Karthika deepam 2 april 11th: కార్తీకదీపం 2 సీరియల్.. కార్తీక్ క్యూట్ ప్లాన్, బుట్టలో పడిన శౌర్య.. నరసింహ కంట పడిన దీప-karthika deepam 2 serial april 11th episode karthik devises a plan to deceive deepa about shopping ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 April 11th: కార్తీకదీపం 2 సీరియల్.. కార్తీక్ క్యూట్ ప్లాన్, బుట్టలో పడిన శౌర్య.. నరసింహ కంట పడిన దీప

Karthika deepam 2 april 11th: కార్తీకదీపం 2 సీరియల్.. కార్తీక్ క్యూట్ ప్లాన్, బుట్టలో పడిన శౌర్య.. నరసింహ కంట పడిన దీప

Gunti Soundarya HT Telugu
Apr 11, 2024 07:13 AM IST

Karthika deepam 2 serial april 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పండుగకు బట్టలు తీసుకోవాలని దీప అనుకుంటుంది. కానీ తన దగ్గర డబ్బులు తక్కువగా ఉండటంతో బాధపడుతుంది. కార్తీక్ దీప వాళ్ళకు తెలివిగా బట్టలు కొనిస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial april 11th episode: శౌర్య తన తండ్రి గురించి దీపను మరోసారి అడుగుతుంది. సర్ కి చూడు అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ అందరూ ఉన్నారు. మరి శౌర్యకు ఎవరు ఉన్నారు.. అమ్మ తప్ప ఎవరూ లేరు. మనకు ఇంతమంది ఉంటే ఎంత బాగుంటుందో. పండగకు నాన్న వస్తారా? అమ్మా అని అడుగుతుంది.

దీపకు అవమానం

రాడమ్మా ఈ పండుగ అయిన తర్వాత మనమే వెళ్తామని చెప్తుంది. బట్టలు కొనుక్కొవడానికి వెళ్దామని చెప్పి డబ్బులు చూస్తే సరిపోయేలా లేవని దీప అనుకుంటుంది. శౌర్యను తీసుకుని షాపింగ్ కి వెళ్తుంది. ఒక గౌను చూసి చాలా బాగుందని అనుకుంటారు. తక్కువ రేటుకు అడిగితే షాపు అతను రాదని అంటాడు. అదంతా కార్తీక్ చూస్తూ ఉంటాడు.

దీప బేరం ఆడుతుంటే అతను పొగరుగా సమాధానం చెప్పి శౌర్య చేతిలో గౌను లాగేసుకుంటాడు. బట్టలు కొనడానికి డబ్బులు ఉండవు కానీ బేరాలు ఆడతారని అంటాడు. దీంతో శౌర్య కోపంగా నీ డ్రెస్ తీసుకున్నావ్ కదా మా అమ్మని ఎందుకు తిడతావని రివర్స్ అవుతుంది. మా అమ్మని ఏమైనా అంటే రాయితో కొడతానని అంటుంది.

దీపను షాపింగ్ కి తీసుకెళ్లిన కార్తీక్

కార్తీక్ శౌర్యని ఆపి ఏంటే పెద్ద రౌడీలా తిరగబడుతున్నావ్ అంటాడు. మా అమ్మని ఎవరైనా ఏమైనా అంటే నిజంగానే కొడతానని అంటుంది. కార్తీక్ వాళ్ళని తనతో పాటు రమ్మని పిలిస్తే దీప మాత్రం రానని చెప్తుంది. మీకోసం మా అత్త పంపించిందని సుమిత్రను అడ్డం పెట్టుకుని వాళ్ళని తీసుకుని వెళ్లేందుకు చూస్తాడు.

షాపింగ్ మాల్ దగ్గరలోనే ఉంది రేట్లు చాలా తక్కువని శౌర్యకు ఆశ కల్పిస్తాడు. దారిన పోయే ఆటో అనుకుని తన కారు ఎక్కమని చెప్పి శౌర్య వాళ్ళను ఒప్పిస్తాడు. శౌర్య షాపింగ్ మాల్ చూసి నోరెళ్ళబెడుతుంది. ఇంత పెద్ద షాపులో తక్కువ ఎందుకు ఉంటాయి మమ్మల్ని అవమానించాలని అనుకుంటున్నారా అని దీప అంటుంది.

చిచ్చర పిడుగు రౌడీ

కార్తీక్ మాత్రం నచ్చజెప్పి వాళ్ళని తీసుకుని వెళతాడు. బట్టల షాపు మా ఊరు అంత ఉందని చెప్పి వాగుతూనే ఉంటుంది. కార్తీక్ ను షాపులో ఒక చోట ఆపి మీరు ఇక్కడే ఉండండి. మా రేంజ్ లో గౌన్లు మేము తీసుకుంటామని అంటుంది. షాపులో ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని డిస్కౌంట్ ఉందని చెప్పమని చెప్తాడు.

బిల్లు తాను కడతానని కానీ ఆ విషయం దీప వాళ్ళకు చెప్పొద్దని అంటాడు. కార్తీక్ చెప్పినట్టుగానే అతడు డిస్కౌంట్ ఉందని అబద్దం చెప్తాడు. ఒక గౌను చూసి రేటు ఎక్కువగా ఉందని చెప్పి వెళ్లిపోతుంటే వాళ్ళని ఆపి రేటు తక్కువని చెప్తాడు. దీపని కూడా చీర కొనుక్కోమని చెప్పి కార్తీక్ దూరం నుంచి సైగ చేసి షాపు అతనికి చెప్తాడు.

రౌడీ, కార్తీక్ ఫ్రెండ్స్

శౌర్య తల్లిని కూడా కొనుక్కోమని బలవంత పెడుతుంది. కార్తీక్ తెలివిగా దీప వాళ్ళకు నచ్చిన బట్టలు తీసుకుంటాడు. ఇది నీ మీద జాలితో చేయడం లేదు. మీరు కొంతైనా సంతోషంగా ఉండాలని చేస్తున్నాను. నువ్వు క్షమించలేదనే బాధ కంటే నీ పరిస్థితి చూసి ఏమి చేయలేకపోతున్నానని ఎక్కువ బాధగా ఉందని అనుకుంటాడు.

కార్తీక్ ని శౌర్య సర్ అని పిలుస్తుంటే వద్దని అంటాడు. పేరు పెట్టి పిలవమని చెప్తాడు. పెద్దవాళ్లను పేరు పెట్టి పిలవకూడదని మా అమ్మ చెప్పిందని అంటుంది. పెద్దవాళ్లను పిలవకూడదు కానీ ఫ్రెండ్స్ ని పిలవచ్చు అంటాడు. అయితే కార్తీక్ అని పిలుస్తానని అంటుంది.

మరి నన్ను శౌర్య అని పిలుస్తారా అని అడుగుతుంది. ఇందాక నీ రౌడీయిజం చూశాను కదా నిన్ను నేను రౌడీ అని పిలుస్తానని చెప్తాడు. ఇద్దరూ అలా ఫ్రెండ్స్ అయిపోతారు. దీప వాళ్ళు షాపింగ్ మాల్ నుంచి బయటకు వెళ్తుంటే నరసింహ ఎదురుపడతాడు. కానీ దీప చూడదు. ఇది ఊరు వెళ్లిపోయిందని అనుకున్నాను కానీ ఇది ఇక్కడే ఉంది అసలు వీడు ఎవడు దీప వీడితో ఎందుకు వచ్చిందని అనుమానపడతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point