Karthika deepam 2 serial march 29th: దీప జోలికి వస్తే చంపేస్తానన్న కార్తీక్.. మిసెస్ కార్తీక్ గా ఉండాలన్న జ్యోత్స్న
Karthika deepam 2 serial march 29th episode: దీప కోసం కార్తీక్ వెతుకుతూ ఉంటాడు. ఒక వ్యక్తి కనిపిస్తే అతడిని దీప గురించి అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడటంతో కార్తీక్ వాడి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Karthika deepam 2 serial march 29th episode: దీప దిగాలుగా ఇంటికి వచ్చి పని చేసుకుంటూ ఉండగా తన భర్తకి అప్పు ఇచ్చిన వ్యక్తి వస్తాడు. నీ పెనిమిటి నా దగ్గర అప్పు చేసి ఆరేళ్లు అయ్యింది. ఒక పని చెయ్యి దీప నువ్వు నన్ను నీ పెనిమిటి అనుకున్నావ్ అనుకో నీ బాకీ తీరుతుంది. నా అవసరం తీరుతుందని వాగుతాడు. దీంతో దీప లాగిపెట్టి ఒకటి ఇస్తుంది. ఆడగ్గానే మంచి నీళ్ళు ఇచ్చానని మొగుడు స్థానం కూడా ఇస్తానని అనుకున్నావా? నాలుక చీరేస్తాను ఇలాంటి తప్పుడు కూతలు కూశావంటే అని అతడికి వార్నింగ్ ఇస్తుంది.
దీప చేతుల్లో తన్నులు తిన్న వ్యక్తిని రోడ్డు మీద ఉంటే కార్తీక్ వచ్చి దీప ఇల్లు ఎక్కడని అతడినే అడుగుతాడు. ఎట్లా కనిపిస్తున్నాను. నీలాంటి వాళ్ళు వంద మంది దాని వెనుక ఉన్నా కూడా నేను అయితే దాన్ని వదిలిపెట్టను అంటాడు. మర్యాద లేకుండా అదీ ఇది అనొద్దని కార్తీక్ చెప్పేందుకు చూస్తాడు. కానీ అతడు మాత్రం అంటాను దాన్ని అయితే వదిలేది లేదు దాని అంతుచూస్తాను చెప్పు దానికి అని కార్తీక్ ముందు నోరు పారేసుకుంటాడు. దీంతో కార్తీక్ లాగి పెట్టి ఒకటి పీకి ఇంకోసారి దీప జోలికి వస్తే చంపి పారేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దీప మగవాళ్ళతో కలిసి సైకిల్ పోటీల్లో పాల్గొంటుంది. సైకిల్ పోటీలు అంటే గరిటె తిప్పినంత ఈజీ కాదు వంటలక్క మాతో ఎందుకు పోటీ అని మిగతా వాళ్ళు హేళనగా మాట్లాడతారు. కానీ దీపం మాత్రం పోటీలో గెలవడానికి దమ్ముంటే చాలు అని ధీమాగా చెప్తుంది. అందరికంటే ముందుగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది కానీ ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషన్, సెకండ్ ప్రైజ్ ఫ్రిజ్, మూడో సైకిల్ అని అనౌన్స్ చేస్తారు. దీంతో కూతురికి సైకిల్ ఇప్పించాలనే కోరికతో కావాలని వెనకబడిపోతుంది. తను కోరుకున్నట్టుగా మూడో స్థానంలో నిలుస్తుంది.
మిస్ హైదరాబాద్ గా జ్యోత్స్న
అటు మిస్ హైదరాబాద్ పోటీలో జ్యోత్స్నని విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. బిగ్ బాస్ విన్నర్ కౌశిక్ జ్యోత్స్నకి కిరీటం పెట్టి సత్కరిస్తాడు. తన మనవరాలు గెలిచిందని ఇంట్లో పారిజాతం ఫుల్ హడావుడి చేస్తుంది. ఎగిరి గంతులేస్తూ నానా హంగామా చేస్తుంటే అంత వద్దు కాస్త తగ్గించమని శివ నారాయణ పంచ్ వేసి నోరు మూయిస్తాడు.
ఇక ముత్యాలమ్మ జాతరలో సైకిల్ పోటీల్లో గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేయడానికి కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. తమ ఊరిలో వ్యాపారం పెట్టి యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నారని అక్కడ ఒక వ్యక్తి కార్తీక్ గురించి చెప్తారు. వచ్చింది ఎవరా అని దీప ఆత్రంగా చూస్తుంది. కానీ స్టేజ్ మీదకు వచ్చిన కార్తీక్ ని చూడగానే దీప తన వైపు కోపంగా చూస్తుంది. కార్తీక్ కూడా దీపని చూసి అపరాధ భావంతో మొహం పెడతాడు.
కార్తీక్ ని అసహ్యించుకున్న దీప
బహుమతి అందుకోవడానికి దీప స్టేజ్ మీదకు వస్తుంది. కార్తీక్ దీనంగా అందులో నా తప్పేమీ లేదు నన్ను నమ్మండి అని అడుగుతాడు. నేను నమ్మను నన్ను నమ్మించలేరు బాబు అని కోపంగా సమాధానం ఇస్తుంది. అసలు దీప, కార్తీక్ మధ్య జరిగిన గొడవ ఏంటి? ఆ తప్పు ఏంటి అనేది మాత్రం చూపించలేదు. సైకిల్ తీసుకుని వెళ్ళి శౌర్యకి ఇస్తుంది. అది చూసి బుడ్డది తెగ మురిసిపోతుంది.
కిరీటం గెలుచుకుని ఇంటికి వచ్చిన మనవరాలిని చూసి పారిజాతం తెగ సంబరపడిపోతుంది. తనకి దిష్టి తీయాలని చెప్పి తెగ హడావుడి చేస్తుంది. కోడలు మిస్ హైదరాబాద్ అయ్యిందని కాంచన వాళ్ళు తనకి ప్రేమగా విషెస్ చెప్పి పలకరిస్తారు. కానీ జ్యోత్స్న వాళ్ళని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. దీంతో సుమిత్ర కోప్పడుతుంది.
బావ మీద అలిగిన జ్యోత్స్న
కిరీటం వచ్చేసరికి కళ్ళు కూడా నెత్తి మీదకి ఎక్కాయా? అత్తయ్య వాళ్ళు పలకరిస్తున్నా పట్టించుకోలేదని కూతురిని తిడుతుంది. తనని ఏమి అనొద్దని కాంచన అడ్డుపడితే అవును అనాల్సింది నన్ను కాదు మిమ్మల్ని బావ ఎక్కడని జ్యోత్స్న సీరియస్ గా అడుగుతుంది. జ్యోత్స్న కోపం అందుకా అని అందరూ నవ్వుతారు. అమెరికా నుంచి వచ్చాడు బిజినెస్ అని తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు ఇంటికి కూడా రాలేదు. నాకు విష్ చేస్తూ ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదని జ్యోత్స్న అంటుంది.
రూపాయి సంపాదించడం కోసం ఎంతైనా చేస్తాడు కానీ నాకు ఒక మెసేజ్ కూడా పెట్టడు. నాకు మిస్ హైదరాబాద్ టైటిల్ కంటే మిస్సెస్ కార్తీక్ గా అనిపించుకోవడమే ఇష్టమని జ్యోత్స్న అంటుంది. ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పినా కూడా జ్యోత్స్న వినిపించుకోదు కార్తీక్ మీద కోపంతో అలుగుతుంది. తను ఇంటికి ఇంకా రాలేదని కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతుంది.
కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తనకి వివరంగా చెప్పాలి. తను క్షమిస్తే గాని నేను మనశ్శాంతిగా ఉండలేనని అనుకుంటాడు. వెంటనే తనకోసం వెతికేందుకు వెళతాడు. కానీ దీప ఎంత వెతికినా కనిపించదు. దీప దిగాలుగా ఏదో ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటుంది. దూరం నుంచే అనసూయ వాళ్ళని చూస్తుంది. శౌర్య చేతిలో కొత్త సైకిల్ ఉండటం చూసి దీప దగ్గర డబ్బులు లాగేసుకున్న విషయం గుర్తు చేసుకుంటుంది. సైకిల్ ఎక్కడిది అని అడుగుతుంది. జాతరలో మా అమ్మ సైకిల్ పోటీల్లో గెలిచి బహుమతిగా ఇచ్చిందని శౌర్య సంతోషంగా చెప్తుంది. మీ అమ్మ మొహానికి అదే ఎక్కువని అనసూయ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.