Diabetes: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు ఎందుకు తినకూడదు?-why should people with diabetes not eat mangoes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు ఎందుకు తినకూడదు?

Diabetes: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు ఎందుకు తినకూడదు?

Haritha Chappa HT Telugu
Apr 04, 2024 11:10 AM IST

Diabetes: డయాబెటిస్ రోగులు మామిడి పండ్లు తినేందుకు భయపడతారు. నిజానికి మధుమేహం ఉన్న వారు మామిడి పండ్లు పూర్తిగా తినకూడదనే నియమం లేదు. కాకపోతే తక్కువగా తినాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

మధుమేహులు మామిడి పండ్లు తినవచ్చా?
మధుమేహులు మామిడి పండ్లు తినవచ్చా? (pixabay)

Diabetes: పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆ పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ రోగులు మాత్రం మామిడి పండ్లు తినేందుకు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మామిడిపండ్లలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని తినేందుకు మధుమేహులు భయపడుతూ ఉంటారు. మామిడిపండ్లలో చక్కెర శాతం ఎక్కువ అనేది నిజమే, కానీ అందులో మనకి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలా అని మధుమేహ రోగులు మామిడిపండ్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు తినవచ్చు. మామిడి పండ్లు తిన్న రోజు కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఆల్ఫోన్సో, పేరీ జాతికి చెందిన మామిడి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని డయాబెటిక్ పేషెంట్లు ఎంపిక చేసుకుని తినడం మంచిది.

ఎలా తినాలి?

మామిడిపండు పూర్తిగా తినే బదులు అరముక్క మామిడిపండు తింటే మధుమేహ రోగులకి ఎలాంటి హాని జరగదు. కొన్ని రకాల జాతుల మామిడి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వాటిని తినడం ద్వారా డయాబెటిస్ రోగులు సురక్షితంగా ఉండవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడంపై కార్బోహైడ్రేట్లు, చక్కెర కంటెంట్ ఉన్న ఆహారాలు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. మామిడి పండు తిన్న రోజు కార్బోహైడ్రేట్లు, చక్కెర కంటెంట్ ఉన్న ఇతర ఆహారాలను తక్కువగా తినాలి.

మామిడి పండ్లు ఎందుకు తినాలి?

మామిడిపండ్లలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో ఫైబర్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటి కోసం మామిడి పండ్లు తినడం చాలా అవసరం. మామిడి పచ్చడి రూపంలో మామిడికాయలను తిన్నా మంచిదే. ఎందుకంటే దీనిలో వెనిగర్, వెల్లుల్లి వంటివి ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారు మామిడిపండ్లను తినాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మామిడిలో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లు తినే రోజు గుడ్లు లేదా నట్స్ వంటివి అధికంగా తినండి. అలా చేయడం వల్ల వాటిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్లు ఆహారాన్ని సమతుల్యం చేస్తాయి. అలాగే మామిడిపండు తినడానికి ముందు మీ షుగర్ లెవెల్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. అవి సాధారణంగా ఉంటే మామిడిపండును ధైర్యంగా తినండి.

డయాబెటిస్ ఉన్న వ్యక్తులు మామిడిపండ్లలోని పోషక విలువల కోసం వాటిని తినాల్సిందే. ఇందుకోసం వారు మామిడిపండును ఓ గంట పాటు నీళ్లలో నానబెట్టండి. మరీ ఎక్కువగా పండిన పండ్లను తినకపోతే మంచిది. ఎందుకంటే ఎక్కువగా పండిన పండ్లలో చక్కెర కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి మధ్యస్థంగా పండిన మామిడిపండును తినడం మంచిది. మామిడిపండ్లను ముక్కలుగా కోసుకొని తిన్నప్పుడు అందులో కివీ పండ్ల ముక్కలు, బెర్రీ పండ్లు కూడా కలిపి తింటే మంచిది. ఎందుకంటే వీటి గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అప్పుడు మామిడి పండ్లను తక్కువగా తింటారు.

మామిడిపండ్లు సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో కలిసిపోతుంది. మామిడికాయలు ఎక్కువ ఇండెక్స్ కలిగి ఉండవు. అవి మధ్యస్థంగా కలిగి ఉంటాయి. వీటిలో అధిక కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. అలాగే ఈ పండులోని పోషకాలు ఎక్కువే. కాబట్టి వాటికోసం అప్పుడప్పుడు మామిడి పండ్లను ప్రతి ఒక్కరూ తినాల్సిందే. డయాబెటిస్ రోగులు భయపడకుండా రోజుకి అర ముక్క మామిడిపండును ధైర్యంగా తినవచ్చు.

టాపిక్