Over-explaining: అతిగా వివరించే అలవాటుందా? కారణాలు తెలుసుకుని ఇలా మానేయండి..
Over-explaining: అతిగా వివరించే అలవాటు మీకుందా? దాని నుంచి బయటపడలేకపోతున్నారా? ముందుగా కారణాలు తెలుసుకుని దీని నుంచి బయటపడండి.
మన చుట్టూ ఉండే వారిలో ఎవరో ఒకరు అతిగా వివరించే స్వభావం కలిగి ఉండడాన్ని మనం చూసే ఉంటాం. ఇది ఒకరకమైన ఆందోళన నుంచి వస్తుంది. మనం ఇతరులకు ఏదో రుణపడి ఉన్నామన్న భావనతో ఇలా ఎక్కువగా వివరిస్తుంటాం. ఇంకా చెప్పాల్సిందేదో ఉందన్న భావన కూడా ఉంటుంది. ఇతరులకు మరింత స్పష్టత ఇవ్వాలన్న నిరంతర తపన కారణంగా ఇలా చేస్తాం. తమంతట తాముగా పనిచేసే సామర్థ్యం లేని వారిగా ఇది మనల్ని చిత్రిస్తుంది. దీనిపై సైకాలజిస్ట్ నికోల్ లెపెరా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చర్చించారు. ‘నో అని చెప్పడం లేదా సరిహద్దులు కలిగి ఉండడం మన శరీరానికి ఒక ముప్పులా పరిణమిస్తుంది. మనం గౌరవంగా, పరిమితులతో ఉన్నప్పుడు ఎదుటి వారు మనల్ని తప్పక గౌరవిస్తారు. అర్థం చేసుకునే శక్తి ఉన్న వారు దానిని మెచ్చుకుంటారు కూడా..’ అని నికోల్ వివరించారు.
ఈ అతిగా వివరించే అలవాటు ఎలా వృద్ధి చెందుతుందో చెబుతూ కొన్ని సందర్భాలను వివరించారు.
భావోద్వేగం: మనం తరచుగా భావోద్వేగానికి గురవుతాం. ఆ భావోద్వేగాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతాం. ఇతరులను సంతోషపెట్టడం ద్వారా మనం సురక్షితంగా ఉండాలన్న భావనకు లోనవుతాం. ఇది అతిగా వివరించేందుకు దారితీస్తుంది.
చెల్లుబాటు కాకపోవడం: మనం చిన్నతనంలో తల్లిదండ్రుల చేతిలో చెల్లుబాటు కానప్పుడు మనం అంత ముఖ్యం కాదన్న భావన ఏర్పడుతుంది. అందువల్ల ఇతరులను కించపరుస్తున్నామనో, వారిని కోల్పోతామనో భావన ఎల్లప్పుడూ ఉంటుంది.
ముప్పు: మనం అతిగా వివరించేటప్పుడు మన నాడీ వ్యవస్థ ఒక ముప్పు ఎదురవుతోందనే భావనకు లోనవతుంది. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోతాం. అందువల్ల మనల్ని మనం నియంత్రించుకోలేం.
పరిమితులు: మన సొంత సరిహద్దులు, పరిమితులు కలిగి ఉండాల్సింది పోయి.. చాలాసార్లు మనం చిన్నతనంలో ఇతరుల చేత మెప్పు పొందాలన్న ఆలోచనలు నేర్చుకుని ఉంటాం.
సౌకర్యం: మనం అతిగా వివరించడం ఆపాలంటే ఇతరులు మనల్ని సౌకర్యవంతంగా ఉండేలా చేయాలని, వారు మనకు భరోసా ఇవ్వాలనే విధంగా చేయాలని, అప్పుడే మనం సురక్షితంగా ఉన్నామనే భావనకు లోనవుతాం.
అతిగా వివరించడాన్ని నియంత్రించాలంటే మనం కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒత్తిడిని తట్టుకోవడం విస్తృతమైతున్నకొద్దీ మనకు అతిగా వివరించే అలవాటు తగ్గుతుంది. క్లుప్తంగా మాట్లాడడం నేర్చుకుంటే మన పట్ల అవతలి వ్యక్తి స్పందన కూడా తెలుస్తుంది.