారి వచ్చి మాట్లాడతాడు. జాగింగ్ వెళ్లలేదా అంటే ఆదర్శ్ వారం వర్జ్యం, ముహూర్తం అనేసి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు.

ఆదర్శ్ ఏమనుకుంటున్నాడని కృష్ణ కోపంగా మురారిని అడుగుతుంది. తను నా గురించే అంటున్నాడు పొద్దు పొద్దునే నా మొహం చూశాడంట బయటకు వెళ్తే ఏదో అవుతుందని ఆగిపోయాడని చెప్తుంది. ఆదర్శ్ అలా ఎందుకు అంటాడు అదంతా నీ భ్రమ అని అంటాడు. నిందలు వేయాల్సిన అవసరం లేదు మీతో బాగానే ఉన్నాడు కానీ నామీ ద్వేషం ఎందుకు చూపిస్తున్నాడని కృష్ణ బాధగా అంటుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కృష్ణ

ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోనా అప్పుడు ఎవరూ నా మొహం చూడాల్సిన బాధ ఉండదని కృష్ణ ఫీల్ అవుతుంది. వాళ్ళ మాటలు ముకుంద వింటూ ఉంటుంది. కృష్ణ మాటలను మురారి కొట్టి పారేస్తాడు. అదంతా భ్రమ అంటే ఆదర్శ్ నా మొహం మీదే అన్నాడని కృష్ణ బాధగా చెప్తుంది.

తనకేమి అర్థం కావడం లేదని అంటాడు. అసలు నువ్వు ఏం చేశావ్ ఉంటే ముకుంద మీద కోపం ఉండాలి కదా వెంటనే వెళ్ళి అడుగుతానని మురారి అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ముకుంద అనుకున్నట్టుగ కృష్ణకి పానకంలో ట్యాబ్లెట్ కలిపి ఇస్తుంది. దాన్ని కృష్ణ తాగేస్తుంది.