Krishna mukunda murari april 17th: కృష్ణకి మాతృత్వాన్ని దూరం చేసేందుకు ముకుంద కుట్ర.. ప్రేమలో మునిగిపోయిన ఆదర్శ్
Krishna mukunda murari serial april 17th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. మురారి బిడ్డకు తానే తల్లిని కావాలని ముకుంద కోరుకుంటుంది. కృష్ణకి మాతృత్వం అయ్యే అవకాశం పోయేలా ప్లాన్ చేస్తుంది. అటు ఆదర్శ్ ముకుంద ప్రేమలో మునిగిపోతాడు.
Krishna mukunda murari serial april 17th episode: కృష్ణ బిడ్డను ఎత్తుకుని వస్తున్నట్టుగా భవానీ ఊహించుకుంటుంది. ఏమైంది అత్తయ్య అలా చూస్తున్నారని కృష్ణ పలకరించేసరికి భ్రమలో నుంచి బయటకు వస్తుంది. నువ్వు ఒక చిట్టి పాపాయితో మెట్లు దిగుతూ ఊసులాడుతున్నట్టు అనిపించిందని భవానీ చెప్తుంది.
కృష్ణ సిగ్గుపడుతుంది. బిడ్డని తీసుకొచ్చి చేతిలో పెడతావని అనుకుంటుంటే అప్పుడే అది ఊహ అని అర్థం అయ్యిందని అంటుంది. నా ఊహ నిజమవుతుందా లేదంటే ఎప్పటిలాగా ఊహల్లో బతకాల్సినదేనా అంటుంది. నిజం అవుతుంది అత్తయ్య మీ కోరిక తొందర్లోనే నెరవేరుస్తానని కృష్ణ చెప్తుంది.
భవానీకి మాట ఇచ్చిన కృష్ణ
తప్పంతా నాదే నీ కోసం ఆలోచించుకోమని మీరు ఎంత చెప్పిన వినిపించుకోకుండా ముకుంద కోసం ఆలోచించాను. లేదంటే ఈ పాటికి మీరు సంవత్సరం పాపతో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. తమ మధ్య జరిగిన విషయం చెప్పలేదా అని కృష్ణ రేవతిని నోటికొచ్చినట్టు తిట్టేస్తుంది.
విషయం ఏమిటో చెప్పకుండా సాగదీస్తే ఒక్కటి ఇస్తానని అంటుంది. ఇంకొక తొమ్మిది నెలల తర్వాత బిడ్డని ఇస్తానని చెప్పాను కదా అది పెద్దత్తయ్యకి చెప్పాలి కదా అంటుంది. నేను చెప్పడం ఎందుకు నువ్వే మాట ఇవ్వు అంటుంది. ఇప్పుడు మాట ఇస్తున్నాను పెద్దత్తయ్య వచ్చే జనవరికల్లా మీ చేతిలో పండంటి బిడ్డను పెడతానని కృష్ణ భవానీకి మాట ఇస్తుంది. అదంతా ముకుంద చూస్తూ రగిలిపోతుంది.
రగిలిపోతున్న ముకుంద
మధు వచ్చి కృష్ణ వాళ్ళని ఫోటో తీస్తానని అంటే ఏం కృష్ణ మాట నిలబెట్టుకోవడం లేదని డౌటా అని మురారి అంటాడు. వాడు అలా అనడంలో తప్పు లేదు నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు కదాని భవానీ అంటుంది. ఇప్పుడు కూడా నా గురించి ఆలోచించడం లేదు పెద్దత్తయ్య అనేసరికి మురారి కల్పించుకుంటాడు.
ఇప్పుడు నా గురించి నేను ఆలోచించడం లేదు మీ గురించి ఆలోచించాను. తప్పు మీదే ఎప్పుడైనా నా గురించి ఆలోచించి మనవడినో, మనవరాలినో ఇవ్వమని గట్టిగా చెప్పారా? అని భవానీ మీద రివర్స్ అవుతుంది. ఎంతసేపు నన్ను ఇరికించాలని చూడటం కాదు ఎప్పుడైనా నన్ను అడిగారా అంటుంది.
ఇప్పుడు మాట ఇస్తున్నానని భవానీ చేతిలో మురారి, కృష్ణ చేతులు వేసి చెప్తారు. అది చూసి ముకుంద కోపం పట్టలేకపోతుంది. ఇద్దరూ ఒక్కటైపోయారని ఎంత కాన్ఫిడెంట్ గా మాట ఇస్తున్నావు. పిల్లల్ని కనడం కాదు కదా కనీసం నీ కడుపున పిల్లల్ని కూడా పడనివ్వనని ముకుంద నవ్వుకుంటుంది.
కృష్ణ మాతృత్వాన్ని దూరం చేసే కుట్ర
మురారికి పిల్లలు కలిగితే అది నాతోనే.. అది ఎవరూ మార్చలేరని అనుకుంటుంది. ముకుంద డాక్టర్ వైదేహిని కలుస్తుంది. తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి టైమ్ వచ్చిందని అంటుంది. తన ఆశ నెరవేరాలంటే కృష్ణ ఎట్టి పరిస్థితిలోనూ తల్లి కాకూడదని చెప్పి డాక్టర్ కి ముకుంద ఏదో చెప్తుంది.
ఎక్కడా ఏ పొరపాటు జరగకూడదని చెప్తుంది. ఖచ్చితంగా చేయాల్సిందేనా ఇంకొకసారి ఆలోచించమని డాక్టర్ బాధగా అడుగుతుంది. చేయాల్సిందే నా ప్రేమ కోసం నా రూపాన్ని మార్చుకున్నాను దీనికి వెనుకడుగు వేస్తానా? జరిగి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితిలో కృష్ణ తల్లి కాకూడదని చెప్పేసి వెళ్ళిపోతుంది.
మురారి తమకి పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నానని చెప్తాడు. ఇంతవరకు ఏమి కాలేదు అప్పుడే అంతదూరం ఆలోచన ఎందుకని కృష్ణ అంటుంది. ఇద్దరూ కాసేపు తమకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటారు. తండ్రి కాబోతున్న ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా అని చాలా ఉత్సాహంగా మాట్లాడతాడు.
బిడ్డ మీద అసలు పెంచుకుంటున్న మురారి
తల్లి కావాలన్నా కోరిక కన్నా పెద్దత్తయ్య కోరిక తీర్చాలనే ఆశ ఎక్కువగా ఉంది. ఒకప్పుడు నేను కనిపిస్తేనే చీదరించుకునే పెద్దత్తయ్య ఇప్పుడు బిడ్డల కోసం నన్ను రిక్వెస్ట్ చేస్తే తట్టుకోలేకపోయానని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. పెద్దమ్మ మాత్రం ఏం చేస్తుంది ఆదర్శ్ మీద ఆశలు పెట్టుకుంటే పెళ్లి కాగానే వెళ్ళిపోయాడు ఇప్పుడు ముకుంద ఇలా చేసిందని మురారి సర్ది చెప్తాడు.
మన మీద కాకపోతే ఇంకెవరి మీద ఆశలు పెట్టుకుంటుందని అంటాడు. కానీ ఆదర్శ్ గురించి ఆలోచించాలి, తను అలా ఒంటరిగా ఉండకూడదని కృష్ణ అనేసరికి మురారి తిడతాడు. ఇప్పుడు మళ్ళీ ఆదర్శ్ కి పెళ్లి చేయాలి వాడికి మళ్ళీ పిల్లలు పుట్టాలి ఆ తర్వాత మనకి పిల్లలు పుట్టాలని అనలేదని అంటాడు.
అలా ఏమి లేదు అప్పుడంటే ముకుంద కోసం ఆలోచించాను ఇప్పుడు ఏ కండిషన్లు లేవని పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట నెరవేర్చాలని అనుకుంటుంది. తొందరగా తన కడుపు పండాలని ఆశ పడుతుంది. అవన్నీ నెరవేరాలంటే ముందు జరగాల్సింది జరగాలని కృష్ణని మీదకు లాగేసుకుంటాడు.
ముకుంద మీద ప్రేమ
ఆదర్శ్ ముకుంద కోసం వెతుకుతూ రజినిని కనిపించిందా అని అడుగుతాడు. తన కూతురిని పట్టించుకోవడం లేదని తిట్టుకుంటుంది. భవానీ వస్తే తనని కూడా అడుగుతాడు. లేదు అయినా తనతో నీకేంటి పని అని ఆదర్శ్ ని అడుగుతుంది. అప్పుడే ముకుంద వస్తుంది.
రామ్మా నీకోసం తెగ వెతికేస్తున్నాడని రజిని పుల్ల విరుపుగా అంటుంది. ఎక్కడికి వెళ్ళావని ఆదర్శ్ ముకుందని ప్రశ్నిస్తాడు. ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లాలని అంటే బయట ఎండలు చూడు ఎలా ఉన్నాయో పొద్దునో సాయంత్రమో వెళ్లొచ్చు కదాని తెగ ప్రేమ చూపిస్తాడు.
వీడి ప్రేమ తగలేయ అని ముకుంద తిట్టుకుంటుంది. ముకుంద మీద తెగ ప్రేమ చూపించేస్తాడు. మళ్ళీ నేనే ముకుందని అని చెప్పుకునే రోజు వస్తుందని ముకుంద అనుకుంటుంది. మురారి వైపు చూసి సిగ్గుపడుతూ ముకుంద నవ్వడం కృష్ణ గమనిస్తుంది. భర్త వైపు ఏంటి అని సైగ చేసేసరికి మురారి తలదించుకుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ముకుంద అనుకున్నట్టుగానే కృష్ణ తల్లి కాకుండా చేసేందుకు మందు కలుపుతుంది.