Karthika deepam 2 march 27th: పవర్ స్టార్ రేంజ్ లో డైలాగ్ కొట్టిన దీప.. మిస్ హైదరాబాద్ గా జ్యోత్స్న గెలుస్తుందా?
Karthika deepam 2 serial march 27th episode: జాతరలో సైకిల్ పోటీలు నిర్వహిస్తుంటే అందులో దీప కూడా పాల్గొంటుంది. సైకిల్ పోటీలో గెలవకుండా మనల్ని ఎవరు ఆపేదని దీప ధీమాగా కూతురితో చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Karthika deepam 2 serial march 27th episode: శౌర్య ఇంటికి వచ్చి తన మంచం మీద ఎందుకు కూర్చున్నావని అనసూయని తిడుతుంది. దీపని ఇన్ డైరెక్ట్ గా తిడుతుంది. నువ్వు కావాలని అనిపిస్తున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ మాటలకే నీ మొగుడు ఇంటికి రావడం లేదు ఊరి నిండా చేసిన అప్పులకు అందరూ నామీద పడుతున్నారని అంటుంది. కన్న కొడుకు సంగతి మీకు తెలియదా ఏంటని దీప సీరియస్ గా అంటుంది. శౌర్యకు సైకిల్ కొనడం కోసం దీప సంపాదించిన డబ్బులను అనసూయ లాగేసుకుంటుంది. ఎంతగా అడిగినా కూడా ఇవ్వదు.
జ్యోత్స్నకు దూరంగా ఉండమన్న శివనారాయణ
జ్యోత్స్న మీద కాంచన వాళ్ళు విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. జ్యోత్స్న కి పారిజాతం తెగ సపర్యలు చేస్తుంది. తనని అంటిపెట్టుకుని ఉంటుంది. బావ ఎక్కడని అడుగుతుంది. ఏదో బిజినెస్ పని మీద ఉన్నాడని కాంచన చెప్తుంది. బిజీగా ఉన్నాయని చెప్పి మెసేజ్ చేస్తాడు. మిస్ హైదరాబాద్ పోటీలకు వెళ్తుందని దశరథ అందరికీ చెప్తాడు. శివనారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మిస్ హైదరాబాద్ గా జ్యోత్స్న గెలుస్తుందని అంటారు. అందరితో పాటు పారిజాతం కూడా వెళ్లాలని అంటే శివనారాయణ వద్దని అంటాడు. ఇప్పటికే దాన్ని సెల్ఫిష్ గా పెంచి పోషించావు కనీసం ఇప్పటి నుంచైనా వాళ్ళ అమ్మానాన్నలకు వదిలేయమని తిడతాడు.
దీప కూతురిని తీసుకుని జాతరకు వస్తుంది. జాతర చూసి చాలా శౌర్య చాలా సంతోషిస్తుంది. ఇక్కడకి అందరూ వస్తారని అంటే అయితే నాన్న కూడా వస్తాడా? అని శౌర్య అడుగుతుంది. దీప మాత్రం మాట దాటేస్తుంది. అందరు పిల్లలు అమ్మానాన్నతో వచ్చారు కానీ నేను నీతో వచ్చానని శౌర్య బాధగా అంటుంది. ఏదో ఒకటి చెప్పి తన కూతురు మనసు మార్చాలని అనుకుంటుంది. సైకిల్ కొనిస్తానని అన్నావ్ కదా ఏదని అడుగుతుంది. డబ్బులు అనసూయ లాక్కున్న విషయం గుర్తు చేసుకుని బిడ్డ కోరిక తీర్చలేకపోతున్నానని దీప బాధపడుతుంది.
నాన్న కోసం తపిస్తున్న శౌర్య
మిస్ హైదరాబాద్ పోటీలు స్టార్ట్ అవుతాయి. కూతుర్ని చూసుకుని సుమిత్ర దంపతులు మురిసిపోతారు. అటు ఇంట్లో శివనారాయణ కుటుంబం టీవీలో ఇదే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. జాతర నుంచి వెళ్లిపోదామని దీప అంటే శౌర్య రానని మొండికేస్తుంది. నాన్న ఉంటే నాకు సైకిల్ కొనిచ్చే వాడేమో అనేసరికి దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన దురదృష్టానికి దీప మనసులోనే బాధపడుతుంది. తల్లికి ముద్దు పెట్టి కన్నీళ్ళు తుడుస్తుంది. నాకు ఏం వద్దు వెళ్లిపోదామని అంటుంది. ముత్యాలమ్మ జాతరలో సైకిల్ పోటీలో గెలిచిన వారికి విలువైన బహుమతులు ఇస్తామని ప్రకటిస్తారు.
అది విని శౌర్య సైకిల్ పోటీలకు వెళ్ళమని దీపకు చెప్తుంది. కూతురు కోసం పోటీలో పాల్గొంటానని చెప్తుంది. సైకిల్ పోటీలో మనల్ని ఆపేది ఏవరని దీప పవర్ స్టార్ స్టైల్ లో డైలాగ్ కొడుతుంది. అటు మిస్ హైదరాబాద్ పోటీలో ఫైనల్ రౌండ్ కి జ్యోత్స్న కూడా చేరుకుంటుంది. పోటీల్లో తన మనవరాలు గెలుస్తుందని బట్లర్ ఇంగ్లీషులో చెప్తుంది పారిజాతం. సొంత మనవరాలు అయినట్టు ఏంటి తెగ సంబరపడుతున్నావ్ అది నీకు వరసకు మనవరాలు మాత్రమేనని శివనారాయణ గుర్తు చేస్తాడు. ఫైనల్ రౌండ్ లో జ్యోత్స్న కాకుండా వేరే అమ్మాయి గెలుస్తుందని సుమిత్ర కంగారుపడుతుంది.
మనల్ని ఎవర్రా ఆపేది
పోటీలో మీ రోల్ మోడల్ ఎవరని జ్యోత్స్నని అడిగితే నేనే అనుకుంటుంది. నేను అనే పదం అందరికీ స్వార్థంలాగా అనిపిస్తుంది కానీ ఇతరులకు సాయం చేయాలంటే ముందు నేను బాగుండాలి కదా అంటుంది. జడ్జిలు అడిగిన ప్రశ్నలకు జ్యోత్స్న సమాధానాలు చెప్తుంది. అటు మగవాళ్ళతో కలిసి సైకిల్ పోటీలకు దీప కూడా దిగుతుంది. అమ్మా నీదే ఫస్ట్ ప్రైజ్ అని కూతురు ఎంకరేజ్ చేస్తుంది. మగవాళ్ళతో పోటీ అంటే గరిటె తిప్పినంత ఈజీ కాదని అందరూ హేళనగా మాట్లాడతారు. పోటీలో గెలవడానికి కావలసింది దమ్ము అది నాకు ఉందని దీప ధీమాగా చెప్తుంది.