Karthika deepam 2 april 3rd: భర్తని చేరుకున్న దీప, షాకిచ్చిన నరసింహ.. సుమిత్రను చంపేందుకు పారిజాతం ప్లాన్
Karthika deepam 2 serial april 3rd episode: ఎట్టకేలకు దీప తన భర్త నరసింహను చేరుకుంటుంది. కానీ సరసింహ రెండో పెళ్లి చేసుకుని ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Karthika deepam 2 serial april 3rd episode: దీప తన భర్త కోసం వెతుకుతుంది. రోడ్డు మీద డ్రైవింగ్ స్కూల్ అని బోర్డు ఉన్న కారు కనిపిస్తుంది. డ్రైవర్ గా పని చేస్తున్నాడని దీపకి గుర్తుకు వచ్చి కారు దగ్గరకి వెళ్ళి అతన్ని నరసింహ గురించి అడుగుతుంది. నరసింహ అనే పేరుతో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని చెప్పి వాళ్ళ అడ్రస్ అతను దీపకు ఇస్తాడు. సుమిత్ర తన కూతురికి ప్రేమగా తినిపిస్తుంది. అది చూసి పారిజాతం సుమిత్రని తిట్టుకుంటుంది.
సుమిత్రని చంపేందుకు కుట్ర
నువ్వు జ్యోత్స్న మీద నా నీడ కూడా పడనివ్వడం లేదు సుమిత్ర పైగా నేనంటే లెక్కలేనట్టు చాలా సార్లు మాట్లాడావ్. అయినా అది నీ కూతురు కాదు నా కొడుకు దాసు కూతురు. కార్తీక్ నాతో చెప్పినట్టు నేను నీకు చెప్పాను అంటే అల్లుడి మీద ప్రేమతో సరే అంటావ్. అలా జరగకూడదంటే నిన్ను నాదారిలోకి అయినా తెచ్చుకోవాలి లేదంటే అడ్డు తొలగించుకోవాలని పారిజాతం మనసులో అనుకుంటుంది.
సుమిత్ర దశరథని గుడికి వెళ్లాలని జ్యోత్స్న పోటీలో గెలిస్తే వస్తానని మొక్కుకున్నట్టు చెప్తుంది. కానీ తనకి బిజినెస్ మీటింగ్ ఉందని రాలేనని చెప్తాడు. పారిజాతం వచ్చి మీటింగ్ అంటున్నాడుగా వెళ్లనివ్వు అంటుంది. సరే అత్తయ్య నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పిన మాట నన్ను ఈడ్చి పెట్టి లాగి కొట్టినట్టుగా ఉంది. నేనంటే లెక్కలేదు కదా నీకు ఈ ఇంటి లెక్కల్లో నిన్ను లేకుండా చేస్తానని పారిజాతం మనసులో అనుకుంటుంది. దీప నరసింహ అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడ ఆచూకీ తెలియదు.
నరసింహని చేరుకున్న దీప
కార్తీక్ ఆఫీసు మేనేజర్ వచ్చి చెఫ్ చనిపోయాడని అతని కుటుంబానికి డబ్బులు ఇవ్వాలని అడుగుతాడు. కార్తీక్ వెంటనే తను చేసిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటాడు. వెంటనే ఆఫీసులో అందరికీ లైఫ్ కవరేజ్ ఇన్స్యూరెన్స్ చేయించమని చెప్తాడు. శౌర్య ఒక ఇంటి దగ్గర గులాబీ పూలు చూసి ఎంత బాగున్నాయో కోసి అమ్మకి ఇద్దామని అనుకుంటుంది. ఆ ఇంట్లో ఉండే ఆమె బయటకి వచ్చి శౌర్య పూలు కోసినందుకు కొట్టడానికి కర్ర తీస్తుంది. శౌర్య భయంతో దీప దగ్గరకి వెళ్ళి పూలు కొస్తే కొట్టడానికి వస్తుందని వాటిని తీసుకెళ్ళి ఇవ్వమని దీపకు ఇస్తుంది.
దీప ఆమె దగ్గరకు వెళ్ళి క్షమించమని అడుగుతుంది. పూలు తీసుకోమని ఇచ్చేస్తుంది. అప్పుడే శోభ అని ఒకతను పిలుపు వినబడుతుంది. అది విని దీప సంతోషంగా వెనక్కి తిరిగి చూస్తుంది. తన భర్త నరసింహని చూసి ఎన్నాళ్ళు అవుతుందయ్య నిన్ను చూసి అంటుంది. శోభని నరసింహ హడావుడిగా లోపలికి తీసుకెళ్తుంటే ఆపుతుంది. నీకోసం వస్తే వెళ్తావ్ ఏంటి ణా మొహం కూడా చూడని తప్పు నేనేం తప్పు చేశానని అడుగుతుంది. ఎవరు ఈమె నిన్ను అడుగుతుందని శోభ భర్తని నిలదీస్తుంది.
దీపకు సవతి పోరు
నేను నరసింహ భార్యని అనేసరికి శోభ షాక్ అవుతుంది. నువ్వు ఎవరని దీప తనని అడుగుతుంది. నువ్వు నరసింహ భార్య అయితే నేను ఎవరని అంటుంది. నేను తాళి కట్టిన భార్య అని చెప్పమని శోభ నరసింహని తిడుతుంది. ఏంటయ్యా ఇది ఈవిడ చెప్తుంది నిజమేనా అంటుంది. అంటే నీకు ముందే పెళ్లి అయ్యిందా? ఆ పిల్ల నీ కూతురా అని శోభ నిలదీస్తుంది. నరసింహ శోభని ఇంట్లోకి పంపిస్తాడు.
ఇన్నాళ్ళూ నువ్వు ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. నీకేం తక్కువ చేశానని ఇంకోదాన్ని కట్టుకున్నావ్. నువ్వు సంపాదించకపోయినా నేనేమీ అనలేదు. బిడ్డ పుట్టాక మారిపోతావ్ అనుకుంటే అప్పులు చేసి పారిపోయావు. నీకోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నాను. మల్లేష్ ఇంటిని జప్తు చేస్తానని అనేసరికి నీకోసం కూతురుని పట్టుకుని రోడ్లు వెంట పిచ్చిదానిలా తిరుగుతున్నాను. నాకు నా బిడ్డకి ఎందుకు అన్యాయం చేశావని నిలదీస్తుంది.
నీచంగా మాట్లాడిన నరసింహ
ఆపు నీ సోది మా అమ్మ గోల పడలేక నీ మెడలో నేను తాళి కట్టాను. పెళ్ళయిన నెల తిరగ ముందే పిల్ల లేరు అంటే నీకు బిడ్డని ఇచ్చాను. ఆ ఊరు ఏమైనా సిటీ అనుకుంటున్నావా? ఆ దిక్కుమాలిన ఊర్లో మీ మధ్య బతకలేక నా దారి నేను చూసుకున్నాను. అప్పులు నీకు సంబంధం లేదని చెప్పుకో లేదంటే నువ్వు తీర్చుకో అంటాడు. ఊరు వెళ్దాం రమ్మని అడుగుతుంది. రానని చెప్తాడు. మరి నేను, నా బిడ్డ సంగతి ఏంటని ఏడుస్తూ అడుగుతుంది. మర్యాదగా ఊరు వెళ్ళు ఇక్కడ ఏం జరిగిందో చెప్పకు అప్పుల వాళ్ళు వస్తే కేసు పెడతానని బెదిరించు. కావాలంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తానని నీచంగా మాట్లాడతాడు.
దీపతో నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. వీళ్ళ మాటలన్నీ శోభ వింటూ ఉంటుంది. తన మాటలకు దీప చిర్రెత్తుకొస్తుంది. మొగుడు కాబట్టి బతికిపోయావ్ లేదంటే చెప్పు తీసుకుని కొట్టే వాడినని తిడుతుంది.