తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ లో ఒకటి చల్ల పునుగులు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా దీనిని ఇష్టపడతారు. చల్ల పునుగులకు సరైన చట్నీ తగిలితే  ఈ రుచి అమోఘం అంటారు ఆహార ప్రియులు.  

twitter

By Bandaru Satyaprasad
Mar 25, 2024

Hindustan Times
Telugu

ఇంట్లోనే చాలా సులభంగా చల్ల పునుగులు, దానికి సరైన చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.  

twitter

చల్ల పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు- ఒక కప్పు మైదా, పావు కప్పు బియ్యపు పిండి, ఒక కప్పు పుల్లటి పెరుగు, తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, తరిగిన ఉల్లిపాయ, పావు కప్పు పచ్చిమిర్చి, ఒక టీస్పూన్ జీలకర్ర, సరిపడా నూనె  

twitter

తయారీ విధానం- ముందుగా ఒక గిన్నెలో మైదా, బియ్యపు పిండి, పెరుగు, ఉప్పు, వంటసోడా, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి, కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ బజ్జీల పిండిలా కాస్త జారుగా కలుపుకోవాలి.  

twitter

ఈ మిశ్రమాన్ని దాదాపు ఒకటి నుంచి రెండు గంటలపాటు మూతపెట్టి ఉంచాలి. గ్యాస్ పై కడాయిలో వేయించడానికి సరిపడా నూనెపోసి, పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బజ్జీల్లా వేసుకుని, అవి వేగేవరకు ఉంచి తీసుకోవాలి. వాటిని పేపర్ ఉన్న ప్లేట్ లో వేసుకుంటే, ఇప్పుడు కరకరలాడే చల్ల పునుగులు రెడీ అయ్యాయి.   

twitter

 చట్నీకి కావాల్సిన ప‌దార్థాలు- ఐదు లేదా తగినన్ని వేయించిన ప‌చ్చిమిర్చి, అరకప్పు పుట్నాల ప‌ప్పు, ఒక టేబుల్ స్పూన్ వేయించి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, నాలుగు చిన్న ప‌చ్చి కొబ్బరి ముక్కలు, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు  

twitter

చ‌ట్నీ త‌యారీ విధానం- గిన్నిలో నీళ్లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మిక్సీ ఆడుకోవాలి. త‌గిన‌న్ని నీళ్లను పోసి మరొకసారి మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డంతో చట్నీ త‌యార‌వుతుంది. ఈ చట్నీని తాళింపు కూడా పెట్టుకోవచ్చు.  

twitter

ఈ విధంగా చ‌ల్ల పునుగుల‌ను, చ‌ట్నీ త‌యారు చేసుకుని, ఉల్లిపాయ‌ల‌తో క‌లిపి తింటే అబ్బో ఆ రుచే వేరు. సాయంత్రం స‌మ‌యాల‌లో స్నాక్స్ గా చల్లపునుగులను చాలా బాగుంటాయి.   

twitter

వేసవి హీట్ నుంచి ఉపశమనం కోసం బెస్ట్ పానీయం లస్సీ. సమ్మర్ స్పెషల్ లస్సీలో ఏడు ప్రత్యేకమైన ఫ్లేవర్స్  మీ కోసం అందిస్తున్నాం 

pexels