Seasonal Depression । కాలానుగుణ డిప్రెషన్‌కు లోనైతే.. ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకోండి!
- Seasonal Depression: చల్లని వాతావరణం ఉన్నప్పుడు మనసులో కొంత నిరాశ, నిస్పృహలు కలుగుతాయట. ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా? సీజన్‌లో మార్పు కారణంగా ఇది ప్రేరేపించవచ్చు. లక్షణాలను తగ్గించడంలో సహాయపడే ఆహారాలు ఇక్కడ చూడండి.
- Seasonal Depression: చల్లని వాతావరణం ఉన్నప్పుడు మనసులో కొంత నిరాశ, నిస్పృహలు కలుగుతాయట. ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా? సీజన్‌లో మార్పు కారణంగా ఇది ప్రేరేపించవచ్చు. లక్షణాలను తగ్గించడంలో సహాయపడే ఆహారాలు ఇక్కడ చూడండి.
(1 / 7)
చల్లని వాతావరణంలో మూడ్ డిజార్డర్‌లు సర్వసాధారణం, ఉష్ణోగ్రతలు తగ్గినపుడు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) చాలా మందిని ప్రభావితం చేస్తుంది. అయితే దీనిని అధిగమించడానికి కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని సైకియాట్రిస్ట్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా నైడూ అన్నారు. మానసిక స్థితిని మెరుగుపరిచే ఆహారాలను వారు సూచించారు.
(Pixabay)(2 / 7)
కాలానుగుణ డిప్రెషన్‌తో పోరాడుతుంటే ఈ రకమైన మానసిక మార్పులను అధిగమించడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహార సిఫారసులు ఇక్కడ చూడండి.
(Unsplash)(3 / 7)
బెర్రీలు ఆంథోసైనిన్‌లతో నిండి ఉంటాయి, ఇది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్, ఒత్తిడిని తట్టుకోవడం, వాటి లక్షణాలకు వ్యతిరేకంగా ఇది పోరాడుతుంది.
(Unsplash)(4 / 7)
ఆహారంలో ఫోలేట్ లోపం వల్ల నిస్పృహ లక్షణాల ప్రమాదం పెరుగుతుంది. పాలకూరలో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.
(Unsplash)(5 / 7)
పులియబెట్టిన ఆహారం తీసుకోవాలి. జపనీయులు మిసో, నాట్టో, సోయా, టేంపే, సోయా సాస్ వంటి పులియబెట్టిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, జీర్ణక్రియను సులభతరం చేయడంలో, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి.
(Unsplash)(6 / 7)
పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది, ఇది డిప్రెషన్ లక్షణాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
(Pixabay)ఇతర గ్యాలరీలు