Protein is Mandatory in Diet : మీ డైట్లో ప్రోటీన్ లేకుంటే.. ఆరోగ్య సమస్యలు తప్పవు..
Protein is Mandatory in Diet : శరీరానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో ప్రోటీన్ అవసరం. ఇది నిర్దేశిత స్థాయి కంటే తక్కువగా ఉంటే.. వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రతిరోజూ తినే ఆహారంలో కొంతైనా ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు అంటారు.
(1 / 8)
ప్రోటీన్ కేవలం కండరాల నిర్మాణం కోసం అనుకుంటారు చాలామంది. కానీ ఈ పోషకం శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాబట్టి దీనిని మీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.(Pexel)
(2 / 8)
మెదడు పనితీరును మెరుగుపరచడానికి ప్రోటీన్ చాలా సహాయం చేస్తుంది. ఇది లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత పెరుగుతుంది. అలాగే తరచూ రకరకాల వ్యాధులతో ఇబ్బందిపడుతూ ఉంటారు.
(3 / 8)
రెగ్యులర్గా తింటున్నా.. సరైన మోతాదులో ప్రొటీన్ తీసుకుంటున్నారా అనే సందేహాన్ని వైద్యులు తరచూ అడుగుతూ ఉంటారు. నిపుణుల అనుమానాలు నిజమేనని తాజా అధ్యయనం రుజువు చేసింది.
(4 / 8)
ఇటీవలి జరిగిన అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తగినంత ప్రోటీన్ తీసుకోవట్లేదని నివేదికలు వెల్లడించాయి.
(6 / 8)
ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారని ఈ సర్వేలో తేలింది. అంటే దేశంలో 25 శాతం మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రోటీన్ లోపమే కారణం అంటున్నారు.
(7 / 8)
శరీరానికి తగినంత ప్రొటీన్ లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. బరువు కూడా అకస్మాత్తుగా మార్పులు వస్తాయి.
(8 / 8)
ప్రొటీన్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. అలాగే బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఇతర గ్యాలరీలు