తెలుగు న్యూస్ / ఫోటో /
Diet For Sleep । ప్రతిరోజూ మంచి నిద్ర కలగాలంటే.. మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి!
- Diet For Sleep: మీరు రోజూ తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా, మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు, మర్నాడు ఉదయం తాజాగా నిద్రలో నుంచి మేల్కోవచ్చు. ఇందుకోసం మీరు చేసుకోవాల్సిన మార్పులను చూడండి.
- Diet For Sleep: మీరు రోజూ తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా, మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు, మర్నాడు ఉదయం తాజాగా నిద్రలో నుంచి మేల్కోవచ్చు. ఇందుకోసం మీరు చేసుకోవాల్సిన మార్పులను చూడండి.
(1 / 8)
ఆరోగ్యకరమైన ఆహారం మీ నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మంచి నిద్ర పొందడానికి సహాయపడే కొన్ని ఆహార చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. (Unsplash)
(2 / 8)
కెఫీన్‌ను నివారించండి: కెఫీన్ మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. కాఫీ, టీ, ఎనర్జీ డ్రిక్స్ మొదలైన కెఫీన్-కలిగిన పానీయాలను మధ్యాహ్నం తర్వాత నివారించండి.(Unsplash)
(3 / 8)
ఆల్కహాల్ పరిమితం చేయండి: ఆల్కహాల్ వలన వచ్చే మత్తు మీకు మొదట్లో నిద్రపోవడానికి సహాయపడగలిగినప్పటికీ, అది తర్వాత నడిరాత్రిలో మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఆల్కహాల్ పరిమితం చేయడం లేదా పూర్తిగా నివారించడం ఉత్తమం. (Unsplash)
(4 / 8)
ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ట్రిప్టోఫాన్ అనేది అమైనో ఆమ్లం, సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, ఇది నిద్రను నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్. టర్కీకోడి, పాలు, గుడ్లు, గింజలు వంటి ఆహారాలలో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. (Unsplash)
(5 / 8)
హైడ్రేటెడ్‌గా ఉండండి: పగటిపూట తగినంత నీరు త్రాగడం వల్ల మీరు హైడ్రేట్‌గా ఉండేందుకు, డీహైడ్రేషన్-సంబంధిత నిద్ర అంతరాయాలను నివారించడంలో సహాయపడుతుంది. (Unsplash)
(6 / 8)
హెర్బల్ టీ తాగండి: పడుకునే ముందు క్యామోమైల్ లేదా వలేరియన్ రూట్ టీ వంటి హెర్బల్ టీని తాగడం వల్ల మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. (Unsplash)
(7 / 8)
భారీ డిన్నర్ చేయవద్దు: పడుకునే ముందు భారీగా తినడం వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. నిద్రవేళకు కొన్ని గంటల ముందు తేలికపాటి భోజనం తినడం మంచిది. (Unsplash)
ఇతర గ్యాలరీలు