Sleeping After Fight : గొడవపడి కోపంగా పడుకుంటున్నారా? వద్దొద్దు ప్లీజ్
Sleeping After Fight : కొంతమంది సరిగా.. పడుకునే ముందు గొడవ పెట్టుకుంటారు. కాసేపు అరిచి.. కోపంతో మంచం ఎక్కుతారు. ఇలా చేస్తే.. మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.
మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ కొన్నిసార్లు విభేదించే సందర్భాలు ఉండవచ్చు. ఒక్కోసారి అభిప్రాయభేదాలు గొడవలకు దారితీస్తాయి. ఇది జరిగే సమయం ఎప్పుడూ అని కరెక్ట్ గా చెప్పలేం. కానీ రాత్రి భోజనం(Food) తర్వాత లేదా మీరు పడుకునే ముందు గొడవలు పడి.. కోపంగా నిద్రపోతే ఇది సమస్య కావచ్చు.
గొడవ పడి కోపంగా పడుకుంటే చాలా విషయాలు జరిగే అవకాశం ఉంది. మొదటి విషయం ఏమిటంటే రాత్రిపూట నిద్రపోరు. అదే మనసులో తిరుగుతూ ఉంటుంది. అవి మీ ఆరోగ్యాన్ని(Health) ప్రభావితం చేస్తాయి. ఎప్పుడూ కోపంతో పడుకోకండి. మనశ్శాంతి లేకుండా పడుకుంటే చాలా సమస్యలు వస్తాయి.
గొడవ తర్వాత కోపంతో నిద్రపోతే, వాదన సమయంలో మీరు కలిగి ఉన్న ప్రతికూల భావోద్వేగాలతో ఇబ్బంది రావొచ్చు. మీరు మేల్కొన్నప్పుడు, మీరు ముందు రోజు కంటే కోపంగా ఉండవచ్చు. అందువల్ల, సమస్యకు పరిష్కారం కనుగొనడం కష్టతరం చేస్తుంది.
నిద్రవేళ(Sleeping Time) సమస్యల గురించి మీరు మాట్లాడకపోవడమే మంచిది. ఇలా మాట్లాడుకుంటే.. మీ భాగస్వామిని పగబట్టడం ప్రారంభించవచ్చు. రెండు మూడు రోజులు.. సాధారంగానే గడిచిపోతుంది. కానీ కొన్నిరోజుల తర్వాత.. ఇది క్రమంగా గొడవలకు దారి తీస్తుంది. కోపంగా పడుకోవడం మీ నిద్ర నాణ్యతను(Sleep Quality) ప్రభావితం చేస్తుంది. మీరు కోపంగా లేదా కలత చెందినప్పుడు, నిద్రించడానికి చాలా కష్టంగా ఉంటుంది. గొడవ గురించి ఆలోచిస్తూ మంచం మీద పడుకుని ఉంటే.. అస్సలు నిద్రపట్టదు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది ఎదుర్కొంటారు.
ఒకవేళ తప్పనిసరిగా గొడవ జరిగితే.. సమస్యను పరిష్కరించకుండా పడుకోకండి. మళ్లీ ఇద్దరూ.. అంతకుముందు ఎలా ఉండేవాళ్లో అలా సాధారణ స్థితికి వచ్చే విధంగా మాట్లాడుకోండి. లేకపోతే అది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. కమ్యూనికేషన్(Communication), అవగాహన లేకపోవడం మీ మధ్య చీలికను సృష్టిస్తుంది. దాన్ని సరిచేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే.. కొంతమంది రాత్రి(Night) గొడవ పడి.. తెల్లారి లేచాక.. ఆ విషయం గురించి మాట్లాడరు. కానీ మనసులో మాత్రం అలాగే ఉంటుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే మీ బంధం(Relationship) మీద ప్రభావం చూపుతుంది. అందుకే.. సమస్యను పరిష్కరించుకోండి.
సమస్యను విస్మరించడం లేదా దాని గురించి మాట్లాడకపోవడం అంటే అది తొలగిపోతుందని కాదు. వాస్తవానికి, ఇది పరిస్థితిని మరింత దిగజార్చడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు పడుకునే ముందు సమస్యను పరిష్కరించకపోతే, అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. రాత్రుళ్లు సరిగా నిద్రపట్టదు. ఫలితంగా ఆరోగ్యం(health) మీద ప్రభావం పడుతుంది. కోపంతో అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే కోపంగా పడుకోవద్దు.
కొన్ని కొన్ని చిట్కాలు మీ మనసుకు ప్రశాంతతనిస్తాయి. సంగీతంతో కాస్త మనసు బెటర్ అవుతుంది. మీ మనస్సును శాంతపరచడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సంగీతాన్ని వినండి. నెమ్మదిగా, లోతుగా ఊపిరి పీల్చుకోవడం మీ శరీరాన్ని శాంతపరచడానికి ఉపయోగపడతుంది. మెడిటేషన్ చేయండి. ఇది ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడానికి, కోపం, ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. మీరు మీ ఆలోచనలను రాయోచ్చు. రాత ద్వారా మీ కోపాన్ని వ్యక్తపరచవచ్చు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. అందువల్ల, డైరీని రాయడం కూడా మంచిది.
సంబంధిత కథనం