Girl swallows mobile: కోపంతో మొబైల్ ఫోన్ నే మింగేసిన బాలిక
Girl swallows mobile: సోదరుడితో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఒక 15 ఏళ్ల బాలిక కోపంతో తన మొబైల్ ఫోన్ ను మింగేసింది. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రతీకాత్మక చిత్రం
Girl swallows mobile: 15 ఏళ్ల బాలిక కోపంతో మొబైల్ ఫోన్ నే మింగేసిన ఘటన మధ్య ప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో జరిగింది. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసి ఆ బాలిక కడుపులో నుంచి ఆ మొబైల్ ను విజయవంతంగా బయటకు తీశారు.
Girl swallows mobile: కీ ప్యాడ్ తో ఉండే ఫీచర్ ఫోన్
మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) లోని భిండ్ జిల్లాలో ఉన్నఅమయన్ (Amayan) ప్రాంతంలో ఆ బాలిక కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సోదరుడితో గొడవ జరగడంతో కోపంలో ఆ బాలిక తన వద్దనున్న కీ ప్యాడ్ తో ఉండే ఫీచర్ ఫోన్ (FEATURE MOBILE PHONE) ను నోట్లో పెట్టుకుని మింగేసింది. దాంతో, కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆ బాలికను హుటాహుటిన భిండ్ (bhind) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితిని గమనించిన అక్కడి వైద్యులు ఆమెను వెంటనే గ్వాలియర్ లోని వేరే ఆసుపత్రికి రిఫర్ చేశారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆమెను గ్వాలియర్ (Gwalior) లోని జయ ఆరోగ్య ఆసుపత్రి (Jaya Arogya Hospital) కి తీసుకువెళ్లారు.
Girl swallows mobile: వెంటనే సర్జరీ..
బాలికను అడ్మిట్ చేసుకున్న జయ ఆరోగ్య ఆసుపత్రి (Jaya Arogya Hospital) వైద్యులు.. పరిస్థితి తీవ్రతను గమనించి వెంటనే ఆ బాలికకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత గంట పాటు శ్రమించి, సర్జరీ చేసి, ఆ బాలిక కడుపులో నుంచి ఆ మొబైల్ ఫోన్ ను బయటకు తీశారు. సర్జరీ అనంతరం బాలిక క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ ను ఇక్కడ చేయడం ఇదే ప్రథమమని జయ ఆరోగ్య ఆసుపత్రి (Jaya Arogya Hospital) సూపరింటెండెండ్ డాక్టర్ ఆర్కేఎస్ ఢాకడ్ వెల్లడించారు. ఇది తమ ఆసుపత్రి వైద్యుల ఘనత అన్నారు.