Sleeping Tips : రాత్రంతా నిద్ర రావట్లేదా? మీ కోసం కొన్ని చిట్కాలు-here are simple tips to overcome insomnia check healthy sleeping tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Here Are Simple Tips To Overcome Insomnia Check Healthy Sleeping Tips

Sleeping Tips : రాత్రంతా నిద్ర రావట్లేదా? మీ కోసం కొన్ని చిట్కాలు

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 08:00 PM IST

Insomnia : ప్రస్తుతం చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రిపూట గంటల తరబడి మంచంపై పడుకున్నా నిద్రపట్టదు. మీరు కూడా నిద్రలేమితో పోరాడుతున్నట్లయితే మీరు కొన్ని ఇంటి నివారణలను అనుసరించాలి.

నిద్ర చిట్కాలు
నిద్ర చిట్కాలు (Unsplash)

నిద్ర రాకపోవడం అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. ఎంత ట్రై చేసినా కొంతమందికి నిద్రపట్టదు. దీనితో అనేక ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. వీటి నుంచి బయపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. నిద్రపట్టకపోవడం అనేది అలానే కొనసాగితే.. చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని చిట్కాలతో త్వరగా నిద్రపోండి.

మీకు గాఢ నిద్ర కావాలంటే, తిన్న వెంటనే నిద్రపోకండి. మంచి నిద్ర(Sleeping) కోసం, మీరు రాత్రి భోజనం(Dinner) తర్వాత కనీసం 2 గంటల తర్వాత పడుకోవాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా వాంతులు సంభవించవచ్చు. అందుకే భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు.

రాత్రి నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే పడుకునే ముందు బాదం పాలు(Badam Milk) తాగండి. ఎందుకంటే ఇందులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. కాబట్టి, మీరు నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే, మీరు బాదం పాలు తాగవచ్చు.

మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, చెర్రీస్‌ని మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే చెర్రీస్‌లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి(Body) విశ్రాంతినిస్తుంది. మీకు నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రవేళకు ఒక గంట ముందు, మీరు చెర్రీ రసం తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

నిద్ర రాకపోతే పసుపు పాలు తాగవచ్చు. ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా నిద్ర కూడా వస్తుంది. నిద్రపోయే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది.

ధ్యానం(Meditation) మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడి(Stress)ని తొలగించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మెలటోనిన్, మరియు సెరోటోనిన్‌లను పెంచుతుంది. రక్తపోటు, హృదయ స్పందనను తగ్గిస్తుంది.

ముందుగా మీ గదిలో ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసివేయాలి. ఆపై హాయిగా పడుకోండి. 10 సార్లు శ్వాస తీసుకుని వదిలివేయండి. ఇలా కనీసం 5 సార్లు చేయండి. మీ దృష్టిని మీ శ్వాసపై కేంద్రీకరించండి. ఈ సమయంలో మీ మనసులో ఏదైనా ఆలోచన వస్తే, మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి.

త్వరగా పడుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మనం త్వరగా పడుకున్నప్పుడు, మన శరీరానికి విశ్రాంతి, మళ్లీ తిరిగి శక్తి పొందడానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది మెరుగైన మానసిక స్థితి, పెరిగిన ఉత్పాదకత సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉంటాయి. తగినంత నిద్ర పొందడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు(Heart Disease), ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దూరం ఉండొచ్చు.

త్వరగా పడుకోవడం వల్ల మన శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఒత్తిడి(Stress)కి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మన ఒత్తిడి ప్రతిస్పందనకు కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా రాత్రి ప్రారంభ గంటలలో తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకోవడం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

WhatsApp channel