Couple Sleeping Benefits : మీ భాగస్వామి పక్కన నిద్రపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Couple Sleeping Benefits : నిద్ర అనేది మనిషి చాలా ముఖ్యం. నిద్రరాకుండా ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు. ఒత్తిడి, ఆందోళన లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. వీటన్నింటికీ ఒకటే మందు మీ భాగస్వామి.
జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనస్సుకు ఒక రిలాక్సింగ్ అనుభవం. భాగస్వామి మన పక్కన ఉన్నప్పుడు, శరీరం(Body), మనస్సులో ఉత్సాహంగా ఉంటుంది. వారితో గడిపిన ప్రతి క్షణం సంతోషకరమైన క్షణమే. కొన్ని అధ్యయనాల ప్రకారం, భాగస్వామి పక్కన నిద్రపోతే.. లోతైన నిద్ర వస్తుంది. లేదంటే అభద్రతాభావం, భయంతో నిద్రకు భంగం కలుగుతుందట. ఇదొక్కటే కాదు.. భాగస్వామి పక్కన పడుకుంటే మరెన్నో లాభాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒక వ్యక్తి మనస్సులో సంతృప్తి, ఆనందం ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు. మరోవైపు శ్రద్ధగల, ప్రేమగల భాగస్వామి పక్కన పడుకోవడం వల్ల మంచి నిద్ర(Sleeping)ను పొందడంలో మీకు సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. జీవితంలో భద్రతా భావం ఉన్నప్పుడే గాఢమైన నిద్ర వస్తుంది. మీ భాగస్వామి(partner) సాన్నిహిత్యంతో మీరు సురక్షితంగా భావిస్తే మీరు గాఢ నిద్రలోకి జారుకోవడం ఖాయం.
చిన్నతనంలో గాఢంగా నిద్రపోతాం. తల్లిదండ్రులు(Parents) మనతో ఉండడం వల్ల, మనం నిర్భయంగా నిద్రపోగలమని భావిస్తాం. తరువాత యుక్తవయస్సులో ప్రేమగల భాగస్వామిపై(Loving Partner) ఆధారపడతాం. వాళ్ళు బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంటే హాయిగా పడుకోవచ్చు
పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, మీరు ఇష్టపడే వారి పక్కన నిద్రపోతే మీ ఒత్తిడి(Stress) స్థాయిలు, ఆందోళనను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది జీర్ణ సమస్యలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
భాగస్వామి పక్కన పడుకోవడం వల్ల కూడా నిద్రలేమి(Sleeping Disorder) నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆక్సిటోసిన్ హార్మోన్‌ను పెంచుతుంది. ఈ హార్మోన్ బలమైన బంధాలను, లైంగిక కార్యకలాపాలను ప్రేరేపించే హార్మోన్. కలిసి నిద్రపోవడం మీ బంధాన్ని, ప్రేమను బలపరుస్తుంది.
మీరు మీ ప్రియమైన వారి పక్కన పడుకున్నప్పుడు, ప్రేమ పంచుకోవడం మీ ఆరోగ్యానికి కూడా మంచిది. కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయని, రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచే కణాలను ఉత్పత్తి చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను సమతుల్యంగా, బలంగా ఉంచడానికి బాధ్యత వహిస్తాయి.
వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా కనిపించాలంటే మేకప్ అవసరం లేదు. మీ ప్రియమైన భాగస్వామితో పక్కన నిద్రపోతే.. సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీ భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడపడం, ప్రేమతో కౌగిలించుకోవడం వల్ల మీరు సంతోషంగా, యవ్వనంగా కనిపిస్తారు. మీరు ఒత్తిడికి లోనవ్వకుండా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు యవ్వనంగా కనిపిస్తారు. ఈ ప్రయోజనాలను తెలుసుకున్నారుగా, మీ భాగస్వామితో కలిసి ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోండి.