Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్, తండ్రిలా మారిన కార్తీక్, శౌర్య ఫుల్ ఖుషీ.. దీప దరిద్ర దేవతని తిట్టుకున్న అనసూయ
Karthika deepam 2 serial april 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య రోజురోజుకీ కార్తీక్ కి మరింత దగ్గర అవుతుంది. ఇది ఇలాగే అయితే చాలా ఇబ్బంది అవుతుందని దీప ఏం చేయాలోనని ఆలోచనలో పడుతుంది.
Karthika deepam 2 serial april 17th episode: పారిజాతం దీపని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడం లేదని అనుకుంటుంది. అప్పుడే బంటు వస్తాడు. దీపని గజగజా వణికించేశానని బిల్డప్ ఇస్తాడు. ఈ ఇంటికి మెయిన్ పిల్లర్ లాంటి దాన్ని అది నన్నే పూచిక పుల్లలాగా తీసేసింది. అది గుడిలో అమ్మోరు లాంటిది, అలాంటిది నువ్వు దాన్ని వణికించావంటే నమ్మాలా అని పారు అంటుంది.
కార్తీక్ కి దగ్గరవుతున్న శౌర్య
కార్తీక్, జ్యోత్స్న షాపింగ్ కి వెళ్లేందుకు బయటకు వస్తారు. అప్పుడే కారు దగ్గర శౌర్య ఉండి లోపలికి చూస్తూ ఉంటుంది. ఏం చూస్తున్నావ్ అంటే కారులో కిటికీ చూస్తున్నానని చెప్తుంది. ఎందుకు పెడతారని అంటుంది. అది సన్ రూఫ్ అని దాని గురించి కార్తీక్ చెప్తాడు. అందులో నేను రావొచ్చా అంటే సరే మీ అమ్మకి చెప్పి రా అంటాడు.
మా అమ్మ నేను పలుక్కొవడం లేదు మా ఇద్దరికీ పెద్ద గొడవ జరిగిందని చెప్తుంది. నేను చెప్పను నువ్వే వెళ్ళి చెప్పు అని కార్తీక్ ని పంపిస్తుంది. ఇద్దరూ కాసేపు మంచి ఫన్ క్రియేట్ చేస్తారు. దీప దగ్గరకు వెళ్ళడానికి కాస్త భయపడతాడు. కార్తీక్ భయం భయంగా దీప దగ్గరకు వెళతాడు.
జ్యోత్స్న, శౌర్య కారు దగ్గర దాక్కుని చూస్తూ ఉంటారు. డోర్ కొడితే శౌర్య అనుకుని ఇంట్లోకి రమ్మని దీప పిలుస్తుంది. కానీ కార్తీక్ మాత్రం తలుపు కొడుతూనే ఉంటాడు. గుమ్మం వరకు వచ్చిన దానివి లోపలికి రాలేవా అని దీప బయటకు వస్తుంది. ఎదురుగా కార్తీక్ ఉండేసరికి కోపంగా చూస్తుంది.
షరతు ఒకటి
జ్యోత్స్న, నేను షాపింగ్ కి వెళ్తున్నాం శౌర్యని కూడా తీసుకుని వెళ్తామని అంటాడు. వద్దని అంటే తను రావాలని ఆశపడుతుందని అంటాడు. అవసరం లేదని దీప కోపంగా అంటుంది. అదే మాట శౌర్యని చూసి చెప్పమని చెప్తాడు. తను అంతగా బయటకు వెళ్లాలని అనుకుంటే నేను తీసుకుని వెళ్తానని అంటుంది. కార్తీక్ మళ్ళీ అడుగుతాడు.
మీతో పంపించడం నాకు ఇష్టం లేదని దీప అంటుంది. కార్తీక్ మాటలకు కన్వీన్స్ అవుతుంది. సరే తీసుకెళ్లండి కానీ ఒక షరతు బట్టలు కొనకూడదని చెప్తుంది. నాకంటూ దేవుడు మిగిల్చిన బంధం అదొక్కటే. పాప జాగ్రత్త అంటుంది. ఆ మాటలకు కార్తీక్ చాలా బాధపడతాడు. ఏనాటికైనా అర్థం చేసుకుని క్షమిస్తారని చిన్న ఆశ అంటాడు.
అమ్మ ఒప్పుకుందా అని శౌర్య అంటే నేను కదా వెళ్ళింది ఒప్పించేశానని అంటాడు. శౌర్య సంతోషంగా కారులో కిటికీ ఎక్కాలని తెగ సంబరపడుతుంది. ఇది రోజురోజుకీ అందరికీ దగ్గర అవుతుంది. ఇక్కడ ఉన్న సంతోషాలకు అలవాటు పడుతుంది. దీన్ని నేను ఆపగలనా అని దీప అనుకుంటుంది.
శౌర్య ఫుల్ ఖుషీ
కారులో హ్యాపీగా సన్ రూఫ్ మీద నిలబడి శౌర్య ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. రౌడీకి తగినట్టే రాకాసి పిల్ల అని పాట పెట్టి బాగా చూపించారు. మల్లేష్ ఇంట్లో పని చేసుకుంటూ అనసూయ తనని తాను తిట్టుకుంటుంది. అనసూయ నోరు వేసుకుని అరిచే సరికి మల్లేష్ ఇల్లు అమ్మేస్తానని అంటాడు. నీకు రెండు రోజులే టైమ్ ఇస్తున్నాను డబ్బు ఇవ్వకపోతే నువ్వు రోడ్డు మీద ఉండాల్సి వస్తుందని మల్లేష్ అనసూయకు వార్నింగ్ ఇస్తాడు.
దీప వెళ్ళి మూడు రోజులు అవుతుంది, కనీసం అక్కడ ఏం జరుగుతుందో ఫోన్ చేసి కూడా చెప్పలేదు. దీన్ని పెంచిన నా తమ్ముడికి దరిద్రం పట్టుకుంది, కట్టుకున్న నా కొడుక్కి దరిద్రం పట్టుకుంది. కోడలిని చేసుకున్న నాకు దరిద్రం పట్టుకుంది. ఆ దీప పెద్ద దరిద్ర దేవత అని తిట్టుకుంటుంది.
చంటిది నాన్న అని ఎగిరింది కదా చూసి ఉంటదా? చూసే ఉంటది వాళ్ళ నాన్నతో హైదరాబాద్ లో చక్కర్లు కొడుతూ ఉంటుందని అనుకుంటుంది. కార్తీక్ శౌర్యని తీసుకుని షాపింగ్ వస్తాడు. అక్కడ ఒక చిన్న పాప డ్రెస్ లు కనిపించడం లేదని తన నాన్నని పిలుస్తుంది. వెంటనే అతను వచ్చి ఆ పాపను ఎత్తుకుంటాడు అది చూసి శౌర్య బాధపడుతుంది.
తండ్రిలా మారిన కార్తీక్
తను పిలవగానే మా నాన్న వచ్చాడు మా నాన్న కూడా ఇలాగే వచ్చి చూపిస్తే బాగుండు అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి తనని ఎత్తుకుని చూపిస్తాడు. షాపులో బట్టలు చూసి తనకు నచ్చాయని చెప్తుంది. పాప కోసం రెండు తిట్లు తిన్నా పర్వాలేదని అనుకుని తన కోసం బట్టలు తీసుకుంటాడు.
శౌర్య షాపులో బట్టలు చూస్తూ ఉంటే తనని నరసింహ రెండో భార్య శోభ చూస్తుంది. శౌర్య కూడా శోభని చూసి భయపడుతుంది. ఆరోజు మా ఇంట్లో పువ్వులు కోసిన పిల్లవి నువ్వే కదా అంటుంది.