Anasuya: అనసూయ సినిమాపై బాలీవుడ్ ఫోకస్.. రిలీజుకు ముందే స్టార్ హీరో రీమేక్.. క్రేజీగా ఫస్ట్ లుక్-anasuya ari movie vinod varma first look released abhishek bachchan interest to remake ari in bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anasuya Ari Movie Vinod Varma First Look Released Abhishek Bachchan Interest To Remake Ari In Bollywood

Anasuya: అనసూయ సినిమాపై బాలీవుడ్ ఫోకస్.. రిలీజుకు ముందే స్టార్ హీరో రీమేక్.. క్రేజీగా ఫస్ట్ లుక్

Sanjiv Kumar HT Telugu
Feb 29, 2024 08:07 AM IST

Anasuya Ari Abhishek Bachchan: బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ నటించిన లేటెస్ట్ సినిమా అరి. ఇప్పటికీ ఇందులో పాత్రను రివీల్ చేసిన మూవీ టీమ్ తాజాగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే విడుదలకు ముందే అనసూయ అరి సినిమాపై బాలీవుడ్ ఫోకస్ పెట్టింది.

అనసూయ సినిమాపై బాలీవుడ్ ఫోకస్.. రిలీజుకు ముందే స్టార్ హీరో రీమేక్.. క్రేజీగా ఫస్ట్ లుక్
అనసూయ సినిమాపై బాలీవుడ్ ఫోకస్.. రిలీజుకు ముందే స్టార్ హీరో రీమేక్.. క్రేజీగా ఫస్ట్ లుక్

Ari Vinod Varma First Look: యాంకర్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది అనసూయ. ఓవైపు యాంకర్‌గా మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ చాలా పాపులర్ అయింది అనసూయ. అలాంటి అనసూయ ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వచ్చిన సినిమా అరి. దీనికి 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది క్యాప్షన్. డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

అరి సినిమాను ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అనసూయ భరద్వాజ్‌తోపాటు వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ డైరెక్షన్‌లో అరి సినిమా తెరకెక్కుతోంది. అరి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల అరి మూవీలోని ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్‌గా, క్రేజీగా కనిపిస్తోంది. అరి సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘అరి’ సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్‌పై బాలీవుడ్ ఫోకస్ పెట్టింది.

అనసూయ అరి సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో విడుదలకు ముందే అభిషేక్ బచ్చన్ అరి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్. అయితే త్వరలోనే అరి సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.

అరి సినిమాలో వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్‌తోపాటు వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు నటిస్తున్నారు.

ఇది వరకు రిలీజైన అరి టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. కోరికలు తీర్చబడును అంటూ లైబ్రరీలో ఉన్న వ్యక్తి దగ్గరికీ ఒక్కొక్కరుగా వెళ్లి తమ కోరికలను చెబుతారు. వారిలో అనసూయ తన అందం ఎప్పటికీ అలాగే ఉండేందుకు ఏం చేయాలో అడుగుతుంది. అలాగే ఒక్కొక్కరు చెప్పే కోరికలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.

WhatsApp channel