Diabetes: డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో చెబుతున్న వైద్యులు, ఇలా తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరగవు-doctors are telling people with diabetes what to eat for breakfast if you eat like this the blood sugar levels will no ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో చెబుతున్న వైద్యులు, ఇలా తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరగవు

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో చెబుతున్న వైద్యులు, ఇలా తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరగవు

Haritha Chappa HT Telugu
Mar 20, 2024 07:00 AM IST

Diabetes: మధుమేహంతో బాధపడేవారు ఏం తినాలన్న ముందుగా జాగ్రత్తపడాలి. ఈ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేదిగా ఉండకూడదు. వైద్యులు సూచిస్తున్న ప్రకారం కొన్ని రకాల ఆహారాలు బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మంచిది.

డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలి?
డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలి? (pexels)

Diabetes: డయాబెటిస్ అంటే రక్తంలో చక్కర స్థాయిలను పెంచే అనారోగ్యం. ఇది నియంత్రణలో లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాయామాన్ని చేయాలి. ముఖ్యంగా రోజుల్లో తినే ప్రధమ ఆహారం అంటే బ్రేక్ ఫాస్ట్. బ్రేక్ ఫాస్ట్‌లో మీరు ఏం తింటారో అది ఆ రోజంతా మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.

డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు అల్పాహారంలో ఆరోగ్యకరమైన భోజనాన్ని తినాలి. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇవి రోజంతా శక్తిని అందిస్తూనే చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. వైద్యులు కొన్ని రకాల ఆహారాలను బ్రేక్ ఫాస్ట్‌లో తినమని సూచిస్తున్నారు.

ఏం తినాలి?

మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి గుడ్లు తినడం చాలా ముఖ్యం. బ్రేక్ ఫాస్ట్‌లో రెండు గుడ్లను తింటే అందులో ఉండే ప్రోటీన్... గ్లూకోజ్‌ను శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటుంది. ప్రోటీన్ నిండిన ఆహారం బ్రేక్ ఫాస్ట్‌లో ఉండేలా చేసుకోవాలి. ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్లు తినడం కష్టం అనుకుంటే... ఒకరోజు ఆమ్లెట్లో రకరకాల కూరగాయలు వేసుకొని తినండి. లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్ పై గుడ్లు పగల కొట్టి వేసి బ్రెడ్ టోస్ట్‌లా చేసుకుని తినండి. ఇవి ఎంతో ఆరోగ్య కరం.

ఏం తాగాలి?

అలాగే అల్పాహారంలో తియ్యటి పానీయాలకు దూరంగా ఉండాలి. దానికి బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీ, నీళ్లు తాగితే ఎంతో మంచిది. అలాగే పంచదార కలపకుండా పండ్ల రసాలు, పండ్లను స్మూతీలుగా మార్చుకొని తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఇవన్నీ రక్తంలో చక్కర స్థాయిలను సహజంగానే అదుపులో ఉంచుతాయి.

మార్కెట్లో అవకాడోలు ఎక్కువగానే దొరుకుతున్నాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతిరోజూ ఒక అవకాడో పండును తింటే మంచిది. లేదా ఒక అవకాడోను రెండు ముక్కలు చేసి రోజుకో అర ముక్క బ్రేక్ ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే మంచిది. అవకాడో గుజ్జును తీసి బ్రెడ్ పై పెట్టుకొని బ్రెడ్‌తో సహా తినాలి. బ్రెడ్డు మైదాతో చేసింది కొనకూడదు. హోల్ గ్రెయిన్ బ్రెడ్ అంటే తృణధాన్యాలతో లేదా చిరుధాన్యాలతో చేసిన బ్రెడ్ ను కొనుక్కోవాలి. మల్టీ గ్రెయిన్ బ్రెడ్స్ బయట అమ్మకానికి దొరుకుతున్నాయి. ఇలా మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తింటే ఎంతో మంచిది.

ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని అల్పాహారంలో తీసుకుంటే ఆ రోజంతా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తృణధాన్యాలు, చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. అలాగే సహజమైన పండ్లను తినేందుకు ప్రయత్నించండి.

మధుమేహులకు ఉత్తమ ఆహారం వోట్స్. వోట్స్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రకరకాలుగా వండుకొని తినవచ్చు. దోశ, ఓట్స్, ఉప్మా, మసాలా ఓట్స్ ఇలా చేసుకొని తింటే ఎంతో మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది.

బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా బియ్యంతో చేసిన ఆహారాలను తక్కువగా తినండి. ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అల్పాహారంలో ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దోశలు, ఇడ్లీల్లో కూడా ఎంతో కొంత కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఒక రోజు ఇడ్లీ తింటే, మరొక రోజు కోడిగుడ్లతో చేసిన బ్రేక్ఫాస్ట్ ను తినండి. ఇక పూరీ వంటి మైదాతో చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి. మైదా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.

టాపిక్