Depression Solution : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? నిద్రలేచాక ఈ పనులు చేయండి
Depression Solution : ప్రతి వ్యక్తి తన జీవితంలో నిరాశను ఎదుర్కొంటాడు. విపరీతమైన డిప్రెషన్‌తో బాధపడి ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉన్నారు. డిప్రెషన్ అనేది ఒక వ్యక్తిని నెమ్మదిగా చంపుతుంది.
జీవితంలో నిరాశ అనే దానిని ఎదుర్కొంటే ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటపడొచ్చు. చాలామంది ఈ జీవితం వద్దు అనే స్థితికి చేరుకుని వదిలేస్తారు. దాని నుంచి బయటపడేందుకు ఎలాంటి పనులు చేయరు. కానీ రోజూ ఇదే విషయం గురించి ఆలోచించి ఫిర్యాదులు చేస్తుంటారు. డిప్రెషన్ నుండి బయటపడటం ఎలా? ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేస్తే కచ్చితంగా డిప్రెషన్ నుంచి బయటపడి ఆనందంగా ఉండొచ్చు.
ఉదయం సరైన సమయానికి లేవండి
మీరు గతంలో మేల్కొనే సమయానికి, ఇప్పుడు మీరు మేల్కొనే సమయానికి మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు, మీరు మంచం నుండి లేవడానికి కూడా ఇష్టపడరు. బయటి ప్రపంచాన్ని చూడడానికి కూడా ఇష్టపడరు. అయితే ఇకపై అలా చేయవద్దు. మీ దినచర్యను మార్చుకోండి. ఉదయం లేవడానికి ట్రై చేయండి. అదే అలవాటు చేసుకోండి.
ఫన్నీ వాటిని చదవండి
ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంట్లో ఎవరితో అయినా.. గట్టిగా మాట్లాడి బయటకు వెళ్లకండి. రోజువారీ ఉదయం పనులు పూర్తి చేసిన తర్వాత, కొన్ని ఫన్నీ కథలు చదవండి. లేదా కార్టూన్ చూడండి. అదికూడా వీలుకాకపోతే కొన్ని కామెడీ వీడియోలు చూడండి. మీ మనసు సంతోషిస్తుంది.
బాగా రెడీ అవ్వండి
మీరు డిప్రెషన్‌తో బాధపడటం ప్రారంభించిన క్షణం నుండి, మీ రోజంతా మారిపోతుంది. కాబట్టి పొద్దున్నే నిద్రలేచిన వెంటనే పళ్లు తోముకుని స్నానం చేయండి. మంచి బట్టలు ధరించండి. మీరు ఇంటి నుండి పని చేసినా పర్వాలేదు. మీ జుట్టును బాగా దువ్వండి, మీ ముఖం అందంపై శ్రద్ధ వహించండి. అప్పుడు మీరు కొత్త అనుభూతిని పొందుతారు. మిమ్మల్ని చూసి.. మీరు అందగాళ్లుగా ఫీల్ అవ్వండి. ఓ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది.
యోగా, వ్యాయామం చేయండి
ఉదయం నిద్రలేచిన వెంటనే యోగా లేదా వ్యాయామం చేయండి. అప్పుడు మీ మనస్సు బాధ నుండి దూరంగా ఉంటుంది. వీలైతే బయట నడవండి. ఇతరులతో కలిసి మాట్లాడాలి. అలా చేస్తే.. రోజు గడిచే కొద్దీ మీ బాధను మరిచిపోతావు.
బాగా తినండి
డిప్రెషన్‌లో ఉన్నవారు సాధారణంగా భోజనం, స్నాక్స్ గురించి మరచిపోతారు. శరీర ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యం. అల్పాహారం సరిగ్గా తినండి. ఆకలిగా ఉన్నప్పుడు తినండి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ మీ ఆరోగ్యానికి మంచివి. లంచ్, డిన్నర్ కూడా బాగుండాలి. మీ శరీరానికి పోషకాహారం డిప్రెషన్ సమయంలో చాలా మేలు చేస్తుంది.
రోజు కోసం ప్రణాళికను రూపొందించండి
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే, ఈ రోజు మీరు ఏమి చేయాలో ప్లాన్ చేయండి. ఇలా చేస్తే రోజును చక్కగా ప్రారంభించవచ్చు. మీ ధ్యాసంతా రోజు చేయాల్సిన పని మీదే పోయినప్పుడు, ఇతర విషయాల గురించి.. చింతించాల్సిన పనిలేదు.
ఉన్నది ఒకటే జీవితం.. జీవించి ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. ఎంత బాధనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మీ జీవితానికి పరిపూర్ణత.