Karthika deepam 2 serial: దీప తలరాత మార్చిన పారిజాతం.. యువరాణిగా పెరగాల్సిన బిడ్డ పేదింటికి చేరింది-karthika deepam 2 serial march 25th episode parijatham plot against her husband leads deepa to be estranged from family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: దీప తలరాత మార్చిన పారిజాతం.. యువరాణిగా పెరగాల్సిన బిడ్డ పేదింటికి చేరింది

Karthika deepam 2 serial: దీప తలరాత మార్చిన పారిజాతం.. యువరాణిగా పెరగాల్సిన బిడ్డ పేదింటికి చేరింది

Gunti Soundarya HT Telugu
Mar 26, 2024 08:28 AM IST

Karthika deepam 2 serial: కార్తీకదీపం సీజన్ 2 ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్లో హీరో, హీరోయిన్, విలన్ క్యారెక్టర్లను రివిల్ చేశారు. భర్త మీద అక్కసుతో అసలు బిడ్డను తప్పించి పారిజాతం తన మనవరాలిని యువరాణిని చేసింది.

కార్తీకదీపం సీజన్ 2 తొలి ఎపిసోడ్
కార్తీకదీపం సీజన్ 2 తొలి ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial: ప్రేక్షకులను అలరించిన కార్తీకదీపం సీరియల్ సీజన్ 2 ప్రారంభమైంది. కార్తీకదీపం ఇది నవ వసంతం ట్యాగ్ తో సీరియల్ తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో హీరో, హీరోయిన్, విలన్ క్యారెక్టర్లను రివీల్ చేశారు. కార్తీకదీపం 2 సీరియల్ మొదటి రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.. 

చాలా సంవత్సరాలకు ముందు.. అని పడుతుంది. ఒక మహిళ బిడ్డను కని స్పృహ లేకుండా హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంటుంది. ముసుగు వేసుకుని ఒక వ్యక్తి మరొక బిడ్డని తీసుకొచ్చి ఉయ్యాలలో ఉన్న బిడ్డని మార్చేస్తాడు. “మనిషి తలరాతను దేవుడు రాస్తాడని అంటారు. అది విధి లిఖితం కానీ దేవుడు రాసిన రాతను మార్చాలని అనుకుంటాడు మనిషి. కానీ విధి రాసిన రాత చరిత్ర అవుతుంది. అలాంటి ఒక గొప్ప చరిత్రకు నాంది పడింది ఈరోజే” అని బ్యాగ్ రౌండ్ వాయిస్ వస్తుంది. బిడ్డని దొంగిలించిన వ్యక్తి ఒకామెకి బిడ్డని ఇస్తాడు. ఈవిడే కుట్రకు సూత్రధారి పేరు పారిజాతం అంటూ ముందుగా విలన్ ని చూపిస్తారు.

బిడ్డని మార్చేసిన పారిజాతం 

విధి అంటే ఇదే నా కోడలు కల్యాణి ప్రసవించిన సమయాన నీ తల్లి సుమిత్ర నిన్ను కనడం ఏంటి?నీ ఖర్మ కాకపోతే. ఆ సుమిత్ర దశరథుల బిడ్డగా నా మొగుడు శివనారాయణ మనవరాలిగా పుట్టడం నువ్వు చేసిన పెద్ద నేరం. ఇక నుంచి నా సొంత మనవరాలు జీవితాంతం నీ స్థానంలో భోగభాగ్యాలు అనుభవిస్తూ యువరాణిలా బతుకుతుంది. మా ఆనందాన్ని దూరం చేసి నా కొడుకు జీవితంలో నిప్పులు పోసిన వాళ్ళ ఆనందాన్ని నేను దూరం చేస్తున్నానని పగతో రగిలిపోతుంది. ఈ నిజం మనకి తప్ప ఎవరికి తెలియడానికి వీల్లేదని సైదులు అని బిడ్డని దొంగిలించిన వ్యక్తికి చెప్తుంది. బిడ్డని చంపేయమని తనకి ఇస్తుంది.

అదంతా వేరే వ్యక్తి చాటుగా చూస్తూ ఉంటాడు. బిడ్డని తీసుకుని సైదులు వెళ్లిపోతే వీడిని నమ్మడానికి వీల్లేదని వాడిని ఫాలో అవమని మరొక వ్యక్తిని పంపిస్తుంది. దీనికి కారణం నా మొగుడు శివనారాయణ. ఇకమీదట పారిజాతం మనవరాలు నీ మనవరాలుగా పెరుగుతుంది. ఇదే నేను మీ అందరికీ విధించే పెద్ద శిక్ష అనుకుంటుంది. భర్త మీద కోపంతో పారిజాతం చేసిన పనితో యువరాణిలా బతకాల్సిన చిన్నారి నుదుటి రాత మారింది. సైదులు బిడ్డని చంపేయకుండా బస్టాండ్ లో వదిలేస్తాడు. పారిజాతం పంపించిన వ్యక్తి లారీతో సైదులిని గుద్ది చంపేస్తాడు. బస్టాండ్ లో ఏడుస్తున్న పసిబిడ్డను మంచి మనసున్న ఒక వ్యక్తి చూసి తనతో పాటు తీసుకెళ్లిపోతాడు.

హీరో క్యారెక్టర్ రివీల్ 

అదంతా పారిజాతం కొడుకు దాసు చూస్తూ ఉంటాడు. సుమిత్ర వాళ్ళు బిడ్డని చూసుకుని మురిసిపోతారు. తనని దశరథుడి తన చెల్లి కాంచన చేతిలో పెడతాడు. ఇది నా మేనకోడలు కాదు నా కోడలు. ఆడపిల్ల పుడితే నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావని అంటుంది. ఒక్కగానొక్క చెల్లెలివి నువ్వు అడిగిన మాట కాదనని అంటాడు. కాంచన కొడుకు కార్తీక్. కల్యాణికి కూడా పాప పుట్టిందంట ఎలా ఉందని సుమిత్ర అడుగుతుంది. పారిజాతం కోడలు దగ్గరకి వచ్చి ఏడుస్తుంది. బంగారం లాంటి ఆడపిల్ల పుట్టింది పుట్టిన పది నిమిషాలకే ఊపిరి వదిలేసిందని ఏడుస్తుంది. దాసు తల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.

తనకు కూడా కూతురు పుట్టిందని అది నీ మనవరాలేనని దశరథ తన బిడ్డని పారిజాతం చేతిలో పెడతాడు. చచ్చిపోయింది కల్యాణి కూతురు కాదు నీ కూతురని పారిజాతం మనసులో అనుకుంటుంది. తను చేసిన పాపానికి ప్రత్యక్ష సాక్షి దాసు అనే విషయం పారిజాతానికి తెలియదు. దాసు కోపంగా ఉండటం చూసి ఏమైందని అడుగుతుంది. దాసు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు. సుమిత్ర బిడ్డకు నామకరణం కార్యక్రమం చేస్తారు. దాసు తన బిడ్డని కోల్పోయి ఒట్టి చేతులతో ఇంటికి వస్తాడు.

దాసుని ఛీ కొట్టిన శివనారాయణ 

దాసును చూసి శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. పారిజాతం వెనుకే వెళ్తే నా మనవరాలి బారసాలకు నీ కొడుకుని ఎందుకు పిలిచావని అడుగుతాడు. వాడిని క్షమించమని అడుగుతుంది. క్షమించలేనని చెప్తాడు. నాకు కొడుకు ఉన్నాడని తెలిసే కదా పెళ్లి చేసుకుందని పారిజాతం అంటే అదంతా అనవసరం వాడు ఇంటికి రావడానికి వీల్లేదని శివనారాయణ తెగేసి చెప్తాడు. మీ పిల్లలను నా పిల్లలుగా చూస్తే మీరు నా కొడుకును మీ కొడుకుగా ఎందుకు చూడరని నిలదీస్తుంది. నేను అలాగే చూశాను కానీ ఏం చేశాడు పని పిల్లతో సంబంధం పెట్టుకుని తల్లిని చేశాడు. నేను వాళ్లిద్దరికీ న్యాయం చేశాను. వాడు చేసిన పరువు తక్కువ పనికి ఇంట్లో నుంచి బయటకి పొమ్మన్నానని అంటాడు.

నువ్వు మారవని తెలిసి నువ్వు అసహ్యించుకుంటున్న వాడి కూతురిని నీ మనవరాలిని చేశానని మనసులో అనుకుంటుంది. అలా భర్త మీద కోపంతో ఇంటి వారసురాలిని చేస్తుంది. దాసు భార్య బిడ్డని చూసి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ మన బిడ్డ వాళ్ళ బిడ్డ అనుకోమని సర్ది చెప్తాడు. ఇంకోక సంవత్సరంలో మనకి కొడుకు పుడతాడు వాడికి కాశీ అని పేరు పెడదామని అంటాడు. భార్య తనని తిడుతుంది. శివనారాయణ తన మొదటి భార్య ఫోటో ముందు నిలబడి మాట్లాడతాడు. పిల్లల కోసం పారిజాతాన్ని పెళ్లి చేసుకున్నాను అందుకు పరిహారంగా పాపకి నీ పేరే పెడతానని అంటాడు. సుమిత్ర బిడ్డకు జ్యోత్స్న అని పేరు పెడతాడు. అమ్మ పేరు పెట్టినందుకు దశరథ చాలా సంతోషిస్తాడు.

పారిజాతాన్ని చావు దెబ్బ కొట్టిన శివనారాయణ 

నా సవితి పేరు నా మనవరాలికి పెడతావా చావు దెబ్బ కొట్టావ్ గా అని పారిజాతం రగిపోతుంది. పారిజాతం చేసిన పని వల్ల యువరాణిలా పెరగాల్సిన పేద ఇంట్లో పెరుగుతుంది. బిడ్డకి దీప అని పేరు పెడతారు. మేం కనకపోయినా దీప మా కూతురని కుబేర అంటాడు. తన కన్నబిడ్డగానే పెంచుకుంటానని చెప్తాడు. బిడ్డ అనాథ అనే విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వమని అతను తన అక్కని అడుగుతాడు. తమ్ముడు మీద ప్రేమతో మాట ఇస్తుంది. ఇక మీదట దీప కుబేర కూతురుగానే పెరుగుతుందని అంటాడు.

వెండి వెన్నెల వెలుగుల మధ్య జ్యోత్స్న, పేదింటి వెలుగుల మధ్య దీప పెరుగుతారు. కుబేర వంటలు చేసుకుంటూ బతుకుతాడు. దీపని ప్రేమగా చూసుకుంటున్నందుకు కుబేర అక్క అనసూయ తనని తిడుతూ ఉంటుంది. అటు శివనారాయణ ఇంట్లో కూడా జ్యోత్స్నకి అన్నప్రాశన చేస్తారు. ఇక్కడ కుబేర ఇంట్లో దీపకు అన్న ప్రాశన చేస్తూ ఉంటారు. ఫోటోస్ తీస్తున్నారని అందులో అందంగా పడాలని పారిజాతం లిప్ స్టిక్ వేసుకుని సింగారించుకుంటుంది. శివనారాయణ పారిజాతం అని గట్టిగా పిలిచేసరికి లిప్ స్టిక్ కింద పడిపోతుంది. అది కాస్త జ్యోత్స్న పట్టుకుంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక దీప పుస్తకాలకు బదులుగా గరిటె పట్టుకోవడం చూసి కుబేరుడు నిరుత్సాహ పడతాడు.

నీ కూతురు కలెక్టర్ కావాలని కోరుకున్నావ్ కానీ అది వంటలక్క అయ్యింది. నువ్వు ఎటూ వంటలు చేస్తావ్ కదా నీ కూతురు నీకు సాయంగా ఉంటుందిలే అని అనసూయ దెప్పి పొడుస్తుంది. పాపకు దూరంగా ఉండమని శివనారాయణ పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. తన మనవరాలు తనకు నచ్చింది పట్టుకుందని పారిజాతం సంతోషిస్తుంది.

 

Whats_app_banner