Loneliness Health Problems : ఒంటరితనం ఇష్టమా? క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయ్!-all you need to know serious health issues triggered by loneliness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Loneliness Health Problems : ఒంటరితనం ఇష్టమా? క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయ్!

Loneliness Health Problems : ఒంటరితనం ఇష్టమా? క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయ్!

HT Telugu Desk HT Telugu
Apr 03, 2023 11:18 AM IST

Health Issues With Loneliness : కొంతమంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారు తమ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. కానీ ఒంటరితనం మంచిది కాదు. ఇది మనకు శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది.

ఒంటరితనం
ఒంటరితనం

చాలామంది ఏకాంతంలో ఆనందాన్ని పొందుతారు. పొందుతున్నామనే భ్రమలో కూడా ఉంటారు. కానీ తెలియకుండానే.. డిప్రెషన్(Depression), విచారం, బాధను అనుభవిస్తారు. వెంటాడే ఒంటరితనం(loneliness) నుంచి బయటపడటం అసాధ్యం. మరో విషయం ఏమిటంటే, ఈ ఒంటరితనం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను(Health Problems) కలిగిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాడో తెలుసుకుందాం.

ప్రాణాంతకమైన క్యాన్సర్(Cancer) పేరు వింటేనే అందరూ షాక్ అవుతారు. ఎక్కువ ఒంటరితనం కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీంతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒంటరితనం డిప్రెషన్‌కు దారి తీస్తుంది. డిప్రెషన్ మనిషిని రోజురోజుకు చంపేస్తోంది. కొందరు జీవించాలనే కోరికను కూడా కోల్పోతారు. డిప్రెషన్ తరచుగా ఆత్మహత్యలకు దారితీసే సందర్భాలను మనం చాలానే చూశాం. డిప్రెషన్ తో వ్యక్తులు జీవితం పట్ల తమ అభిరుచిని కోల్పోతారు.

ఒంటరితనం గుండెపోటు(Heart Attack) ప్రమాదాన్ని 29 శాతం పెంచుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని 32 శాతం పెంచుతుంది. అధ్యయనాలు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించాయి.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర(Sleeping) అవసరం. కానీ ఒంటరితనానికి బానిస అయిన వ్యక్తి రాత్రి నిద్రపోడు. చింతలు, బాధలు వారిని ముంచెత్తుతాయి. రాత్రంతా మేల్కొని ఉంటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

సామాజిక ఆందోళన రుగ్మత ఉన్న వ్యక్తులు ఇతరులతో సాంఘికీకరించడానికి, మాట్లాడటానికి భయపడతారు. వారు ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకున్నందున వారికి ఎలా మాట్లాడాలో తెలియదు. మనసులో చాలా భయంతో ఉంటారు.

ఒంటరితనం మధుమేహానికి కూడా కారణం కావచ్చు. తీవ్రమైన జీవనశైలి(Lifestyle) సమస్యలు ఉన్నవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అందుకే మానసిక ఆరోగ్యం(Mental Health)పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నలుగురితో నవ్వుతూ ఉంటే.. చాలా రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు.

కొన్ని చిట్కాలు పాటించి.. ఒంటరితనాన్ని పొగొట్టాలి. యోగా(Yoga) చేయాలి. మనుషులు అంటేనే సరైన వ్యక్తీకరణకు చిహ్నం. స్వేచ్ఛగా వ్యక్తీకరణ చేయడానికి, మన వ్యక్తీకరణలపై తీర్పు ఇవ్వని అవగాహనతో కూడిన వాతావరణంలో ఉండడం అవసరం. కొత్త హాబీలు అలవరచుకోవడం, మనలోని అభిరుచులను అన్వేషించడం, కొత్త నెట్‌వర్క్ నిర్మించుకోవడం చేయాలి.

WhatsApp channel